Curd: సాధారణంగా పెరుగు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో పెరుగు తినకూడదు, రాత్రిపూట అస్సలు పెరుగు ముట్టరాదంటూ కొందరు చెబుతుంటారు. ఇందులో వాస్తవం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, పెరుగు (Curd) వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే పెరుగును లాగించకుండా ఉండలేరని నిపుణులు సూచిస్తున్నారు.
తెలుగు సంప్రదాయం ప్రకారం సాధారణంగా భోజనం తినేటప్పుడు చివర్లో పెరుగుతో తిని ముగించడం అలవాటు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. మొదట అన్నం, కూర, పప్పు, ఫ్రైలు ఇలా అన్నీ తిన్నాక రసంతో తింటారు. చివర్లో కాస్త పెరుగు వేసుకొని భోజనాన్ని ముగిస్తుంటారు. ఈ నేపథ్యంలో కొందరు పెరుగు తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతుంటారు. అందులో వాస్తవం ఎంత ఉందనేదానిపై నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు.
పెరుగులో ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లేవిన్, విటమిన్ బి 6, విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి కావలసిన ఉపయోగకరమైన పోషకాలన్నీ పెరుగులో ఉంటాయి. పెరుగు ఆరోగ్యం, అందం సమస్యలకు గొప్ప ఔషధంగా చెబుతున్నారు. కర్డ్ తినడానికి సరైన సమయం ఏంటో చాలామందికి తెలియదు. ప్రతిరోజు మధ్యాహ్నం ఒక కప్పు పెరుగు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
రోజూ పెరుగులో బెల్లం కలుపుకొని తింటే చలువ చేస్తుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సంస్థ నుంచి ప్యాక్ చేసిన పెరుగును తీసుకుంటున్నారు. గతంలో చాలా ఇళ్లలో సాయంత్రం చక్కని నల్ల బంకమట్టి కుండలో గోరువెచ్చని పాలను ఉడకబెట్టడం ద్వారా పెరుగు తయారవుతుంది. పెరుగు తయారుచేసే పద్ధతి దాని రుచిని బట్టి పెరుగు 5 రకాలు. ఈ 5 రకాలు నెమ్మదిగా, తీపిగా, పుల్లని తీపిగా, పుల్లగా, చాలా పుల్లగా ఉంటాయి. ఈ రకమైన పెరుగును తినడం ఆరోగ్యానికి మంచిది.
మధ్యాహ్నం పూట ఓ కప్పు పెరుగు లాగించడం వల్ల అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల త్వరగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుందట. దాంతోపాటు పెరుగు రోగనిరోధక శక్తిని పెంచుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అదనంగా నిద్ర సమస్యలను తొలగించడంలోనూ పెరుగు దోహదపడుతుందని స్పష్టం చేస్తున్నారు.
ఆయుర్వేదం ఏం చెబుతోందంటే…
జలుబుగా ఉన్నపుడు పెరుగు బాగా పనిచేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మూత్ర సంబంధమైన రోగాల్లో కూడా పెరుగు ఉత్తమంగా పని చేస్తుందట. జిగురు విరేచనాలయ్యేవారికి పెరుగు దివ్యౌషధం. మీగడ తీసిన పెరుగు, పాలపై వెన్న తీసి తయారుచేసిన పెరుగు అత్యుత్తమమైన ఫలితాలనిస్తాయని నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. అలాగే ఆయుర్వేదంలో పెరుగుకు ప్రత్యేకత ఉంది. రాత్రి వేళల్లో పెరుగు వేసుకోకూడదంటుందని ఆయుర్వేదంలో చెబుతారు. అలాగే పెరుగుని వేడి చేసి తినకూడదని కూడా చెబుతారు.
పెరుగులో పెసరపప్పు, శొంఠి, పంచదార, ఉసిరి కాయ పొడి చేర్చి తింటే అధికమైన ఉపయోగాలు పొందవచ్చని ఆయుర్వేదం స్పష్టం చేస్తోంది. పూర్తిగా తోడుకోని పెరుగును కూడా తినవద్దట. అన్ని రకాల జ్వరాల్లో కూడా పెరుగును నిరభ్యంతరంగా వాడుకోవచ్చట. ఎంతమంచిదైనా వేసవికాలం ఎక్కువ తీసుకోరాదని చెబుతున్నారు. అలాగే ప్రతిరోజూ తినకూడదట. పెరుగులో తియ్యనిది, పుల్లనిది, బాగా పుల్లనిది అని మూడు రకాలు ఉంటాయని సుశృతుడు వివరించాడు. అలాగే పెరుగు వాడటం వలన శరీరానికి చాలా ఉపయోగం అని చరకుడు కూడా స్పష్టం చేశాడు.
Read Also : Diabetes Curd: మధుమేహం ఉంటే పెరుగు తినకూడదా?
