Jogi Ramesh on Pawan: చంద్రబాబు, పవన్ కు రాష్ట్ర అభివృద్ధి కనిపించడం లేదా? అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ ఏ అధికారాలతో పవన్ ప్రధానికి లేఖ రాశారని ప్రశ్నించారు. పవన్ చేసిన ఆరోపణలకు సమాధానాలు ఇస్తున్నామని చెప్పారు. తాడేపల్లిలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. (Jogi Ramesh on Pawan) ఇంకా ఏమన్నారంటే..
* పవన్ కు ఏపీలో ఆధార్ కార్డు లేదు, ఓటు లేదు.
* చంద్రబాబు తాబేదారుగా పని చేస్తున్నారు
* చంద్రబాబు కోసం పవన్ ఏ గడ్డయినా తింటారు
* ఏపీలో జరిగిన అభివృద్ధి మరే రాష్ట్రంలో జరగలేదు
* 30 లక్షల మందికిపైగా ఇళ్ల పట్టాలు ఇస్తే మీకు కనిపించడం లేదా?
* అక్కచెల్లెమ్మలకు సొంతింటి కల నెరవేర్చిన ప్రభుత్వం మాది
* పట్టాలతో సరిపెట్టకుండా 21 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తున్నాం
* ఇప్పటికే చాలా చోట్ల గృహ ప్రవేశాలు కూడా చేశారు
* ఏం స్కాం జరుగుతుందో పవన్ చెప్పాలి
* పవన్ కు కనీసం బుర్ర లేదు, జ్ఞానం లేదు
* స్కిల్ డెవలప్ మెంట్ స్కాం మీద పవన్ ఎందుకు లేఖ రాయలేదు
* చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై పవన్ ఎందుకు స్పందించలేదు?
* చంద్రబాబు ఇళ్లు ఇస్తానని మోసం చేశారు
* అప్పుడు పవన్ ఎందుకు చంద్రబాబును ప్రశ్నించలేదు
* స్కిల్ స్కాంలో పవన్ కు వాటా ఉంది
* హామీలు అమలు చేయని చంద్రబాబును పవన్ ప్రశ్నించాడా?
* డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి చేయని చంద్రబాబును ప్రశ్నించావా?
* 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారో పవన్ ప్రశ్నించారా?
* పవన్ కు బుద్ధి ఉంటే చంద్రబాబును ప్రశ్నించాలి
* చంద్రబాబుకు సవాల్ చేస్తున్నా
* ఏ గ్రామానికైనా వెళదాం…. ఎవరు ఇల్లు ఇచ్చారో అడుగుదాం
* ఏ సంక్షేమ పథకం ఎవరు అమలు చేశారో ప్రజలనే అడుగుదాం
* గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్ చేసి చూపించారు
* కుప్పం, నారావారి పల్లెలో కూడా జగన్ మార్క్ ఉంది
* రాష్ట్రంలో చంద్రబాబు మార్క్ ఎక్కడైనా ఉందా?
* ఎక్కడైనా ఏదైనా ప్రజల కోసం చంద్రబాబు చేశారా?
* శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే బురద జల్లుతున్నారు
* కుప్పంలో ఎయిర్ పోర్టు కడతానంటూ చంద్రబాబు చెబుతున్నారు
* కుప్పం ప్రజలకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వని వ్యక్తి చంద్రబాబు
* కుప్పం ప్రజల దాహార్తిని తీర్చింది వైఎస్ జగన్
* పేద ప్రజలకు మంచి జరుగుతుంటే ఓర్చుకోలేకపోతున్నారు.
ఇదీ చదవండి: Bhimavaram MLA: భీమవరం సెంటిమెంట్.. ఏ పార్టీ గెలిస్తే వారిదే అధికారం: గ్రంధి శ్రీనివాస్

[…] read also: Jogi Ramesh on Pawan: 30 లక్షల మందికిపైగా ఇళ్ల పట్టా… […]