HomeLife StyleThe Nightmare Sleeping: పీడ కలలతో నిద్ర పట్టడం లేదా? ఈ చిట్కాలు పాటించండి

The Nightmare Sleeping: పీడ కలలతో నిద్ర పట్టడం లేదా? ఈ చిట్కాలు పాటించండి

The Nightmare Sleeping: జీవితంలో ప్రశాంతమైన నిద్ర ప్రతి ఒక్కరికీ అవసరం. పగలంతా కష్టపడి పని చేసిన వారికి రాత్రిపూట నిద్ర పట్టకపోవడం అనేది చాలా ఇబ్బందికర సమస్యగా మారుతుంది. ఇలాంటి తరుణంలో ఏ పనీ చేయలేకపోతారు. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అర్ధరాత్రి మెలకువ వచ్చి ఇక నిద్ర పట్టకపోవడం (The Nightmare Sleeping) అనే సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో నిద్ర పట్టకపోవడానికి (The Nightmare Sleeping) చాలా కారణాలున్నాయిని నిపుణులు చెబుతున్నారు.

ఇక ప్రతి రోజూ పీడకలలు పీడిస్తుంటే నిద్రపోయే ముందు గదిలో నాలుగు మూలల్లో కాస్త రాతి ఉప్పును పోస్తే గదిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రశాంతమైన నిద్ర వస్తుందంటున్నారు. దాంతోపాటు ఒక చెంబుడు నీటిని తీసుకొని, మంచం పక్కన మూలన పెట్టి తెల్లవారుజామున ఆ నీటిని పారబోయాలని సూచిస్తున్నారు. గదిలో నెగటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే నీరు తనలోకి తీసుకుంటుందని సూచిస్తున్నారు.

సరిగా నిద్ర పట్టని వారికి కొన్ని చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. రాత్రివేళల్లో నిద్ర పోయే ముందు చిన్న పద్ధతులను పాటించడం ద్వారా నిద్రాభంగాల నుంచి బయట పడొచ్చని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నిద్రకుపక్రమించే ముందు ఏ దిశలో తల పెట్టి పడుకుంటున్నారనేది చూసుకోవాలంటున్నారు. పొరపాటున కూడా ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించకూడదని సూచిస్తున్నారు.

ఇలా చేయడం వల్ల ప్రతి కూల ఎనర్జీని పారదోలిన వారమవుతామని చెబుతున్నారు. పీడ కలలు మరీ ఎక్కువగా వస్తుంటే.. నిద్రకు వెళ్లే ముందు దిండు కింద రెండు లవంగాలను పెట్టుకోవాలని చెబుతున్నారు. దాంతో పాటు పడుకునేముందు గోరువెచ్చని నీటిలో పాదాలను శుభ్రం చేసుకోవాలని, కర్పూరం కలిపిన కొబ్బరినూనెను పాదాలకు పూసుకుంటే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు. దిండు కింద ఇనుప కత్తి పెట్టుకున్నా పీడకలలు దూరమవుతాయని చెబుతున్నారు.

నిద్రపోవడం వల్ల ప్రయోజనాలు..

సుఖమైన నిద్ర వల్ల మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. దానితో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని అభివృద్ధి నిద్ర అభివృద్ది చేస్తుంది. నాడీ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు మంచి నిద్ర దోహదం చేస్తుంది. హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణ నిద్ర వలన సక్రమంగా జరగాలంటే బాగా నిద్రపోవాలి. నిద్ర తగ్గితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వస్తువులు, ప్రదేశాలు, వ్యక్తులు, సంఘటనల మధ్య సంబంధాలను ఏర్పరచడానికి మెదడు సామర్థ్యానికి బాగా నిద్ర చాలా అవసరం. నిద్ర ఒత్తిడి తగ్గించడానికి, మీ రోజును తాజాగా ప్రారంభించడానికి ఎంతగానో ఉపయుక్తం అవుతుంది.

ఆకలి రుచిఎరుగదు.. నిద్ర సుఖమెరుగదు అంటారు. నిద్రపోయేవాడిని లేపవచ్చు కానీ నిద్రనటించేవాడిని లేపలేమని సామెత. నిద్ర చెడుతుందని నల్లి కుట్టదా? అని మరో సామెత ఉంది. నిద్రపోయేవాడు గోచి పెట్టుకుంటే వాడు లేచినంతవరకే దక్కినట్లు అని కూడా తెలుగులో సామెత ఉంది.

Read Also : Cricket: క్రికెటర్ల ముఖంపై తెల్లటి పూత ఎందుకు పూసుకుంటారు?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు