HomeLife StyleBelly Fat: బెల్లీ ఫ్యాట్‌ మిమ్మల్ని విసిగిస్తోందా? ఇలా చేస్తే వెంటనే మటుమాయం ఖాయం..

Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ మిమ్మల్ని విసిగిస్తోందా? ఇలా చేస్తే వెంటనే మటుమాయం ఖాయం..

Belly Fat: పొట్ట తగ్గించుకోవడానికి తీసుకొనే ఆహార పదార్థాల విషయంలో కాస్త జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. డైట్‌లో మార్పులు చేసుకోవడం ద్వారా ఈజీగా పొట్ట తగ్గించుకోవచ్చు. ఇందులో ముఖ్యమైనది బూడిద గుమ్మడికాయ. సాధారణంగా బూడిద గుమ్మడి కాయను తొక్క, విత్తనాలు తీసేసి వాడుతుంటారు. ఇలా చేయరాదు. తొక్క, విత్తనాలతో సహా వాడితే పొట్ట తగ్గడం వేగంగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. (Belly Fat)

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పేరుకుపోవడం వల్ల అనేక రకాల అనర్థాలు కలుగుతాయి. ముఖ్యంగా పొట్ట పెరిగిపోయి శరీరాకృతి మారిపోతుంది. కొంత మందిలో బెల్లీఫ్యాట్‌కు దారి తీస్తుంది. ఇది సమాజంలో మనుషుల మధ్యకు వెళ్లకుండా చేస్తుంది. ఫంక్షన్లు, పార్టీలకు దూరం చేస్తుంది. ఇన్ని రకాల అనర్థాలు కలిగే బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకొనేందుకు అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. కొన్ని టిప్స్‌ పాటించడం, డైట్‌ ఫాలో కావడం వల్ల వేగంగా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకొనే అవకాశం ఉంది.

ఓ వంద గ్రాముల బూడిద గుమ్మడికాయ ఒప్పులను తీసుకోవాలి. అందులో తొక్క, విత్తనాలతో సహా ఉండాలి. అందులో చిన్న అల్లం ముక్క యాడ్‌ చేసుకోవాలి. మనం ఇళ్లలో వాడే చాలా పదార్థాల్లో అల్లం వినియోగిస్తుంటాం. అల్లం చాలా పవర్‌ఫుల్‌గా పని చేస్తుంది. దీంతోపాటు భూమిమీద అత్యంత శక్తివంతమైన పదార్థాల్లో ఒకటిగా బూడిద గుమ్మడికాయను చెబుతారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఆహార పదార్థాల జాబితాలో చేర్చుకోవాలని చెబుతున్నారు.

ఈ జ్యూస్‌ రోజుకో గ్లాస్‌ తీసుకుంటే బెటర్‌ రిజల్ట్‌

బూడిద గుమ్మడికాతో పాటు తినే ఆహారంలో దొండకాయను యాడ్‌ చేసుకోవాలని చెబుతున్నారు. శరీరంలో సహజత్వం కోల్పోయిన చర్మాన్ని పునరుద్ధరించడంలో దొండకాయ దోహదపడినంతగా మరే ఇతర కూరగాయలు కూడా సాటిరావని స్పష్టం చేస్తున్నారు. బూడిద గుమ్మడికాయ వంద గ్రాములు, ఐదారు దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఇందులో చిన్న అల్లం ముక్క కలుపుకోవాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం జ్యూస్‌ లాగా చేసుకొని తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఎలాంటి పొట్ట అయినా సరే వెంటనే తగ్గిపోవాల్సిందేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

బెల్లీ చూడటానికే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఏవైనా ఓ డ్రెస్సులు వేసుకోవాలంటే సెట్ కావు. మగవారికి ప్యాంట్, షర్ట్స్‌లో ఇన్ షర్ట్‌ ఇబ్బందిగా ఉంటుంది. టీ షర్ట్స్ అస్సలు వేసుకోలేరు. అదే విధంగా ఆడవారికి ఏ కాస్తా ఫ్యాషన్ డ్రెస్సెస్‌ కూడా వేసుకోలేరు. ఈ బెల్లి పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. నేడు చాలా మంది కూర్చునే పనులు చేసుకుంటూ ఉంటారు. శారీరక శ్రమ తగ్గిపోయింది. ఒత్తిడి లేని జీవనాన్ని ఊహించడమే కష్టతరమైంది. అందుకే 100లో 90 శాతం మందికి బెల్లీ వచ్చేస్తోంది.

బరువు తగ్గడానికి అత్యంత ప్రభావవంతమైన ఆహారంలో గుడ్లు, చేపలు, గింజలు, పప్పులు, కూరగాయలు, పాల ఉత్పత్తుల వంటి లీన్ ప్రోటీన్ తీసుకుంటే మంచిది. 25 నుంచి 30 శాతం ప్రోటీన్.. కేలరీల కొవ్వును తగ్గించడంలో సాయపడతాయి. ఫైబర్ ఫుడ్‌ని తీసుకోవడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇవి మీ బరువుని తగ్గించేందుకు దోహదం చేస్తుంది.

మార్కెట్‌‌లలో బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించే ప్రోడక్ట్స్ చాలానే ఉంటున్నాయి. వీటిని ఎలా పడితే అలా వేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి టెంపరరీగా వర్క్ చేసినప్పటికీ దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెబుతున్నారు. బెల్లీని తగ్గించుకోవాలంటే ముందుగా మంచి ఆహారం తీసుకోవడం తప్పనిసరి. వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also : Best health tips: ఏ జబ్బు తగ్గాలన్నా రాత్రిపూట ఇవి తిని ప్రయత్నించండి.. మార్పు గ్యారెంటీ..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు