Best health tips: సమాజంలో చాలా మంది అనేక రకాల జబ్బులతో బాధపడుతుంటారు. షుగర్, బీపీ, గ్యాస్ట్రిక్ సమస్యలు, శ్వాసకోశ సంబంధమైనవి, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం.. లాంటి అనేక సమస్యలతో ఇబ్బందులు పడే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కొందరికి తీసుకొనే ఆహారంలో మార్పులు చేసినప్పటికీ అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అయితే, షుగర్, బీపీ లేదా ఇతర ఏ అనారోగ్య సమస్యలున్నా సరే.. క్రమంగా తప్పనిసరిగా తగ్గిపోవాలంటే బెస్ట్ హెల్త్ టిప్ ఈ కథనంలో తెలుసుకోండి.. ఈ చిట్కా పాటించిన చాలా మంది తమ జబ్బులను తగ్గించుకోగలిగారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. (Best health tip)
ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి మళ్లీ భోజనం.. ఇదీ చాలా మంది రొటీన్ మెనూ. అయితే, రాత్రి పూట కూడా ఫుల్స్ మీల్స్ తినే వారికి ఇక్కట్లు తప్పవని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాయకష్టం చేసే వారికి పెద్దగా సమస్యలు రాకపోయినా.. ఆఫీసుల్లో పని చేసే వారు, వయసు మీద పడి ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్న వారికి ఇది చేటు కలిగిస్తుందంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు రోజువారీ ఫుడ్ మెనూ ఎలా ఉండాలో నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఉదయం పూట బాగా తినాలని, మధ్యాహ్నం మధ్యస్థంగా, సాయంత్రం పేద వాడిలా తినాలని పురాణాల నుంచి పెద్దలు చెబుతుంటారు.
ఇప్పుడు ఆరోగ్య నిపుణులు సైతం రాత్రిపూట భోజనంపై కీలక సూచనలు చేస్తున్నారు. రాత్రి పూట ఎక్కువ తినడం వల్లనే శరీరంలో అనేక రోగాలకు దారి తీస్తుందంటున్నారు. రాత్రి సమయాల్లో శారీరక శ్రమ లేకపోవడం, కేవలం శరీరం విశ్రాంతి తీసుకొనే సమయం కావడంతో బాడీలోని ఇతర అవయవాలన్నీ తమ పని తాము చేసుకుంటూ మరుసటి రోజు ఎనర్జిటిక్‌గా నిద్రలేచి పనులకు ఉపక్రమించేలా బాడీ మెకానిజమ్ తయారవుతుంది. ఈ క్రమంలో ఎక్కువగా తినటం వల్ల జీర్ణం సమస్యలు ఏర్పడతాయి.
రాత్రిపూట ఇవి తింటే ఏ జబ్బు అయినా తగ్గిపోవాల్సిందే..
రాత్రి వేళల్లో మితాహారం తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. కొందరు చపాతీ లేదా రోటీ లాంటివి తీసుకుంటుంటారు. రాత్రి పూట తినే ఫుడ్‌లో మసాలాలు లేకుండా చూసుకోవాని నిపుణులు చెబుతున్నారు. మసాలా కారణంగా కడుపులో మంట, గొంతులో మంట లాంటివి ఏర్పడతాయి. అంతేకాకుండా రాత్రిపూట ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి జబ్బయినా రెండు మూడు నెలల్లో తగ్గుముఖం పట్టాల్సిందేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదాహరణకు షుగర్ పేషెంట్లు పండ్లు తినడం వల్ల ఇంకా పెరుగుతందనే అపోహ చాలా మందికి ఉంటుంది. అయితే, అది నిజం కాదని నిపుణులు అంటున్నారు. వైద్యులు సూచించిన పండ్లు తీసుకుంటే మూడు నెలల్లో షుగర్ కంట్రోల్‌లోకి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.
రాత్రి పూట పండ్లు కాకుండా భోజనం తినడం వల్ల షుగర్ ఏ మాత్రం కంట్రోల్‌లోకి రాకపోగా శనగపప్పు, బఠాణీలు కొన్నట్లుగా షుగర్ ట్యాబ్లెట్లు కొనాల్సి ఉంటుంది. జీవితాంతం ఆ మందులు వేసుకుంటూనే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే ఫ్రూట్స్ తినడం నేర్చుకుంటే ప్రత్యేకించి రాత్రి పూట భోజనం ప్లేస్‌లో వీటిని చేర్చుకుంటే మూడు నెలల్లోగా మార్పు మీ కంటికి కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Read Also : Dragon Fruit For Diabetes: డయాబెటిస్‌కు డ్రాగన్ ఫ్రూట్‌తో ఇలా చెక్..!