Jagananna Videshi Vidya deevena: జగనన్న విదేశీ విద్యా దీవెన కింద పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ఏపీ సర్కార్ అందిస్తోంది. ఇందులో భాగంగా నేడు విద్యార్థులకు సాయం అందించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లబ్ధిదారుల ఖాతాల్లో నేడు బటన్ నొక్కి నిధులు జమ చేస్తారు. ప్రపంచంలోని టాప్ 50 విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు చదువుకునేలా విదేశీ విద్యాదీవెన పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అర్హులైన 357 మంది విద్యార్థులకు రూ.45.53 కోట్ల సాయం అందిచనున్నారు సీఎం జగన్. (Jagananna Videshi Vidya deevena)
Read Also : Jagananna Thodu: జగనన్న తోడు నిధులు విడుదల.. సాయం రూ.13 వేలకు పెంచుతామన్న సీఎం జగన్
జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ. 1.25 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇతర విద్యార్థులకు రూ. కోటి వరకు 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ అవకాశం కల్పిస్తోంది. గడిచిన 6 నెలల్లో జగనన్న విదేశీ విద్యాదీవెన కింద రూ. 65.48 కోట్ల సాయం అందించింది ఏపీ ప్రభుత్వం. మీరు చదువుకుంటే చాలు.. మొత్తం ఫీజు తామే భరిస్తామంటోంది జగన్ సర్కార్. ప్రతిభ చూపి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ కళాశాలల్లో సీటు సాధించిన విద్యార్థులకు తోడుగా నిలుస్తోంది.
Read Also : Jagananna Animutyalu: బ్రైట్ మైండ్స్, షైనింగ్ స్టార్స్.. ఆణిముత్యాలకు సీఎం జగన్ సత్కారం
