Viral video: సాధారణంగా గులాబ్ జామ్ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. కొందరికి మరీ ఫేవరెట్ గా ఉంటుంది. వారానికోసారి చేసుకొని తినే వారూ ఉంటారు. అయితే గులాబ్ జామ్ తో పాటు రమ్ (Viral video) కూడా ఇక్కడ కొందరికి ఫేవరెట్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గులాబ్ జామ్ తో రమ్ ను కలిపారు. మంటలో కాస్త ఫ్లేమ్ కాగానే కిందకి దింపారు. (Viral video)
మద్యం ప్రియులు ఎప్పటికప్పుడు కొత్త టేస్ట్ లు కోరుకుంటూ ఉంటారు. వాటిని ఆస్వాదించడమే కాదు.. కొందరు వీడియోలు తీస్తూ అందరికీ షేర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటిదే ఈ వీడియో. రీసెంట్ గా కొందరు మందు ప్రియులు ఓల్డ్ మంక్ రమ్ముతో టీ కలిపారు. అది చాలా వైరల్ అయ్యింది. మరోవైపు తాజాగా గులాబ్ జామ్ తో ఓల్డ్ మంక్ రమ్ ను కలిపి ఆ వీడియోను షేర్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇన్ స్టా గ్రామ్ లో ఈ వీడియోను గౌరవి అనే ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేసిన వ్యక్తి క్లినికల్ న్యూట్రిషన్ కావడంతో వీడియోకు మరింత పాపులారిటీ దక్కింది. ఈ వీడియోకు గులాబ్ జామున్ ఓల్డ్ మంక్ ప్లేంబే అని క్యాప్షన్ కూడా పెట్టేశారు. ఇది కాస్తా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ వీడియోను 90 లక్షల మందికిపైగా చూశారు. లక్షన్నర మందికిపైగా లైక్ చేశారు.
అయితే, మందుతో ప్రయోగాలు చేయడం, అవి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం.. వైరల్ గా మారడం కొత్తేమీ కాదంటున్నారు నెటిజన్లు. ఇదివరకే గోవాలో టీలో ఓల్డ్ మంక్ రమ్ కలిపిన వీడియో ఒకటి వచ్చింది. ఆ వీడియో కూడా విపరీతంగా చక్కర్లు కొట్టింది. నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. ఓల్డ్ మంక్ రమ్ ఫుడ్ ఐటమ్స్ కింద కూడా వాడుతున్నారంటూ జోరుగా కామెంట్లు వెల్లువెత్తాయి.
చిన్న వయస్సు నుంచే ఎక్కువగా మద్యం తాగే వారికి అన్ని రకాల అనారోగ్యాలూ వస్తాయి. మద్య పానం చేయడం వలన కండరాల నష్టం, బలహీనతకు గురయ్యే ప్రమాదం ఉందని అనేక అధ్యయనాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. తాజాగా యూకేలోని యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా అధ్యయనం ప్రకారం, రోజుకు 10 యూనిట్లు లేదా అంతకంటే ఎక్కువ తాగేవారిలో కండరాలు తక్కువగా ఉంటాయని తేలింది. రోజూ ఒక బాటిల్ వైన్ తాగేవారిలో వారు 50- 60 ఏళ్ల వయసు వచ్చేసరికి కండరాలు లేకుండా బక్కపలుచగా మారే ప్రమాదం అధిక శాతం ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది.
అతిగా మద్యం తాగే వాళ్లు వయసు పెరిగే కొద్దీ కండరాలను కోల్పోతూ ఉంటారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారి జీవితంలో బలహీనత, ఇతర సమస్యలకు దారి తీస్తుంది అని యూఏఈలోని నార్విచ్ మెడికల్ స్కూల్ కు చెందిన ప్రొఫెసర్ ఐల్సా వెల్చ్ వ్యాఖ్యానించారు.
Read Also : Wife and Husband Relationship: భార్యా భర్తల మధ్య నిందలు పెరిగాయా?