గురువారం, 17 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

Vijayasai Tweet on Jagan : జగన్‌పై విజయసాయి సంచలన ట్వీట్!

Keerthanaa News Deskప్రచురణ తేదీ: మంగళవారం, 27 మే 2025
Vijaysai tweet on jagan

Vijayasai Tweet on Jagan : మాజీ వైయస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైయస్సార్ సీపీలోని కొందరు వ్యక్తులు జగన్ ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే తనకు లేనిపోనివి ఆపాదిస్తున్నారంటూ విజయసాయి ట్వీట్ (Vijayasai Tweet on Jagan)  చేశారు. ట్వీట్లో విజయసాయి ఏమన్నారంటే..

‘‘నేను మౌనంగా ఉండడం వైయస్సార్ సీపీలో కోటరీకి నచ్చటం లేదు. అందుకే నాపై వైయస్సార్ సీపీ సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెట్టారు. నన్ను కెలకటం, ఇరిటేట్ చేయటం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను. నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్నవారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో కానీ జగన్ గారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు.

నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలి పశువును చేద్దాం అని కోటరి నిర్ణయించుకున్నందున, నన్ను అంతకు ముందు నుంచి 4 ఏళ్ళుగా అవమానిస్తున్నందున, లేని అభాండాల్ని నా నెత్తిన మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను. 2011లో 21 కేసులు పైన వేసుకున్న నేను 2025లో కూడా జగన్ గారే అడిగి ఉంటే (కోటరీ ద్వారా రుద్దే ప్రయత్నం చేయకుండా) సంబంధం లేకున్నా బాధ్యత తీసుకుని ఉందేవాడినేమో.

కోటరీ వారే నాకు వెన్నుపోటు పొడిచారు. 3 తరాలుగా అ కుటుంబానికి సేవచేసిన నన్ను కోటరీ మాటలు నమ్మి జగన్ గారు పక్కన పెట్టారు. ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు, అలా చేయకుంటే చెడ్డవాడు అవుతాడా? అలా చేయకుంటే వెస్నుపోటు దారుడు అవుతాడా? అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడు పోయిన మనిషి అవుతాడా?

అవును. నేను ఘట్టమనేని ఆది శేషగిరిరావుగారి ఇంటికి వెళ్ళా. నాకు స్వర్గీయ కృష్ణ గారి కుటుంబానికి రెండు దశాబ్దాల అనుబంధం. అందరూ నా కుమార్తె వివాహానికి వచ్చారు.

అదే సమయం లో టీడీ జనార్ధన్, వారి ఇంటికి వస్తున్న విషయం నాకు తెలియదు. మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు.
నేను ఈ జన్మకు టీడీపీలో చేరటం లేదని ముందే చెప్పా. కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్ గారిని, చంద్రబాబుగారినే కలుస్తాకానీ వేరేవాళ్ళతో ఎందుకు చర్చిస్తాను? వారు గతంలో రాజకీయ ప్రత్యర్థులు. ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేసు.

లిక్కర్ స్కామ్ లేదని జగన్ గారు అంటుంటే, ఆ స్కాం రహస్యాలు టీడీపీతో మాట్లాడటానికి నేసు ఆ పార్టీ నాయకుల్ని కలిశా అని జగన్ గారి కోటరీ అంటున్నారు. మరి, స్కామ్ లేనప్పుడు, నేను ఏం చర్చిస్తాను. స్కాం గురించి సిట్ విచారణలో A1 గురించి చెప్పానే కానీ వేరే ఎవ్వరిని నేను ప్రస్తావించలేదు.’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు.

ఇవీ చదవండి: Vijayasai Reddy on Babu: చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారు : విజయసాయిరెడ్డి
YS Jagan PC : అరెస్టులపై సంచలనం.. సుదీర్ఘ ప్రెస్‌మీట్లో జగన్ హాట్ కామెంట్స్
Vizag Drugs: అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు!

ట్యాగ్స్: , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading