Dandruff: డ్రాండ్రఫ్, చుండ్రు సమస్య ప్రస్తుతం చాలా మందిని వేధిస్తోంది. గజిబిజి జీవనశైలి, నేటి కాలంలో ఉపయోగిస్తున్న షాంపూలు, నిత్య జీవితంలో టెన్షన్లు.. ఇలా రకరకాల కారణాలతో నెత్తిపైన జుట్టు రాలిపోవడం, ఉన్న జుట్టూ పల్చబడిపోవడం, లేదా డ్యాండ్రఫ్, చుండ్రు పట్టి తల గోక్కోవడం లాంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఏం చేసినా చుండ్రు సమస్య పోవడం లేదని కొందరు విసిగివేసారి పోతుంటారు. అలాంటి వారి కోసం మంచి చిట్కాలు ఈ కథనంలో తెలుసుకోండి.. (Dandruff)
డ్యాండ్రఫ్ సహజ పద్ధతుల ద్వారా పోగొట్టుకోవాలంటే మొదట మీరు వాడుతున్న షాంపూను గమనించాలి. షాంపూలో ఎస్ఎల్ఎస్, పారాబెన్స్, పాథలెట్స్ లాంటి కెమికల్స్ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ మీకు అర్థం కాకపోతే.. షాంపూను తిరగేసి చూస్తే లేబుల్‌లో రకరకాల పేర్లు ఇంగ్లిష్ లో కనిపిస్తాయి. ఎన్ని ఎక్కువ పేర్లు ఉంటే అన్ని రకాల కెమికల్స్ ఆ షాంపూలో ఉన్నట్లు లెక్క అని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also : Sabja Seeds: సబ్జా గింజలతో లాభాలు తెలుసా? చర్మ సమస్యలకు చెక్
ప్రత్యామ్నాయాలు ఇవీ..
1. లిక్విడ్ షాంపూలు వాడటానికి బదులుగా ఆర్గానిక్ ఫ్రీ షాంపూలు మార్కెట్‌లో దొరుకుతాయి. వాటిని వినియోగించాలి. లేదా రీతా, షీకాకాయ పౌడర్లు దొరుకుతాయి. ఇవి వినియోగించినా ఉపశమనం కలుగుతుంది.
2. చన్నీటి స్నానం ముఖ్యమైనది. చల్లటి నీళ్లతో ప్రతి రోజూ తలను, జుట్టును తడిపి స్నానం చేయాలి. దీని వల్ల చాలా రోజుల నుంచి షాంపూలు వాడి వాడి మీ తలలో ఉండిపోయిన కెమికల్స్ అన్నీ వాష్ ఔట్ అయిపోతాయి. కాబట్టి రోజూ చన్నీటితో తలస్నానం చేయాలి. సబ్బుగానీ, షాంపూగానీ కొన్ని రోజులు వద్దు.
3. అల్లోవేరా ప్రాధాన్యం ఎనలేనిది. జుట్టు సంరక్షణలో ఇది కీలక పాత్ర వహిస్తుంది. ఫ్రెష్ అల్లోవేరా లీఫ్ గానీ, నేచురల్ అల్లోవేరా జెల్ గానీ రోజు మార్చి రోజు రాత్రిపూట జుట్టుకు అప్లయ్ చేయాలి. ఉదయం లేవగానే వాష్ చేసుకోవాలి. ఇలా కొన్ని రోజులపాటు చేయడం వల్ల జుట్టుకు సంబంధించిన డ్రాండ్రఫ్ లాంటి సమస్యలు తొలగిపోతాయి. జుట్టు రాలే సమస్య కూడా చాలా వరకు తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
Read Also : White Hair: ఈ ఆకు నలిపి తలకి రాసుకుంటే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది!
