Usiri oil benefits: మగువలకు, పురుషులకు కురుల సౌందర్యం ఎంతో ముఖ్యం. అందమైన జుట్టు ఉంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన కురులు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. కురులు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. రకరకాల కెమికల్స్‌తో కూడిన షాంపూలు కొందరు వాడుతారు. కానీ.. అందమైన కురులకు సహజ సిద్ధమైన చాలా చిట్కాలు ఉన్నాయి. అందులో ఆమ్లా ఆయిల్(ఉసిరి నూనె) ఒకటి. భారత్‌లో కురుల ఆరోగ్యంలో శతాబ్దాలుగా ఉసిరికి ఎంతో గొప్ప స్థానం ఉంది. (Usiri oil benefits)
ఆమ్లా హెరాయిల్ వాడటం వల్ల కురులు ఆకర్షణీయమైన లుక్‌ను పొందుతాయి. పూర్వికుల కాలం నుంచి ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందమైన కురులు కలిగి ఉంటే తలమాణికంగా నిలుస్తాయి. ఇందుకోసం ఉసిరి చాలా ఉపయోగపడుతుంది. ఉసిరి నూనెతో కలిగే అద్భుత ప్రయోజనాలు ఈ కథనంలో మీకోసం..
1. కురులు పొడి బారకుండా సంరక్షణ
వెంట్రుకలు డ్రై అయితే అనారోగ్యకారంగా మారుతాయి. ఆ తర్వాత ఆకర్షణ కోల్పోతాయి. కానీ ఆమ్లా ఆయిల్ వల్ల… కురులు హైడ్రేట్ గా మారుతాయి. కురులు పటిష్టంగా ఉండడం వల్ల పెరుగుదల మెరుగవుతుంది.
2. కాంతులీనే కురులకు ఆమ్లా ఆయిల్ రక్షణ
ఆమ్లా ఆయిల్ లోని పోషకాలు… కురులను ఆరోగ్యకరంగా మారుస్తాయి. అంతేకాకుండా వెంట్రుకల ఆకర్షణీయతను పెంచుతాయి. ఒత్తుగా, మెరిసేలా మార్చుతాయి.
3. కురుల పెరుగుదల
ఆమ్లా ఆయిల్ చాలా పోషకాలు కలిగి ఉంటుంది. ఇవి వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తాయి. వెంట్రుకల పెరుగుదలను వృద్ధి చేస్తాయి. పొడవైన, ఒత్తయిన కురులకు ఆమ్లా ఆయిల్ దోహదపడుతుంది.
4. హెయిర్ లాస్ నుంచి రక్షణ
ఆమ్లా ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటితో పాటు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వెంట్రుకలు రాలిపోకుండా కాపడతాయి. కురుల సంపూర్ణ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
5. చుండ్రు దరిచేరదు
సాధారణంగా చుండ్రు కారణంగా తలపై చర్మం పొడి పడుతుంది. వెంట్రుకల కుదుళ్ళు అనారోగ్యకరంగా మారుతాయి. కానీ ఆమ్లా ఆయిల్ లోని యాంటీ మైక్రోబియల్ గుణం వల్ల చుండ్రు సమస్య పరిష్కారం అవుతుంది.
ఇదీ చదవండి: Women Health Tips: మహిళల ఆరోగ్యానికి 5 సూత్రాలు.. ఆచరిస్తే అందమైన జీవితం!