HomeLife StyleCentipede: జెర్రి గురించి ఆసక్తికర విషయాలు తెలుసా? జెర్రి కుడితే ఏం చేయాలంటే..

Centipede: జెర్రి గురించి ఆసక్తికర విషయాలు తెలుసా? జెర్రి కుడితే ఏం చేయాలంటే..

Centipede: సాధారణంగా చాలా మంది ఇళ్లలోకి జెర్రిలు వస్తుంటాయి. వీటిని చూడగానే భయపడి వెంటనే చంపేస్తుంటాం. ఇది మానవ నైజం. అయితే, జెర్రి కుట్టడం వల్ల చనిపోవడం జరగదని నిపుణులు చెబుతున్నారు. జెర్రిలను చాలా మంది అసహ్యించుకుంటారు. వాటిని చూస్తే వెంటనే భయపడి చంపుతుంటారు. జెర్రిలు మనుషులను కుట్టే సందర్భాలు చాలా తక్కువని నిపుణులు పేర్కొంటున్నారు. (Centipede)

జెర్రిని చంపడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. జెర్రి సెకనుకు 1.3 అడుగుల స్పీడ్‌ వెళ్తుంది. అలాంటి సందర్భాల్లో కర్ర సాయంతో వాటిని బయటకు పంపేలా ప్రయత్నించాలని సూచిస్తున్నారు. జెర్రి ఇంట్లోకి రావడం వల్ల మన ఇళ్లలో ఉండే బొద్దింకలు, పురుగులు, కీటకాలు, ఈగలు, దోమలు, నల్లులు లాంటి వాటిని తినేస్తాయట. అయితే, జెర్రి మనం ధరించే షూస్‌, చెప్పుల్లోకి ప్రవేశిస్తాయని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

జెర్రి చాలా వేగంగా కదులుతుంది. ఇందువల్ల దాన్ని రక్షించడానికి ఆస్కారం కూడా తక్కువ. వెంటనే శరీరంపైకి పాకేస్తుంది. దీంతో ఒళ్లంతా జలధరిస్తుంది. అంతెందుకు.. జెర్రి పాకుతోందన్న వార్త చదవడానికి కూడా ప్రత్యక్షంగా జెర్రి పాకినంత ఫీలింగ్‌ కలుగుతుంటుంది కొందరికి. ఈ నేపథ్యంలో అసలు జెర్రి కనిపించడమే ఆలస్యం.. వెంటనే చెప్పు తీసుకొని దాన్ని చంపి బయట పడేస్తుంటారు. గ్రామాల్లో అయితే, కోళ్లు వీటిని ఆహారంగా తినేస్తుంటాయి.

జెర్రిని చంపితే ఏమవుతుంది?

జెర్రి మన సమీపంలో కనిపించగానే చంపేస్తుంటాం. ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. జెర్రి కుట్టడం వల్ల ఆ ప్రాంతంలో ఎరుపుగా మారుతుంది. నొప్పి కాస్త ఎక్కువగానే ఉంటుంది. కొందరికి జెర్రి కుట్టడం వల్ల ఫీవర్‌ కూడా వస్తుంది. జెర్రి కుట్టినప్పుడు గోరు వెచ్చటి నీటితో కుట్టిన ప్రదేశాన్ని కడగాలి. ఐస్ ముక్కలను గాయంపై ఉంచవచ్చు. జెర్రిల వల్ల ఎలాంటి ప్రాణాంతక వ్యాధులు రావంటున్నారు. పరిస్థితి కాస్త శృతిమించినట్ల అనిపిస్తే.. వైద్యులను సంప్రదించాలి. మరోవైపు విదేశాల్లో జెర్రిలను పెంచుకునే వారు కూడా ఉన్నారట.

read also: Mogali Puvvu: ఒక్కసారి ఈ వాసన చూశారంటే ఇక రెచ్చిపోతారు.. మొగలి పువ్వుతో ఏం చేయాలంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు