Renuka Chowdary: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత అయినప్పటికీ ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేస్తుంటారు. ముఖ్యంగా ఓ వర్గానికి చెందిన వారికి మద్దతుగా నిలుస్తూ, మరో సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన ఈమె.. ఇప్పుడు ఆయన తనయుడు, కుమార్తెలపై హాట్ కామెంట్స్ చేస్తూ రాజకీయంగా వార్తల్లో నిలుస్తున్నారు. (Renuka Chowdary)
తాజాగా వైయస్సార్ కుమార్తె షర్మిల రాజకీయ భవిష్యత్‌పై, ఆమె రాజకీయాలపై రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన రేణుకా చౌదరి.. షర్మిల పాలేరు లో పోటీ చేస్తాననడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలేరు లో పోటీ చేయడానికి ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా ? అని ప్రశ్నించారు. తెలంగాణ కోడలుగా షర్మిలకు ఇప్పుడే గుర్తుకొచ్చిందా ? అని నిలదీశారు.
ముందు అమరావతిలో రైతుల గురించి షర్మిల మాట్లాడాలంటూ రేణుకా చౌదరి కౌంటర్ ఇచ్చారు. కొన్నాళ్లుగా ఏపీలో అమరావతి రైతులకు మద్దతుగా రేణుకా చౌదరి మాట్లాడుతున్నారు. సీఎం జగన్‌పై కూడా రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేస్తుండడం తెలిసిందే. ఏపీ నేతలకు తెలంగాణ లో ఏం పని ? అంటూ షర్మిలను ఉద్దేశించి తాజాగా రేణుకా చౌదరి కామెంట్ చేశారు. తెలంగాణలో షర్మిల ఏంతో .. ఏపీలో నేను కూడా అంతేనని చెప్పుకొచ్చారు. షర్మిల తెలంగాణలో పోటీ చేసే విషయంలో హైకమాండ్ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తాను ఏపీ కోడల్ని .. తెలంగాణ అడబిడ్డనని రేణుకా చౌదరి పేర్కొన్నారు.
కేవీపీ తెలంగాణకు వద్దామనే ఆలోచన మానుకోవాలి
కేవీపీ తెలంగాణకు వద్దామనే ఆలోచన మానుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు హెచ్చరించారు. విభజన వద్దని ప్లకార్డులు పట్టుకున్నప్పుడు కేవీపీకి తెలంగాణ గుర్తుకు రాలేదా? అని ప్రశ్నలు గుప్పించారు. ఏపీలో పార్టీ బలహీనంగా ఉందని వీహెచ్ అభిప్రాయపడ్డారు. కేవీపీ ఏపీ వెళ్లి పనిచేస్తే బెటర్ అంటూ వీహెచ్ సలహా ఇచ్చారు.
ఇదీ చదవండి: Sharmila issue: తెలంగాణ కాంగ్రెస్‌లో షర్మిల కల్లోలం