HomeAndhra PradeshIntrest amout released by cm jagan: అక్కచెల్లెమ్మలకు కొండంత భరోసా.. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు...

Intrest amout released by cm jagan: అక్కచెల్లెమ్మలకు కొండంత భరోసా.. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌

Intrest amout released by cm jagan: రాష్ట్ర ప్రభుత్వం పేద అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తోంది. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు లబ్దిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ నిధులను సీఎం జగన్‌ నిన్న క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి విడుదల చేశారు. బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు అందిస్తున్నాయి. మహిళలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. (Intrest amout released by cm jagan)

ఇందులో భాగంగా 12.77 లక్షల మందికి రూ.4,500.19 కోట్ల బ్యాంకు రుణం అందించి అందులో ఈ దఫా అర్హులైన 4,07,323 మంది లబ్దిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.46.90 కోట్లను క్యాంపు కార్యాయలం నుంచి బటన్‌ నొక్కి సీఎం జగన్‌ జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..

దేవుడి దయ వల్ల ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా 12,77,373 మంది అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.35వేలు చొప్పున పావలా వడ్డీకే రుణాలిప్పించడమే కాకుండా.. వాటికి సంబంధించి ఈ దఫాలో 4,07,323 మందికి పావలా వడ్డీ కింది ఇవాళ రూ.47 కోట్లు జమ చేస్తున్నాం. ప్రతి ఆరునెలలకొకసారి ఈ కార్యక్రమం జరుగుతుంది.

గతంలో సున్నావడ్డీ డబ్బులు అక్కచెల్లెమ్మలకు విడుదల చేసినప్పుడు… దాదాపుగా 5,43,140 మంకి అప్పట్లో ఈ కార్యక్రమం కింద రూ.54 కోట్లు గతంలో విడుదల చేశాం. ఇవాళ ఇప్పుడు మరో 4,07,323 మందికి.. ఈ ఆరునెలల జాబితాలో మరో రూ.47 కోట్లు విడుదల చేస్తున్నాం. పావలా వడ్డీకే ఇలా ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి చేస్తూ.. రూ.35వేలు వారికిస్తూ.. తద్వారా వాళ్ల ఇళ్ల నిర్మాణం పురోగతిని వేగంగా చేసే కార్యక్రమం జరుగుతుంది.

దేశచరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, ఎవ్వరూ సాహసం చేయని విధంగా ఏకంగా 31.19 లక్షల ఇళ్ల స్ధలాలు నా అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. అందులో ఇప్పటికే 22.25 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతుంది. ఇది ఎక్కడా, ఎప్పుడూ రాష్ట్ర చరిత్రలో చూడని విధంగా జరుగుతుంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపుగా రూ.2.70 లక్షలు ఖర్చవుతుంది. మరో రూ.1లక్ష మౌలిక సదుపాయాల కోసం అదనంగా ఖర్చవుతుంది. అంటే ఇంటినిర్మాణం, మౌలిక వసతుల కోసమే దాదాపుగా రూ.3.70వేలు ఖర్చువుతుంది.

ఇలాంటిపరిస్థితుల్లో రూ.1.80 లక్షలు నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇస్తున్నాం. మరో రూ.35వేలు పావలా వడ్డీకి రుణాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. దాదాపు రూ. 15వేలు ఖరీదు చేసే ఇసుక సరఫరా చేస్తున్నాం. ఇవి కాక మరో రూ.40వేలు ఖరీదు చేసే సిమెంట్, మెటల్‌ ఫ్రేమ్‌లాంటి వివిధ రకాల వస్తువులు ఇస్తూ… వారికి మంచి జరిగే కార్యక్రమం చేస్తున్నాం.

ఒకవైపు రూ.2.70 లక్షలకు సంబంధించి ఇళ్లనిర్మాణం, రూ.1లక్షకు సంబంధించిన మౌలిక వసతులు నిర్మాణంలో ఉండగా.. ఈ 31.19లక్షల ఇంటి స్ధలాల్లో ఒక్కో ఇంటిస్ధలం విలువ జిల్లా, ప్రాంతాన్ని బట్టి కనీసం రూ.2.50 లక్షల నుంచి కొన్ని కొన్ని ప్రాంతాలు, జిల్లాల్లో రూ.15 లక్షల పై చిలుకు ఉంది.

ఈ ఇంటి స్దలం విలువ మీద.. నిర్మాణం కోసం ఖర్చు చేస్తున్న రూ.2.70వేలు, రూ.1 లక్ష విలువైన మౌలిక సదుపాయాలు అన్నింటినీ కలుపుకుంటే.. దాదాపుగా ప్రతి అక్కచెల్లెమ్మకు రూ.5లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆస్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వగలిగే గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి కార్యక్రమం జరుగుతుంది.

అందులో భాగంగా ఈ దఫా 4,07,323 మంది అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ.. సున్నా వడ్డీ కింద రూ.47 కోట్లు ఇస్తున్నాం.
బ్యాంకుల దగ్గర నుంచి దాదాపుగా 9 నుంచి 11 శాతం వరకు వడ్డీకి రుణాలు తీసుకుని, వాటిని తిరిగి బ్యాంకులకు కట్టే కార్యక్రమం అక్కచెల్లెమ్మలు ప్రాంప్ట్‌గా చేయాలి. అది వాళ్ల బాధ్యత. వాళ్లు కట్టిన వడ్డీ సొమ్మును తిరిగి వాళ్లకివ్వడం రాష్ట్ర ప్రభుత్వంగా మన కార్యక్రమం. ఆ అక్కచెల్లెమ్మలకు నికరంగా రూ.35వేలు మీద పావలా వడ్డీ మాత్రమే పడుతుంది. ఇది మంచి కార్యక్రమం. దీన్ని ముందుకు తీసుకువెళ్దాం.

read also: Junior NTR Flex: జూనియర్‌ను డైరెక్ట్‌గానే టార్గెట్‌ చేసిన చంద్రబాబు? బాలయ్య చేష్టలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ రియాక్షన్‌ ఏంటంటే..
YS Jagan Ugadi wishes: తెలుగు వారికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
YS Jagan with Pensioners: చంద్రబాబు 40 ఏళ్ల అనుభవంలో ఏనాడైనా ఇంటికే పెన్షన్‌ ఇచ్చాడా?: సీఎం జగన్‌ సూటి ప్రశ్న

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు