Guava for health: ప్రస్తుతం చలికాలం.. చల్లటి వాతావరణం.. ఏం తింటే ఎలాంటి జబ్బు వస్తోందనన్న భయం చాలా మందిని వెంటాడుతుంటుంది. ఈ నేపథ్యంలో చలికాలంలో లభించే ఔషధ గుణాలతో కూడిన పండుగా చెబుతున్నారు ఆహార పండితులు. జామపండు తింటే శీతాకాంలో చెప్పలేనన్ని ప్రయోజనాలున్నాయని నిపుణులు అంటున్నారు. చలికాలంలో జామపండ్లు విరివిగా లభిస్తాయి. జామ ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. (Guava for health)
కాలానుగుణంగా దొరికే పండ్లు తినాలని డాక్టర్లు సూచిస్తూనే ఉంటారు. వాటిని మిస్ అయితే ఒంట్లో ప్రొటీన్లు లభించవని చెబుతారు. ప్రతి సీజన్ లో మార్కెట్ లో జామ పండు లభ్యమవుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. జామ పండు తినడం ద్వారా నోటి దుర్వాసన కూడా దూరమవుతుంది. చిన్న పిల్లలు, పెద్దలు కూడా ఈ పండు తినడానికి ఇష్టపడుతుంటారు.
చాలా మంది పచ్చి జామకాయలు తినడానికి ఇష్టపడుతుంటారు. రుచిలో తియ్యగా ఉండే ఈ పండు చాలా వ్యాధులను నయం చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల నుంచి కిడ్నీ రోగులు కూడా దీన్ని తీసుకోవచ్చు. జామ గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం, ఆమ్లత్వం నుంచి ఉపశమనం పొందవచ్చు. జామపండు తీసుకోవడం వల్ల గుండె జబ్బుల్ని నివారించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం, జామ మెదడు శక్తిని పెంచే ఆహారంగా కూడా పరిగణించబడుతుంది. దీన్ని తీసుకోవడం ద్వారా బలహీనత, అలసట తొలగిపోతాయి.
ఈ జబ్బులున్న వారు అప్రమత్తంగా ఉండాలి
జామపండు చాలా ఆరోగ్యవంతం అయినప్పటికీ కొన్ని జబ్బులున్న వారు కాస్త జాగ్రత్తగా ఉండాలట. కొన్ని వ్యాధులున్న వారు జామపండు తింటే ఆరోగ్యం విషతుల్యం అవుతుందట. జీర్ణకోశ సమస్య ఉన్నట్లయితే జామపండును తీసుకోరాదు. జామపండు తిన్నాక మీకు వికారం లేదా కడుపునొప్పి ఉంటే, దాన్ని తీసుకోరాదు. తామర వ్యాధి ఉన్నవారు జామ ఆకు సారాన్ని తీసుకోవద్దు. ఇవి చర్మంపై చికాకును కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: Food for winter: చలికాలంలో అద్భుత ఆహారాలు.. ఇవి ప్రయత్నించండి!
Viral Video: మందు బాబుల కొత్త ఐడియా.. గులాబ్ జామ్‌తో కలిపి..
