శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Sports

Viral Video : ఇవే.. తగ్గించుకుంటే మంచిది.. బౌలర్‌ను వెక్కిరించబోయి వికెట్ సమర్పించుకున్న పాక్ బ్యాటర్

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శనివారం, 17 జనవరి 2026

Viral Video : పాకిస్థాన్ క్రికెటర్లకు ఇటీవలి కాలంలో అదృష్టం కలిసి రావడం లేదు. అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే కాదు… విదేశీ టీ20 లీగ్‌ల్లో కూడా పాక్ ఆటగాళ్లు వరుసగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) వేదికగా చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

బీపీఎల్‌లో రాజ్‌షాహి వారియర్స్ తరఫున ఆడుతున్న పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్, సిల్హెట్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చేసిన అతి ఉత్సాహం చివరకు అతనికే భారీ అవమానంగా మారింది.

బౌలర్‌ను వెక్కిరించిన ఫర్హాన్
ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో బంగ్లాదేశ్ బౌలర్ రుయెల్ మియా వేసిన బంతిని ఫర్హాన్ సాధారణంగా డిఫెండ్ చేశాడు. బంతి నేరుగా బౌలర్ వద్దకు వెళ్లింది. అక్కడితో ఆగాల్సిన వ్యవహారం… ఫర్హాన్ చేసిన చేష్టతో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది.

బంతి తిరిగి బౌలర్ చేతికి చేరగానే, ఫర్హాన్ తన చేతిని ముఖం ముందు తిప్పుతూ హాలీవుడ్ రెజ్లర్ జాన్ సీనా ఫేమస్ “యూ కాంట్ సీ మీ” స్టైల్‌లో బౌలర్‌ను వెక్కిరించాడు. అనవసరంగా ప్రత్యర్థిని కించపరిచేలా చేసిన ఈ ప్రవర్తన స్టేడియంలో ఉన్న అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.

మరుసటి బంతికే రివర్స్ షాక్
ఫర్హాన్ చేసిన ఈ ఓవర్ యాక్షన్‌కు రుయెల్ మియా మాటలతో కాదు… బంతితోనే సమాధానం ఇచ్చాడు. తదుపరి డెలివరీకి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన ఫర్హాన్, షార్ట్ థర్డ్ మ్యాన్ ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.

కేవలం 12 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసిన ఫర్హాన్, తల పట్టుకుని నిరాశగా వెనుదిరిగాడు. క్రీజ్‌లో నిలబడినంతసేపు బౌలర్‌ను వెక్కిరించిన బ్యాటర్… ఒక్క బంతిలోనే తన వికెట్‌ను కోల్పోయాడు.

చహల్ స్టైల్‌లో బౌలర్ సెలబ్రేషన్
అయితే ఇక్కడే అసలు హైలైట్ మొదలైంది. వికెట్ తీసిన రుయెల్ మియా, ఆగ్రహంగా సంబరాలు చేసుకోకుండా… టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఫేమస్ సెలబ్రేషన్‌ను అనుకరిస్తూ మైదానంలో పడుకుని నవ్వుతూ సెలబ్రేట్ చేశాడు. ఈ దృశ్యం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

ఫర్హాన్ ఓవర్ యాక్షన్‌కు ఇది పర్ఫెక్ట్ రిప్లై అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

విదేశీ లీగ్‌ల్లో పాక్ ఆటగాళ్లకు వరుస విమర్శలు
ఈ ఘటన ఒక్క ఫర్హాన్‌కే పరిమితం కాదు. ఇటీవల విదేశీ లీగ్‌ల్లో పాకిస్థాన్ ఆటగాళ్లు వరుసగా విమర్శల పాలవుతున్నారు.
బిగ్ బాష్ లీగ్‌లో షాహీన్ అఫ్రిదీ ఒకే ఓవర్‌లో రెండు బీమర్లు వేయడంతో బౌలింగ్ నుంచి నిషేధానికి గురయ్యాడు. మరోవైపు మహ్మద్ రిజ్వాన్ నెమ్మదిగా ఆడుతున్నాడన్న కారణంతో కెప్టెన్ అతడిని రిటైర్డ్ అవుట్ చేయడం చర్చనీయాంశమైంది. అలాగే బాబర్ ఆజం సింగిల్ తీసేందుకు ప్రయత్నించగా, స్టీవ్ స్మిత్ నిరాకరించిన సంఘటన పెద్ద వివాదానికి దారి తీసింది.

ఈ పరిణామాలన్నింటినీ చూస్తున్న నెటిజన్లు…
“తినడం – ఆడటం – అవమానపడటం – మళ్లీ అదే రిపీట్” అంటూ పాక్ క్రికెటర్లను ట్రోల్ చేస్తున్నారు.
బీపీఎల్ వేదికగా జరిగిన ఈ సంఘటన మాత్రం…
అతి చేస్తే అవుట్ తప్పదన్న సందేశాన్ని మరోసారి స్పష్టంగా చెప్పిందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి: No Handshake Policy : ఐసీసీ విజ్ఞప్తిని పట్టించుకోని భారత్.. భారత్–పాక్ మ్యాచ్‌లోనూ కొనసాగిన నో హ్యాండ్‌షేక్ పాలసీ
IND vs PAK: ఐసీసీ సర్ప్రైజ్ ట్విస్ట్.. భారత్–పాక్ మ్యాచ్ లేకుండానే U-19 వరల్డ్ కప్ 2026 పూర్తి షెడ్యూల్ విడుదల

ట్యాగ్స్: , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading