HomeAndhra PradeshTirumala Samacharam 27-07-2023: తిరుమలలో సర్వదర్శనానికి 6 గంటల సమయం.. 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు

Tirumala Samacharam 27-07-2023: తిరుమలలో సర్వదర్శనానికి 6 గంటల సమయం.. 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు

Tirumala Samacharam 27-07-2023: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. కొన్ని రోజులుగా భారీగా తిరుమలకు చేరుకుంటున్న భక్తుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 74,268 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 26,817 మంది. నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.4.32 కోట్లు చేకూరింది. (Tirumala Samacharam 27-07-2023)

Read Also : Weather Report Heavy Rain: ఏపీలో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ.. విస్తారంగా కురుస్తున్న వర్షాలు

శ్రీనివాససేతు ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో ప్రమాదం

తిరుపతి శ్రీనివాస సేతు వంతెన నిర్మాణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. భారీ క్రేన్ వైర్లు తెగిపడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. చివరి సిమెంట్ సెగ్మెంట్ అమర్చుతుండగా వైర్లు తెగిపోయాయి. సెగ్మెంట్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మృతులు బెంగాల్, బీహార్ కు చెందిన అభిజిత్, మండల్ గా గుర్తించారు. మృతదేహాలను ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు.

Read Also : Gold Price today 27 July 2023: ఈరోజు పెరిగిన బంగారం ధరలు.. నేటి పసిడి, వెండి రేట్లు ఇలా..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు