Wallet Vastu: ఈ రోజుల్లో చాలా మంది ఒకే మాట చెబుతున్నారు – ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదని. జీతం వచ్చిన కొద్దిరోజుల్లోనే ఖర్చులు పెరిగిపోవడం, అప్పుడప్పుడు అనవసర ఖర్చులు రావడం చాలామందికి సాధారణ సమస్యగా మారింది. వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఉపయోగించే వస్తువులు, ముఖ్యంగా పర్సు లేదా వాలెట్, మన ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతాయని నమ్మకం ఉంది. పర్సులో ఉంచే కొన్ని వస్తువులు సానుకూల శక్తిని పెంచి డబ్బు నిలకడగా ఉండేలా చేస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే పర్సును అదృష్టాన్ని ఆకర్షించేలా ఎలా ఉంచుకోవాలి? ఏ వస్తువులు పెట్టాలి? ఏవి పెట్టకూడదు? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
బియ్యం గింజలు – సమృద్ధికి సంకేతం
హిందూ సంప్రదాయంలో బియ్యం సంపదకు, శుభానికి చిహ్నంగా భావిస్తారు. వాస్తు ప్రకారం పర్సులో కొద్దిగా బియ్యం గింజలను ఉంచుకోవడం వల్ల ఆర్థిక స్థిరత్వం వస్తుందని నమ్మకం ఉంది. కొన్ని బియ్యం గింజలకు కొద్దిగా పసుపు రాసి, ఒక చిన్న కాగితంలో కట్టి పర్సులో ఉంచాలి. ఇది లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుందని చెబుతారు. అయితే బియ్యం గింజలు నలిగిపోకుండా, పొడిగా ఉండేలా జాగ్రత్తపడాలి.
లక్ష్మీదేవి చిన్న ఫోటో
ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని విశ్వాసం. అందుకే పర్సులో చిన్న లక్ష్మీదేవి ఫోటో ఉంచుకోవాలని వాస్తు సూచిస్తుంది. ఇది కొత్త ఆదాయ మార్గాలను తెరుస్తుందని, డబ్బు ప్రవాహం మెరుగుపడుతుందని అంటారు. అయితే ఫోటో చిరిగిపోయినా, మడతపడినా వెంటనే మార్చాలి. పర్సులో ఉంచే ఫోటో ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి.
పచ్చ యాలకులు – సానుకూల శక్తికి సూచిక
యాలకులు సాధారణంగా వంటల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యం అయినా, వాస్తు ప్రకారం ఇవి సానుకూల శక్తిని ఆకర్షించే గుణం కలిగి ఉంటాయి. పర్సులో ఒకటి లేదా రెండు పచ్చ యాలకులను ఉంచితే అదృష్టం పెరుగుతుందని, ఆగిపోయిన పనులు పూర్తవుతాయని నమ్మకం ఉంది. ఇది ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
పర్సులో ఉండకూడని వస్తువులు
పర్సును చాలా మంది చెత్త కాగితాలతో నింపేస్తుంటారు. కానీ వాస్తు ప్రకారం ఇది ఆర్థిక శక్తిని తగ్గిస్తుందని చెబుతారు.
పాత బిల్లులు, రశీదులు
గ్యాస్ బిల్లులు, షాపింగ్ రసీదులు, హోటల్ బిల్లులు వంటి పనికిరాని కాగితాలను పర్సులో ఉంచకూడదు. ఇవి నెగటివ్ ఎనర్జీని పెంచి డబ్బు నిలకడగా ఉండకుండా చేస్తాయని నమ్మకం.
చిరిగిన నోట్లు
పాతవి, చిరిగిన నోట్లను పర్సులో ఉంచడం మంచిది కాదు. ఇవి దారిద్య్రానికి సంకేతంగా భావిస్తారు.
అస్తవ్యస్తంగా నోట్లు
నోట్లను మడతపెట్టి ఎక్కడపడితే అక్కడ పెట్టడం కూడా మంచిది కాదు. నోట్లను ఒక పద్ధతిలో సరిగ్గా అమర్చుకోవాలి.
పర్సును ఇలా ఉంచితే అదృష్టం పెరుగుతుందట
పర్సు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి
పనికిరాని కాగితాలు వెంటనే తీసేయాలి
పర్సు చిరిగిపోయి ఉంటే కొత్తది మార్చుకోవాలి
నోట్లను సరిగ్గా అమర్చాలి
పర్సులో చిన్నగా అయినా కొంత డబ్బు ఎప్పుడూ ఉంచాలి
పర్సు అనేది కేవలం డబ్బు దాచుకునే వస్తువు మాత్రమే కాదు. అది మన ఆర్థిక స్థితికి ప్రతిబింబంగా కూడా భావిస్తారు. వాస్తు ప్రకారం చెప్పిన చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఆర్థిక పరిస్థితిలో సానుకూల మార్పులు వస్తాయని నమ్మకం. పర్సును శుభ్రంగా ఉంచడం, అవసరమైన వస్తువులు మాత్రమే పెట్టుకోవడం వంటి అలవాట్లు డబ్బు నిలకడగా ఉండేందుకు సహాయపడతాయి.
ఇవీ చదవండి: Money Plant Vastu: ఇంట్లో మనీ ప్లాంట్ ఇలా ఉంటేనే సంపద పెరుగుతుంది.. లేదంటే ధన నష్టం కూడా!
Astrology Money : చేతిలో డబ్బు నిలవడంలేదా? సంపదను అడ్డుకునే మీ ఇంట్లోని వాస్తు దోషాలే ఇవే.. వెంటనే ఇలా చేయండి!
Money Dream : కలలో డబ్బు కనిపిస్తే ఏమవుతుంది? జ్యోతిష్యం & మనస్తత్వ శాస్త్రం చెప్పే నిజమైన అర్థాలు ఇవే!
