HomeLife StyleAmla Juice: ఉసిరి చేసే మేలు తెలుసా? పరగడుపున ఉసిరి జ్యూస్‌తాగితే ఏమవుతుందంటే..

Amla Juice: ఉసిరి చేసే మేలు తెలుసా? పరగడుపున ఉసిరి జ్యూస్‌తాగితే ఏమవుతుందంటే..

Amla Juice: ఆరోగ్య ప్రదాయినిగా భావించే ఉసిరి కాయను భారతీయ వంటకాల్లో, ఆయుర్వేదంలోనూ అనేక రకాలుగా వినియోగిస్తుంటారు. ఉసిరి తీసుకోవడం వల్ల శరీరంలో అనేక రోగాలను నియంత్రించే శక్తి పెరుగుతుంది. వైద్యంలోనూ అనేక ఔషధాల తయారీలో ఉసిరిని వాడతారు. ఉసిరి కాయను హిందీలో ఆమ్ల అని పిలుస్తారు. సంస్కృతంలో ఆమలక అని అంటారు. ఉసిరి కాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేర్లను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడతారు. (Amla Juice)

ఇక ఉసిరి జ్యూస్‌ను కూడా చాలా మంది చేసుకొని తాగుతుంటారు. ఉసిరి రసంతో మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఉసిరి కాయను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పుంజుకుంటుంది. జట్టు రాలడం చాలా మందిని వేధిస్తుంటుంది. ఇలాంటి వారు సమస్యను పరిష్కరించుకోవాలంటే ఉసిరి రసాన్ని ఉదయాన్నే ఏమీ తినకుండా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల జట్టు రాలడం సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

చ్యవన్‌ ప్రాశ్‌లో ఉసిరి ప్రాముఖ్యత ఎనలేనిది. దీన్ని మలబద్ధకానికి మంచి విరుగుడుగా చెబుతారు. షాంపూలో కూడా ఉసిరి కాయను వినియోగిస్తారు. దీని శాస్త్రీయనామం ఫిలాంథస్‌ ఎంబ్లికా. ఉసిరి చెట్టు మరీ పెద్దగా, మరీ చిన్నగా కాకుండా మీడియంగా ఎదుగుతుంది. సుమారుగా 8 నుంచి 18 అడుగుల ఎత్తువరకు పెరుగుతుంది. ఉసిరి కాయలకు 6 నిలువుగీతలు ఉంటాయి. వైద్య పరంగా ఉసిరికాయ ఎన్నో ఔషధగుణాలున్న వృక్షంగా చెబుతారు. ఆయుర్వేదంలో, యునానీ ఔషధాల్లోనూ ఉసిరికాయను విరివిగా వాడతారు.

ఈ సమస్యలకు చెక్‌

ఉసిరి అనేక రకాల జబ్బులను దూరం చేస్తుంది. ముఖ్యంగా నోట్లో పూత సమస్య, శరీరంలో అధిక వేడి సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు పరగడుపున ఉసిరి జ్యూస్‌ తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఖాళీ కడుపుతో ఉసిరి రసం తీసుకుంటే అజీర్ణం లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఉసిరిలో విటమిన్ సీ, ప్రోటీన్, ఫైబర్ ఉండటం వల్ల మన శరీరానికి మేలు చేస్తాయి. ఇంకా వెయిట్‌ లాస్‌, చెడు కొలెస్ట్రాల్‌ను నివారించడంలోనూ ఉసిరి జ్యూస్‌ ఉపయోగపడుతుంది.

ఇదీ చదవండి: Usiri oil benefits: ఉసిరి నూనెతో కురులకు బోలెడు లాభాలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు