YS Jagan vs Chandrababu: సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఈసారి సరికొత్త పుంతలు తొక్కింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. రోజుకో ప్రజా ప్రతినిధి ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి, అధికార పక్షం నుంచి ప్రతిపక్ష పార్టీలోకి జంపింగ్‌లు చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలది ఇదే తంతు. అయితే, ప్రతిపక్షం ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని చంద్రబాబు అండ్ కో ఉవ్విళ్లూరుతున్నారు. సీఎం జగన్ అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సీఎం జగన్ మార్క్ రాజకీయం అర్థం చేసుకోలేక ప్రతిపక్షం ఆపసోపాలు పడుతోంది. (YS Jagan vs Chandrababu)
20-30 ఏళ్లు అధికారంలో ఉండాలనే కాంక్షతో సీఎం జగన్ పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రణాళికలు రచిస్తుండటాన్ని టీడీపీ పసిగట్టింది. ఈ క్రమంలో ఏం చేసి అయినా సరే.. అధికారాన్ని చేజిక్కించుకోవాలని తహతహలాడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జనసేన-టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పనిలోపనిగా బీజేపీ కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం సర్వశక్తులూ ఒడ్డి ప్రధాని మోదీని ఒప్పించాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే, అధినాయకత్వం మాత్రం మళ్లీ టీడీపీతో జతకట్టేందుకు సంసిద్ధంగా లేదనేది బహిరంగ సత్యం.
ఉద్యోగాలు
బాబు 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే, జగన్ హయాంలో 1.40 లక్షల గ్రామ సచివాలయ శాశ్వత ఉద్యోగాలు, 52,000 ఆర్టీసీ, ఇతర శాఖలలో కలిపి మొత్తం 2.14 లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా కలుపుకుంటే 6.32 లక్షల ఉద్యోగాలు వైయస్ జగన్ కల్పించారు. రాష్ట్రంలో జగన్ హయాం నాలుగేళ్లలో పెరిగిన ఉద్యోగులు సంఖ్య అక్షరాలా 16,00,000 మంది. ఈ వివరాలు స్వయంగా రాజ్యసభలో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వెల్లడించినవే.
ఈపీఎఫ్ ఖాతాలు
* 2018-19 లో ఏపీలో ఈపీఎఫ్ ఖాతాలు-45 లక్షలు (44. 86 లక్షలు)
* 2022-23 లో ఏపీలో ఈపీఎఫ్ ఖాతాలు-61 లక్షలు (60.73 లక్షలు)
* అంటే జగన్ పాలనలో ఏపీలో పెరిగిన ఉద్యోగాలు (ప్రయివేట్ తో కలిపి) 16 లక్షలు
నిరుద్యోగ శాతం
* చంద్రబాబు హయాంలో 12 శాతం
* వైయస్ జగన్ హయాంలో 6 శాతం
పరిశ్రమలు
* ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మూడు సంవత్సరాలుగా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న ఏపీ.
* చిన్న పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) : బాబు దిగిపోయేనాటికి 1.93 లక్షలు
* జగన్ పాలనలో కొత్తగా 3.94 లక్షల ఎంఎస్‌ఎంఈల ఏర్పాటయ్యాయి. తద్వారా రూ.30,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 26.29 లక్షల మందికి ఉపాధి.
* ఎంఎస్‌ఎంఈల అభివృద్ధి కోసం రాష్ట్రంలో 54 క్లస్టర్ల ఏర్పాటు.
* రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా ఎంస్‌ఎంఈలకు దాదాపు రూ.2087 కోట్ల ప్రోత్సాహకాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది.
* బాబు హయాంలో రూ.60,000 కోట్ల పెట్టుబడులు వస్తే, ఇప్పుడు రూ.70,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
* 2023 మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు.. ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, జిందాల్, భంగర్, ఒబెరాయ్, భజాంకా, దాల్మియా, మిట్టల్, జీఎంరావు, కృష్ణ ఎల్లా, అపోలో ప్రీతారెడ్డి, సతీష్ రెడ్డి, బీవీఆర్ మోహన్‌రెడ్డి, మషాహిరో యమాగుచి, ‘టెస్లా’ మార్టిన్ ఎబర్‌హార్డ్ తదితర కార్పొరేట్ దిగ్గజాలు హాజరయ్యారు. ఈ సమ్మిట్‌లో రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఎంవోయూలను ప్రభుత్వం కుదుర్చుకుంది. తద్వారా 6.07 లక్షల మందికి ఉపాధి లభించనుంది.
* జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రాంకో సిమెంట్, సెంచూరీ ప్యానెల్స్, ఏటీసీ టైర్స్, ఆదిత్యా బిర్లా గార్మెంట్స్, డిక్సన్ టెక్నాలజీస్, గ్రీన్ లామ్ సౌత్, లారస్ ల్యాబ్స్ ఏర్పాటు. బ్లూస్టార్, డైకిన్, డిక్సన్, టీసీఎల్, మునోత్ తదితర అనేక ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏపీలో తమ కార్యకలాపాలను ప్రారంభించడమే కాకుండా విస్తరణ కార్యక్రమాలను చేపట్టాయి. ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, బీఈఎల్, రాడ్‌స్టాండ్ తదితర దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలను ప్రారంభించాయి.
రెవెన్యూ రాబడిలో పెరుగుదల
* బాబు పాలనలో6 శాతం, జగన్ పాలనలో 16.7 శాతం
* చంద్రబాబు హయాంలో ఏటా సగటున స్తూల ఉత్పత్తి GDSP : 6. 95 లక్షల కోట్లు
* జగన్ పాలనలో ఏటా సగటున స్తూల ఉత్పత్తి GDSP-10. 84 లక్షల కోట్లు
* రూ.17,000 కోట్లతో 45,000 వేల స్కూల్స్ జగన్ బాగు చేస్తున్నారు. బాబు హయాంలో సున్నా. పైగా విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని ప్రయివేటు స్కూళ్లను ప్రోత్సించారు.
* రూ.8480 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలు కట్టిస్తున్నారు. కోట్లు వెచ్చించి ప్రభుత్వ ఆసుపత్రులు నాడు-నేడు ద్వారా సీఎం జగన్ బాగు చేస్తున్నారు.
* ఇప్పటికే 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు మొదలయ్యాయి. బాబు హయాములో ఒక మెడికల్ కాలేజీ కట్టలేదు.
* రూ.20,000 కోట్లతో 4 పోర్టులు,10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు జగన్ హయాంలో ఏర్పాటు చేస్తున్నారు. రామాయపట్నం పోర్ట్ పూర్తి కావచ్చింది. రూ.3,200 కోట్లతో శరవేగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు జరుగుతున్నాయి.
15,000 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిన సీఎం జగన్. అందులో 1.40 లక్షల సచివాలయ సిబ్బంది పని చేస్తున్నారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. 10,132 విలేజ్ క్లినిక్స్, 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
53,000 మందికిపైగా వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బందిని జగన్ హయాంలో నియామకాలు చేశారు.
ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్, బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్స్, టోఫెల్ శిక్షణ, రూ.838 కోట్ల వ్యయంతో తరగతి గదుల్లో 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, 45,000 స్కూళ్లలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేసిన సీఎం జగన్.
సంక్షేమం
* డీబీటీ ద్వారా 2.48 లక్షల కోట్లు (రూ.2,47,564.36 కోట్లు) పేద వర్గాలకు నేరుగా చేర్చిన సీఎం జగన్.
* నాన్ డీబీటీ ద్వారా 1.68 లక్షల కోట్లు (రూ.1,67,530.95 కోట్లు) లబ్ధి చేకూర్చిన సీఎం జగన్.
* మొత్తంగా 4.15 లక్షల కోట్లు (రూ.4,15,095.31 కోట్లు) లబ్ధి
* 31,00,000పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చి, మొదటి దశలో 22,00,000 ఇళ్ల నిర్మాణం చేయిస్తున్న సీఎం జగన్.
అప్పులు
* రాష్ట్ర విభజన నాటికి : రూ.1,53,346 కోట్లు
* బాబు దిగిపోయేనాటికి : రూ.4,12,288 కోట్లు
* 2023 మార్చి నాటికి: రూ. 6,38,217 కోట్లు
* బాబు చేసిన అప్పు : రూ.2.60 లక్షల కోట్లు
* జగన్ చేసిన అప్పు : 2.25 లక్షల కోట్లు
* బాబు పాలనలో అప్పుల వృద్ధి రేటు: 22 శాతం
* జగన్ పాలనలో అప్పుల వృద్ధి రేటు: 12 శాతం
రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంటే ఒక వర్గం మీడియా, కొందరు నేతలు కలిసి వైయస్ జగన్ సర్కారుపై నిత్యం విషపూరిత కథనాలు, బురదజల్లే కార్యక్రమాలు చేస్తూ కేవలం చంద్రబాబు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందనే రీతిలో నిత్యం వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి: YS Jagan at Palasamudram: కరువు జిల్లాలో ప్రపంచ స్థాయి సంస్థను నెలకొల్పడం గర్వకారణం: సీఎం జగన్
