Cricket: సాధారణంగా చాలా మంది క్రికెటర్లు (Cricket) ముఖంపై తెల్లటి పౌడర్ పూసుకోవడం ప్రేక్షకులు గమనిస్తుంటారు. మైదానంలోకి వచ్చేటప్పుడు ఇలా ముఖంపై తెల్లటి పూతతో క్రికెటర్లు (Cricket) కనిపిస్తుంటారు. ఇలా ఎందుకు చేస్తారనేది చాలా మందికి తెలియదు. ఇందుకు కొన్ని ప్రత్యేక కారణాలున్నాయట. ఇలా చేయడం వల్ల క్రికెటర్లకు ఉపయోగాలు కలుగుతాయి. పైగా ఈ తరహా జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్యంపై ప్రభావం కూడా చూపుతుంది.
అంత సమయం సూర్మరశ్మి శరీరానికి తగలడం హానికరం. నేరుగా సూర్యుని వేడికి గురవుతారు. దీంతో చర్మాన్ని, ఆరోగ్యాన్ని రక్షించుకోవడం కోసం జింక్ ఆక్సైడ్‌ను క్రికెటర్లు వినియోగిస్తారు. వన్డేల్లో అయితే సుమారు 8 గంటల పాటు మైదానంలో గడపాల్సి వస్తుంది. టీ20 మ్యాచ్‌లలోనూ నాలుగు గంటల పాటు ఉండాలి. అయితే, టెస్టు మ్యాచ్‌ల విషయానికి వస్తే.. ఏకంగా ఐదు రోజులపాటు సూర్యుని ఎండ నేరుగా క్రికెటర్ల శరీరానికి తగులుతుంది.
క్రికెటర్లు ఇలా ముఖంపై పూసుకొనే తెల్లటి పౌడర్‌ను జింక్ ఆక్సైడ్ అని పిలుస్తారు. ఇది పూసుకోవడం వల్ల చర్మంపై రిఫ్లెక్టర్‌గా పని చేస్తుంది. ఇలా చేయడం వల్ల సూర్యుని నుంచి వచ్చే హానికరమైన కిరణాల ధాటికి శరీరం దెబ్బతినకుండా ఉంటుంది. యూవీ, యూవీబీ కిరణాలను చర్మంపై నుంచి దూరం చేస్తుంది. క్రికెటర్లు మైదానంలో సుమారు ఆరు గంటలపాటు గడపాల్సి వస్తుంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రకాల పనులూ చేయాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో చర్మాన్ని రక్షించుకోవడం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా క్రికెటర్లు పాటించాల్సి ఉంటుంది. జింక్ ఆక్సైడ్ వంటి ఫిజికల్ సన్ స్క్రీన్ తో చర్మాన్ని రక్షించుకోవడం అనేది సురక్షితమైన పద్ధతి. జింక్ క్రీములు, తెల్ల రంగులో ఉన్నవి ప్రభావవంతంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పౌడర్ మందపాటి పూత కారణంగా అన్ని యూవీఏ, యూవీబీ కిరణాలను ఫిల్టర్ చేస్తుందని స్పష్టం చేస్తున్నారు.
ఈ పౌడర్‌లో ఉండే మందపాటి పూత అన్ని యూఏవీ, యూవీబీ కిరణాలను ఫిల్టర్ చేస్తుంది. చెవి, ముక్కును రక్షించడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయ రసాయనాలతో పోల్చినప్పుడు జింక్ ఆక్సైడ్ చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. జింక్ ఆక్సైడ్ వెంటనే పనిచేయడం మొదలు పెడుతుంది. కానీ కొన్ని రసాయన సన్ స్క్రీన్ లు ఎండలో బయటకు వెళ్లే ముందు ముఖానికి పూసుకున్న తర్వాత 20 నిమిషాలు వేచి ఉండాలని నిపుణులు సూచిస్తున్నాయి.
ఇది చాలా సున్నితమైన చర్మానికి కూడా తగినంతగా రక్షణ కవచంగా నిలుస్తుందని చెబుతున్నారు. రసాయన సన్ స్క్రీన్ లు, మరోవైపు, చర్మానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. జింక్ ఆక్సైడ్ పొడి చర్మానికి చికాకు, ఇతర ఇబ్బందుల నుంచి రక్షిస్తుంది. అందుకే క్రికెటర్స్ ముఖానికి ఈ పౌడర్‌ను అప్లై చేసుకుంటూ ఉంటారు. సూర్యకాంతి నుంచి రక్షణ పొందుతారు. ఇటీవలే ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్ ఈ తరహా చర్మ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ క్రికెటర్లందరికీ ఆయన సూచించాడు. తాను చర్మ క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, ఇప్పుడు దాని గురించి అవగాహన కల్పించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నాడు.
Read Also : Indian Cricketers: ఈ క్రికెటర్లు ప్రభుత్వ అధికారులుగా గుర్తింపు పొందారు..