మంగళవారం, 15 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh, National, Telangana

Today Top News : ఈరోజు ముఖ్యమైన వార్తలు.. ముఖ్యాంశాలు (03.09.2025)

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 3 సెప్టెంబర్ 2025

Today Top News : సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. డిప్యూటీ సీఎం పవన్ పాల్గొననున్నారు. మరోవైపు కేంద్ర కేబినెట్ కూడా ఇవాళ సాయంత్రం భేటీ కానుంది. లిక్కర్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. తాడిపత్రికి కేతిరెడ్డిపెద్దారెడ్డి వెళ్లనున్నారు. ఈరోజు టాప్ న్యూస్ పై ఓ లుక్కేద్దాం.. (Today Top News)

1. చంద్రబాబు నేటి షెడ్యూల్… 11.30 గంటలకు రాష్ట్ర అర్ధిక సంఘం సమావేశం. మధ్యాహ్నం 12.30 గంటలకు పర్యాటక పాలసీపై సమీక్ష

2. చంద్రబాబు ఆధ్వర్యంలో ఫైనాన్స్ కమిషన్ ప్రెజెంటేషన్.. సమావేశానికి హాజరుకానున్న పవన్‌కల్యాణ్, మంత్రులు

3. రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. CRDA అథారిటీ చర్చించిన పలు అంశాలకు ఆమోదం. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా కేబినెట్‍లో చర్చ. ఈనెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.

4. నేడు ఏపీ సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మధ్యాహ్నం 12 గంటలకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో పాల్గొననున్న పవన్.. పంచాయితీ రాజ్.. గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించే అవకాశం

5. నేడు తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. కోర్టు ఆదేశాలతో తాడిపత్రికి వెళ్లనున్న పెద్దారెడ్డి. తాడిపత్రికి రాకుండా.. ఇటీవల పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు. మరోసారి పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనతో హైఅలర్ట్

6. నేడు ఏలూరులో ఏపీ బీజేపీ చీఫ్‌ మాధవ్ పర్యటన.. జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరు

7. విశాఖ: నేడు కార్మికులు, విద్యార్థి సంఘాలు స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణా ర్యాలీ. జగదాంబ జంక్షన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు కొనసాగనున్న ర్యాలీ.. EOI రద్దు, తొలగించిన కాంట్రాక్ట్‌ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌

8. ఏపీ: అక్రమ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి మధ్యంతర, రెగ్యులర్ బెయిల్‌, వసతుల కల్పన రివ్యూ పిటిషన్లపై.. నేడు విచారించనున్న విజయవాడ ఏసీబీ కోర్టు

9. ఏపీ: అక్రమ లిక్కర్‌ కేసులో చెవిరెడ్డి రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్లపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ

10. విజయవాడ:నేడు రెండో రోజు కస్టడీకి IPS అధికారి సంజయ్.. ఫైర్ సేఫ్టీనిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ విచారణ

11. తూ.గో జిల్లా: నేడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిధున్ రెడ్డితో నేడు వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు, ఆలూరు నియోజవర్గ శాసనసభ్యులు బి. విరూపాక్షి, డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు ములాఖత్

12. నేటి నుంచి గుంటూరు మిర్చియార్డులో కార్మికుల‌ సమ్మె.. కొట్టు కాటా, దిగుమతి ముఠా, కాపలా కార్మికుల కూలీ రేట్లు పెంచాలని డిమాండ్

13. ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్‌ భేటీ

14. ఢిల్లీ: నేటి నుంచి రెండు రోజుల పాటు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాలు.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన మీటింగ్‌.. హాజరుకానున్న అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులు

15. నేడు మీడియా ముందుకు కవిత.. మధ్యాహ్నం 12 గంటలకు కవిత ప్రెస్‌మీట్. సస్పెన్షన్‌, భవిష్యత్ కార్యాచరణపై స్పందించే అవకాశం.. పార్టీ పదవి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో కవిత

ఇవీ చదవండి: Telangana : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఫ్యామిలీకి రూ.18 వేలు!
Maratha Reservation: 6 డిమాండ్లకు ఓకే.. 120 గంటల జరంగే దీక్ష విరమణ..
Gold Rates today : భగభగ మండుతున్న బంగారం ధరలు.. ఈరోజు రేట్లు

ట్యాగ్స్: , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading