HomeNationalCaveat Petition: కేవియట్‌ పిటిషన్‌ అంటే ఏమిటి? దీని వల్ల ఉపయోగాలేంటి? ఎవరు వేయవచ్చు?

Caveat Petition: కేవియట్‌ పిటిషన్‌ అంటే ఏమిటి? దీని వల్ల ఉపయోగాలేంటి? ఎవరు వేయవచ్చు?

Caveat Petition: న్యాయవాదుల సర్కిళ్లలో ఓ సామెత ఉంటుంది. “ఓడిన వాడు కోర్టులోనే ఏడిస్తే.. గెలిచిన వాడు ఇంటికి వెళ్లి బాత్‌రూమ్‌లో ఏడుస్తాడు” అని చెబుతుంటారు. కోర్టులో గెలిచిన వాడికి, ఓడిన వాడికీ పెద్ద తేడా ఉండదు. గెలిచిన వాడికి డబ్బులు పోతాయి. ఓడిన వాడికి డబ్బు, పేరు, పరువు… అన్నీ పోతాయి. ఇదే వాస్తవం. (Caveat Petition)

న్యాయస్థానం మెట్లెక్కడం అంటే ఎంతో బాధ, ఇబ్బంది ఉంటే తప్ప అలాంటి పరిస్థితి రాదు. ఈ నేపథ్యంలో బాధితులు కోర్టుమెట్లెక్కి తమ వాదన, బాధలు న్యాయమూర్తికి విన్నవిస్తుంటారు. ఈ క్రమంలో వారికి నిజమైన పరిష్కారం చూపేలా ధర్మాసనాలు చేస్తుంటాయి.

అయితే, ఒక కోర్టులో తనకు న్యాయం జరగలేదని భావిస్తే పైకోర్టుకు వెళ్లే అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఈ క్రమంలో కేవియట్‌ పిటిషన్‌ అనేది కీలకం. అసలు కేవియట్‌ పిటిషన్‌ అంటే ఏమిటి? ఎవరు దీన్ని వేయవచ్చు? ఉపయోగాలేంటో తెలుసుకుందాం. (Caveat Petition)

Read Also : Tirumala Samacharam 29-07-2023: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు

ఏ కేసులోనైనా ఒకరు ఓడి పోతుంటారు. మరొకరు గెలుస్తారు. ఇదే న్యాయ శాస్త్రంలో జరిగేది. అయితే, ఓడిపోయిన వారు అక్కడితో ఆగిపోతారనుకోవడం పొరపాటే అవుతుంది. గెలిచిన వారికి మనశ్శాంతి ఉంటుందనుకోవడం కూడా భ్రమే అవుతుంది. ఈ క్రమంలో ఓడిపోతే హైకోర్టుకు వెళ్లొచ్చు.

అక్కడ కూడా ఓడిపోతే దేశ అత్యున్నత ధర్మాసనానికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇలా వెళ్లే క్రమంలో గెలిచిన వారు నిద్రపోయే అవకాశం ఉండదనేది వాస్తవం. ఓడిన వారు పైకోర్టుకు వెళ్లి మళ్లీ ఆర్డర్‌ తెచ్చుకుంటారేమోనన్న భయం గెలిచిన వారిని వెంటాడుతుంటుంది.

Read Also : YSR Law Nestam: వైఎస్సార్‌ లా నేస్తం నిధుల విడుదల.. అడ్వొకేట్లకు అండగా ఉంటామన్న జగన్‌

కేవియట్‌ పిటిషన్‌ అంటే సెక్షన్‌ 148ఏ సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ప్రకారం పైన కోర్టులో అంటే ఏ కోర్టులో అయితే గెలుస్తారో ఆ పైన ఉండే కోర్టులో కేవియట్‌ పిటిషన్‌ వేస్తుంటారు. కేవియట్‌ అంటే కేసు వేసిన వారు అవతల పార్టీ వారికి నోటీసు ఇచ్చి కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది.

అప్పుడు ఆ కోర్టు ఆ కేసు ఏంటనేది వింటుంది. తదనుగుణంగా విచారణ చేసి ఇవ్వాల్సిన మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుంది. కేవియట్‌ పిటిషన్‌ లైఫ్‌ 3 నెలలు ఉంటుంది. ఇలా కేవియట్‌ పిటిషన్‌ను ఉపయోగించుకోవచ్చని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.

Read Also : Gold Price today 29 July 2023: పెరుగుతూ తగ్గుతూ దోబూచులాడుతున్న పసిడి.. ఇవాళ ఎంత తగ్గిందంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు