Sharmila issue: తెలంగాణ కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. బెంగుళూరు కేంద్రంగా ఆపరేషన్ షర్మిల కొనసాగుతోందని టాక్ వినిపిస్తోంది. షర్మిల పార్టీ విలీనంలో డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. రేవంత్‌తో చర్చించే బాధ్యత శివకుమార్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈమేరకు శివకుమార్‌తో రేవంత్ భేటీ అయ్యారని టాక్. చర్చల్లో పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు పాల్గొన్నారని సమాచారం. ఇప్పటికే బెంగళూరు వెళ్లిన రేవంత్ రెడ్డి.. ఈ మేరకు పావులు కదుపుతున్నారు. (Sharmila issue)
తెలంగాణలోనే రాజకీయం చేసే యోచనలో షర్మిల ఉన్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలకే పరిమితం చేయాలంటూ రేవంత్ పట్టుబడుతున్నారట. నిన్న సోనియా, రాహుల్ గాంధీతో షర్మిల భేటీ అయిన సంగతి తెలిసిందే. షర్మిల రాజకీయ భవిష్యత్‌పై సోనియా హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. షర్మిలకు జాతీయస్థాయిలో కీలక పదవి అప్పగించేలా అధిష్టానం ప్లాన్ చేస్తోందట.
తెలంగాణ, ఏపీ ఎన్నికల్లో కీ రోల్ పోషించేలా షర్మిలను కాంగ్రెస్ ఉసిగొలుపుతోందట. రెండేళ్లుగా తాను చేసిన పోరాటాలు సోనియాకు షర్మిల వివరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ బలోపేతానికి పార్టీ విలీనం చేసేందుకు సిద్ధమని షర్మిల తెలిపిందట. వైఎస్ వర్థంతి సందర్భంగా రేపే పార్టీ విలీనానికి షర్మిల సిద్ధమైనట్లు తెలుస్తోంది.
రాహుల్ గాంధీ షెడ్యుల్ బిజీగా ఉండటంతో విలీనం వాయిదా పడిందట. తెలంగాణలో షర్మిల రాజకీయానికి రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. అవసరమైతే ఎన్నికల తర్వాత చేర్చుకోవాలని అధిష్టానానికి సూచించారట. ఎన్నికలకు ముందే చేర్చుకుంటే కేసీఆర్‌కు అస్త్రంగా మారొచ్చనే అభిప్రాయం వెలిబుచ్చారట. పాలేరులో పోటీ చేస్తానని గతంలో షర్మిల ప్రకటించారు. షర్మిలకు చెక్ పెట్టేందుకు తుమ్మలను రేవంత్ తెరపైకి తెచ్చారనే టాక్ నడుస్తోంది.
Read Also : CM Jagan review on rains: వర్షాల కొరత నేపథ్యంలో సీఎం జగన్ కీలక సమీక్ష