HomeAstrologyRasi Phalalu 2024 Venu swamy: వేణు స్వామి చెప్పిన సంచలనాలు.. 2024లో ఏ రాశి...

Rasi Phalalu 2024 Venu swamy: వేణు స్వామి చెప్పిన సంచలనాలు.. 2024లో ఏ రాశి వారికి ఎలా ఉందంటే..!

Rasi Phalalu 2024 Venu swamy: తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్‌ జ్యోతిష్యుడిగా పేరు పొందిన ప్రముఖ ఆస్ట్రాలజర్‌ వేణు స్వామి ఇటీవలి కాలంలో ఎక్కువ ట్రోలింగ్‌కు గురవుతున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ఓడిపోవడం, ప్రభాస్‌ సినిమా సలార్‌ హిట్‌ కావడంతో వేణు స్వామి జ్యోతిష్యంపై చాలా మంది ట్రోల్‌ చేస్తున్నారు. దీనిపై ఆయన భిన్నంగా స్పందించారు. తనను ఎంత ట్రోల్‌ చేస్తే అంత ఫేమస్‌ అవుతానంటున్నారు. ట్రోలింగ్‌ చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2024లో ద్వాదశ రాశుల ఫలితాలను వివరించారు. (Rasi Phalalu 2024 Venu swamy)

ఏప్రిల్‌లో శ్రీ క్రోధి నామ సంవత్సరం రాబోతోంది. ఈ సంవత్సరానికి రాజు కుజుడు. మంత్రి శని. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఒడిదొడుకులుంటాయి. ప్రపంచం అంతటా యుద్ధ వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది. ప్రజలు లిక్విడ్‌ క్యాష్‌ దగ్గర పెట్టుకోవడం మంచిది. అనవరంగా టూర్ల పేరుతో డబ్బులు వేస్ట్‌ చేసుకోవద్దు. (Rasi Phalalu 2024 Venu swamy) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులతో మునిగిపోతాయి. సంక్షేమ పథకాలు పోటాపోటీగా అమలు జరుగుతాయి. కొత్త రోగాలు ప్రబలి ప్రపంచాన్ని హడలగొడతాయి. మన దేశానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతాయి. రైతులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు. రెండో పంట అనుకూలిస్తుంది. రేగడి, ఇసుక నేలల్లో బాగా పంటలు వస్తాయి. పత్తి, మిర్చి, పసుపు, కంద, ఉల్లి, తృణధాన్యాలు, ధనియాల పంటలు బాగా పండుతాయి. మంచి ధరలు వస్తాయి.

ఈ సంవత్సరం రాజులు నింతరం కలహిస్తారు. రాష్ట్రాల మధ్య విరోధాలు ఉంటాయి. ఈ ఏడాది విడాకుల సంఖ్య అధికమవుతుంది. సునామీ, భూకంప హెచ్చరికలు, అగ్నిపర్వతాలు బద్ధలవుతాయి. పాముకాటు వల్ల మరణించేవారి సంఖ్య పెరుగుతుంది. ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు అనారోగ్యం, ప్రాణగండం సూచనలు కనిపిస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో పాలించే ప్రభుత్వానికి కాస్త వ్యతిరేకత ఉంటుంది. ప్రతిపక్షానికి కూడాపెద్దగా ఏమీ కనిపించడం లేదు. దేశంలో ఒకటి రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వం పడిపోవడం, లేదా ముఖ్యమంత్రి మారడం గోచరిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో పాలన బాగుంటుంది. ముఖ్యమంత్రికి పదవిలో అడ్డంకులు గోచరిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో గంజాయి వాడకం పెరిగి యువత మత్తులో జోగుతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు జైలుకు వెళ్తారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరో ఆరోగ్యం సంచలనంగా మారుతుంది. బాలీవుడ్‌ హీరోకు సంబంధించిన వ్యక్తిగత జీవితం సంచలనంగా మారుతుంది. తెలుగు రాష్ట్రానికి చెందిన ప్రముఖ నాయకుడి కొడుకు, యువ నాయకుడు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ నాయకుడి జీవితం మీడియాకు ఎక్కడం వల్ల సంచలనం నమోదవుతుంది. తెలంగాణలో రాష్ట్రంలో సెక్రటరీ స్థాయి అధికారులు, చాలా మంది బ్యూరోక్రాట్లు కేసులకు గురయ్యే అవకాశం, లేదా జైలుకు వెళ్లే అవకాశం.

మేష రాశి:

* అశ్వని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం
* ఆదాయం: 8, వ్యయం: 14, రాజపూజ్యం: 4, అవమానం: 3

* గురువు, శని, రాహు కేతువులు బలంగా ఉండటం వల్ల ప్రతి ప్రయత్నం సఫలీకృతం అయ్యే అవకాశం.
* మానసిక ఉత్సాహం ఉంటుంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది.
* ఇల్లు, ఆస్థి లాంటివి కొనుగోలు చేయగలుగుతారు.
* సమయపాలనపై దృష్టి పెడతారు.
* రుణ బాధల నుంచి విముక్తి పొందగలుగుతారు.
* విద్యార్థులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. విదేశీ ప్రయాణానికి అనుకూలంగా ప్రయత్నించి విజయం సాధిస్తారు.
* అవివాహితులకు వివాహం కుదిరే అవకాశం. సంతానం కలిగే అవకాశం.
* వ్యవసాయదారులకు రెండో పంట లాభదాయకంగా ఉండే అవకాశం.

వృషభ రాశి:

* కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2వ పాదాలు
* ఆదాయం: 2, వ్యయం: 8, రాజపూజ్యం: 7, అవమానం: 3

* ఈ సంవత్సరం మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి.
* ఉద్యోగులకు బదిలీలు అయ్యే అవకాశం. ఊహించిన వాటికి వ్యతిరేకమైన దిశగా బదిలీలుండే చాన్స్‌.
* అధికారులు, రాజకీయ నాయకులకు ప్రతికూల వాతావరణం ఉంటుంది.
* విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.
* వ్యవసాయదారులకు, కార్మికులకు మధ్యస్తంగా ఉంటుంది.
* అవివాహితులు, నిరుద్యోగులు ఓపికతో ముందుకు సాగాలి.
* భూమి, గృహ సంబంధ కొనుగోలుకు నవంబర్‌ వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి.

మిథున రాశి:

* మృగశిర 2, 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3వ పాదాలు
* ఆదాయం: 5, వ్యయం: 6, రాజపూజ్యం: 3, అవమానం: 6

* గురువు, రాహువు, శని గోచారం వల్ల, రాహువు రాజయోగం వల్ల మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి.
* జూలై నెల నుంచి కొద్దిగా వ్యతిరేకత కనిపిస్తోంది.
* రాజకీయ నాయకులకు ఉగాదిలోపు గెలుపు ఉంటుంది.
* కుటుంబంలో చికాకులు, కోర్టు వ్యవహారంలో, క్రయ విక్రయ వ్యవహారంలో వాయిదాలు పడతాయి.
* రుణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
* విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది.
* గురువు వ్యయంలోకి, నెగిటివ్‌ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఉగాది వరకు బాగుంది.
* మే తర్వాత కొద్దిగా కష్టాలు ఉంటాయి.

కర్కాటక రాశి:

* పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4వ పాదాలు
* ఆదాయం: 14, వ్యయం: 2, రాజపూజ్యం: 6, అవమానం: 6

* సంఘంలో గౌరవ ప్రతిష్టలు, సముచిత స్థానం లభిస్తుంది.
* సంతానం కుటుంబానికి మద్దతుగా ఉంటారు.
* అన్ని ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు.
* ఆదాయం, వ్యాపారంలో విజయాలు పెరుగుతాయి.
* మే నెల నుంచి గురువు వల్ల సుఖ సౌఖ్యాలు పెరుగుతాయి.
* గడచిన చాలా సంవత్సరాల నుంచి వీరు పడుతున్న కష్టాలకు తగిన గుర్తింపు, గౌరవ
సన్మానాలు దక్కుతాయి.
* ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం లభిస్తుంది. అవకాశాలు పెరుగుతాయి.
* వ్యాపారంలో విజయం, ముందంజ వేస్తారు.
* అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి.
* ఉపకార స్వభావంతో దయాగుణం కలిగి ఉంటారు.
* అష్టమశని వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
* అనేక రకాలుగా అవకాశాలు వెతుక్కుంటూ ముందడుగు వేసే అవకాశం కనిపిస్తోంది.
* మీలో ఉన్న సృజనాత్మక శక్తి బయటకు వచ్చి మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచుతుంది.
* మీరు ఇతరులకు సాయపడేలా పరిస్థితులు ఏర్పడతాయి.
* రాజకీయ నాయకులకు, న్యాయవాదులకు సమస్యలుంటాయి.
* చిన్న చిన్న శారీరకమైన, మానసిక ఇబ్బందులు అందరూ ఎదుర్కోవాల్సి వస్తుంది.

సింహ రాశి:

* మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం
* ఆదాయం: 2, వ్యయం: 14, రాజపూజ్యం: 2, అవమానం: 2

* ఉద్యోగస్తులకు పని చేసే చోట ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
* పై అధికారుల ఆగ్రహ, అహంకారాలు చవిచూడాల్సి వస్తుంది.
* ఉద్యోగస్తులకు మార్పు కనిపిస్తోంది.
* గృహ వాతావరణం సరిగ్గా లేని కారణంగా ఇంట్లో దొంగలు పడటం, విలువైన వస్తువులు పోగొట్టుకోవడం వంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి.
* పనుల్లో విజయాన్ని సాధిస్తారు.
* అవివాహితులకు వివాహం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
* రాజకీయ నాయకులు ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తారు.
* అన్ని రకాల వ్యాపారులకు, రైస్‌మిల్లర్లకు గతం కంటే అనుకూలమైన సమయం.
* భూమి, గృహానని కొనుగోలు చేస్తారు.
* సినిమా పరిశ్రమ వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.
* కొన్ని రకాల వ్యాధులు సంక్రమించే అవకాశం కనిపిస్తోంది.

కన్యా రాశి:

* ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2వ పాదం
* ఆదాయం: 5, వ్యయం: 7, రాజపూజ్యం: 5, అవమానం: 2

* అన్ని రంగాల్లో వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది.
* ధన అభివృద్ధి ఉంటుంది.
* అసంతపూర్ణంగా ఉన్న పనులు పూర్తవుతాయి. కొత్తగా తలపెట్టిన పనులు సత్వరమే పూర్తి చేసి ఆశించిన ఫలితాలు పొందుతారు.
* ఉద్యోగులకు ప్రమోషన్‌, ఇంక్రిమెంట్, ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది.
* వ్యాపార వృత్తుల వారికి, స్వయం వృత్తుల వారికి ఆదాయం పెరుగుతుంది. తీర్థయాత్రలు, విదేశీ యానం.
* భార్య తరఫు నుంచి సాయం, కోర్టు వ్యవహారంలో జయం.
* వృత్తిపరంగా ఎదగడానికి అనుకూలమైన సమయం.

తులా రాశి:

* చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3వ పాదాలు
* ఆదాయం: 2, వ్యయం: 8, రాజపూజ్యం: 1, అవమానం: 5

* అప్పులు, అడ్డంకులు, విపత్తులు, తీరని అప్పుల విషయంలో సమస్యలు.
* పని చేసే చోట మీ ప్రవర్తన వివాదాలకు దారి తీస్తుంది.
* గతంలో తీసుకున్న అప్పులను తీర్చకపోవడం వల్ల సమస్యలు ఏర్పడే అవకాశాలు.
* విద్యార్థులకు చదువుల్లో ఉన్నతి, ధనం ఖర్చు చేసి ఇతర దేశాలకు వెళ్తారు.
* మీకు రావాల్సిన డబ్బు విషయంలో కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి గోచరిస్తోంది.

వృశ్చిక రాశి:

* విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ట 1, 2, 3, 4వ పాదాలు
* ఆదాయం: 8, వ్యయం: 14, రాజపూజ్యం: 4, అవమానం: 5

* వృత్తి వ్యాపారాల్లో పురోగతి, ఉద్యోగ విజయం.
* కొత్త భాగస్వామ్య పెట్టుబడులు, ఆర్థిక స్థిరత్వంతో సానుకూలంగా సాగుతుంది.
* మంచి చాకచక్యంతో కార్యాలను చక్కబెడతారు.
* ఆరోగ్యం చక్కబడుతుంది.
* వ్యాపారంలో, ఉద్యోగంలో ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ధనుస్సు రాశి:

* మూల 1, 2, 3, 4వ పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం
* ఆదాయం: 11, వ్యయం: 5, రాజపూజ్యం: 7, అవమానం: 5

* కుజుడు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ధన లాభాన్ని, సుఖాన్ని, ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని ఇస్తాడు.
* ఈ సంవత్సరం కార్యాల్లో విజయం, సమస్యలు తీరి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.
* ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి వస్తాయి.
* సమాజంలో గుర్తింపు వస్తుంది. ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది.
* ఉద్యోగంలో పని చేసే వారికి గుర్తింపు వచ్చి వారిని విదేశాలకు పంపించే అవకాశం ఉంది.
* సంఘంలో గౌరవంగా ప్రముఖ స్థానంలో చలామణీ అవుతారు.

మకర రాశి:

* ఉత్తరాషాఢ 2, 3, 4వ పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2, 3వ పాదాలు
* ఆదాయం: 14, వ్యయం: 14, రాజపూజ్యం: 7, అవమానం: 1

* స్టాక్‌ మార్కెట్‌ రంగంలో ఉన్న వారికి లాభాలు ఉంటాయి.
* గృహంలో శుభ సందర్భం ఉంటుంది.
* విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఇతర దేశాల్లో చదువులు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ యోగం, సత్సంతానం గోచరిస్తోంది.
* మకర రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
* పెట్టుబడులు, నూతన వ్యాపారాలు, భూమి, గృహం కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి:

* ధనిష్ట 3, 4వ పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వాబాధ్ర 1, 2, 3వ పాదాలు
* ఆదాయం: 14, వ్యయం: 14, రాజపూజ్యం: 6, అవమానం: 1

* నూతన గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి.
* కఠోర శ్రమ చేసి సంపాదిస్తారు. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు.
* ఉద్యోగస్తుల విషయంలో స్థాన మార్పులు, బదిలీలు తప్పకపోవచ్చు.
* ఇంటికి, స్నేహితులకు, కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ట్రాన్స్‌ఫర్స్‌ అయ్యే అవకాశం
* గృహ నిర్మాణం లేదా స్థిర నివాసం ఏర్పరచుకొనే విషయంలో నిమగ్నమై ఉంటారు.
* ముఖ్యంగా తల్లిదండ్రులు, సంతానానికి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి.
* ఆర్థిక వ్యవహారాలు, ఆస్థి పంపకాల విషయంలో సంయమనం పాటించాలి. ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది.
* దుబారా ఖర్చులు తగ్గించడం మంచిది.

మీన రాశి:

* పూర్వాబాధ్ర 4వ పాదం, ఉత్తరాబాధ్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4వ పాదాలు
* ఆదాయం: 11, వ్యయం: 5, రాజపూజ్యం: 2, అవమానం: 4

* ఈ సంవత్సరం వీరు కొన్ని రకాల సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది.
* కొన్ని అడ్డంకుల కారణంగా వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి.
* కొంత ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది.
* భార్యా భర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. వివాదాలు ఏర్పడి విడాకుల దాకా దారి తీసే అవకాశం.
* ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
* వైద్య వృత్తి వారికి, ఔషధ కంపెనీల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.
* మత్స్య, మాంస ఉత్పత్తిదారులకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి.

Follow the Keerthanaa News channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VaDKB4h3rZZU4gwREr1R

ఇదీ చదవండి: Lalitha Sahasranamam: లలితా సహస్రనామ పారాయణంతో సకలపాప హరణం.. తప్పక పారాయణం చేయండి!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు