Relationship goal: నచ్చిన వ్యక్తులతో రిలేషన్ షిప్ లో దగ్గరగా మెలగాలంటే కొన్ని అలవాట్లు మానుకోవాలి. మరి కొన్ని కొత్త అలవాట్లు చేసుకోవాలి. కొన్ని పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు పరిచయం ఉన్న అందరితోనూ క్లోజ్ గా మెలగలేం. నచ్చిన వ్యక్తులు కొందరితోనే అన్ని విషయాలూ పంచుకుంటాం. ఇలాంటి నేపథ్యంలో మనకు దగ్గరైన వ్యక్తులతో బంధం మరింత దగ్గర అవ్వాలంటే కొన్ని టిప్స్ పాటిస్తుండాలి. (Relationship goal)
క్లోజ్ అవ్వాలంటే ఇలా చేస్తూ ఉండాలి..
నిజాయితీగా ఉండడంతోపాటు మీ ఇద్దరికీ ఇష్టమైన వాటిని చూడటం, ఔటింగ్ కు వెళ్లి నచ్చిన ప్రదేశాలను సందర్శించడం లాంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల మీ మధ్య క్లోజ్ నెస్ పెరుగుతుంది. అలాగే ఒకరి కోసం మరొకరు సాయం చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించుకోవడం వల్ల దగ్గరవడానికి వీలవుతుంది.
బంధం దగ్గరవ్వాలంటే కొన్ని తప్పులు జరగకుండా చూసుకోవాలి. తప్పులు పదే పదే చేస్తుండడం వల్ల రిలేషన్ దెబ్బతినే చాన్స్ ఉంటుంది. మనం క్లోజ్ గా ఉండాలని అనుకొనే వారితో ఎలా ప్రవర్తించాలనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా నిజాయితీగా ఉన్నామని రుజువు చేసుకోవాలి. నిజాయితీగా మెలగడం వల్ల మిమ్మల్ని మీ పార్ట్నర్ వదిలి పెట్టలేరు. ఒక వేళ మీరు మీ నిజాయితీని నిరూపించుకోలేకపోతే వారు మిమ్మల్ని విశ్వసించలేరు. ఎప్పుడూ నమ్మకం కలగదు. అందుకని మీరు కచ్చితంగా నిజాయితీగా ఉండి తీరాలి.
ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ పెరగాలంటే ఒకరికి మరొకరు కమ్యూనికేట్ చేయడంలో కరెక్ట్ గా ఉండాలి. చిన్న విషయాలను కూడా ఆనందంగా గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. ఇద్దరూ కలిసి ఆనందిస్తూ గడిపితే అద్భుత క్షణాలు అవుతాయి. మీకు నచ్చిన వారితో క్లోజ్ గా ఉండాలంటే ఇలాంటివి ప్రయత్నించి చూస్తే మీకే అర్థమవుతుంది. మీ బంధం తప్పకుండా దృఢంగా మారుతుంది.
ఇదీ చదవండి: Romance tips: రొమాన్స్‌లో బెస్ట్ టిప్స్.. ఇలా చేస్తే దూసుకెళ్లడం ఖాయం!
