HomeAndhra PradeshJunior NTR Flex: జూనియర్‌ను డైరెక్ట్‌గానే టార్గెట్‌ చేసిన చంద్రబాబు? బాలయ్య చేష్టలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్‌...

Junior NTR Flex: జూనియర్‌ను డైరెక్ట్‌గానే టార్గెట్‌ చేసిన చంద్రబాబు? బాలయ్య చేష్టలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ రియాక్షన్‌ ఏంటంటే..

Junior NTR Flex: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో జరిగిన ఓ ఘటన సరికొత్త చర్చకు దారి తీసింది. ఎన్టీఆర్‌కు అసలైన వారసుడు లోకేష్‌ అని, జూనియర్‌ ఎన్టీఆర్‌ను సైడ్‌ చేసేస్తున్నారనే విశ్లేషణలు ఊపందుకుంటున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా గురువారం నందమూరి కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్‌ ఇద్దరూ ఒకసారి ఎన్టీఆర్‌కు నివాళులర్పించగా, బాలయ్య మాత్రం ప్రత్యేకంగా నివాళులర్పించారు. అయితే, ఈ సందర్బంగా జూనియర్‌ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలను బాలయ్య తీసేయించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఇప్పుడే తీసేయించెయ్‌.. అని హుంకరించారు బాలయ్య. ఈ కామెంట్స్‌తో జూనియర్‌ ఎన్టీఆర్ అభిమానులు గరం గరంగా ఉన్నారు. (Junior NTR Flex)

ఇక అధికార పార్టీ వైయస్సార్‌సీపీ శ్రేణులైతే ఎన్టీఆర్‌ను చంద్రబాబు వాడుకొని మళ్లీ తనదైన శైలిలో వెన్నుపోటు పొడుస్తున్నారంటూ ట్రోలింగ్‌ మొదలు పెట్టారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు జూనియర్‌ ఎన్టీఆర్. ఆ తర్వాత పార్టీకి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, టీడీపీ తన తాత స్థాపించిన పార్టీ అని, తమ కుటుంబం అంటూ జూనియర్‌ ఎన్టీఆర్ పలుమార్లు చెప్పుకుంటూ వచ్చారు. అయితే, ఇటీవల ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు దూరం అయ్యేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందుకు చంద్రబాబే కారణం అని విశ్లేషణలు వచ్చాయి. అనంతర పరిణామాలతో చంద్రబాబు.. పవన్‌ కల్యాణ్‌ను చేరదీయడం, పార్టీకి అండగా ఉండేలా చూసుకున్నారు. ఈ క్రమంలో జూనియర్‌ ఎన్టీఆర్, టీడీపీ మధ్య దూరం పెరిగిపోయింది.

ఆఖరికి చంద్రబాబు అరెస్టు సందర్బంగా కూడా జూనియర్‌ ఎన్టీఆర్ స్పందించలేదు. ఈ సమయంలోనే టీడీపీ శ్రేణులు జూనియర్‌ ఎన్టీఆర్‌పై విపరీతంగా నెగిటివ్‌ పోస్టులు, ట్రోలింగ్‌కు పాల్పడ్డాయి. అయితే, ఎక్కడా జూనియర్‌ ఎన్టీఆర్ సహనం కోల్పోకుండా తన షూటింగ్‌ పనులు చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా సీనియర్‌ ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఇవాళ బాలయ్య.. జూనియర్‌ ఎన్టీఆర్ కనపడిన ఫ్లెక్సీలు తీసేయించడంపై జూనియర్‌ ఫ్యాన్స్‌ భగ్గుమంటున్నారు. టీడీపీకి ఎప్పటికైనా జూనియర్‌ ఎన్టీఆరే వారసుడని, చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు తలొగ్గేది లేదంటున్నారు. లోకేష్‌లో నాయకత్వ లక్షణాలు కనిపించకపోవడం, రాజకీయాలు చేతకాక ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తుండటం టీడీపీని మునిగిపోయేలా చేస్తోందంటున్నారు.

తనకు పవన్‌ కల్యాణ్‌ అన్న అండగా ఉన్నాడంటూ ఇటీవల చంద్రబాబు అరెస్టు పరిణామాలు, పొత్తు రాజకీయాల్లో భాగంగా లోకేష్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పాదయాత్ర ముగింపు సభలోనూ లోకేష్ ఇదే తీరు కనబరిచారు. అయితే, జూనియర్‌ ఎన్టీఆర్‌ వస్తే.. లోకేష్‌ రాజకీయ కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పడుతుందనే భయంతోనే చంద్రబాబు జూనియర్‌ ఎన్టీఆర్‌ను అవాయిడ్ చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే జూనియర్‌ ఎన్టీఆర్‌ను బాలయ్య కూడా పక్కనపెడుతున్నారని చెబుతున్నారు. సొంత బాబాయి, మామ ఇలా వ్యవహరించడం జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఏ మాత్రం సహించడం లేదని సన్నిహితులు చెబుతున్న మాట. చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం, అధికారం చేపట్టడం కోసం ఎలాంటి చర్యలకైనా వెనుకాడరని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎలాంటి స్టెప్‌ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

కొడాలి నాని సపోర్ట్..

జూనియర్‌ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తీసివేయించడంపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు, బాలయ్య, లోకేష్‌ కలిసి ఎన్ని కుట్రలు చేసినా జూనియర్‌ ఎన్టీఆర్‌ వెంట్రుక కూడా పీకలేరంటూ వ్యాఖ్యానించారు. మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని బెస్ట్‌ ఫ్రెండ్స్‌. తనకోసం ప్రాణమైనా ఇచ్చే సన్నిహితుడంటూ కొడాలి నాని గురించి ఎన్టీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు కూడా. అలాగే వల్లభనేని వంశీతోనూ జూనియర్‌ ఎన్టీఆర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ ఇద్దరూ ఇప్పుడు జగన్‌ సన్నిహితులు కూడా. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ను ఎవరు ఏమన్నా కూడా వీరిద్దరూ రియాక్ట్‌ అవుతుంటారు. ఇప్పుడు కూడా చంద్రబాబు, లోకేష్‌, పవన్‌పై మాటల తూటాలు పేల్చాలంటే వీరిద్దరే ముందుంటారు.

ఇదీ చదవండి: YS Jagan vs Chandrababu: చంద్రబాబు 14 ఏళ్ల పాలన వర్సెస్‌ జగన్‌ నాలుగున్నరేళ్ల పాలన.. ఎవరి హయాంలో ఏం జరిగింది?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు