శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
National

Congress News: ఐదు రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకులను నియమించిన కాంగ్రెస్

Keerthanaa News Deskప్రచురణ తేదీ: మంగళవారం, 1 ఆగస్టు 2023

Congress News: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై హస్తం పార్టీ ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగా ఐదు రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకులను కాంగ్రెస్‌ అధిష్టానం నియమించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత దీపా దాస్ మున్షీని అధిష్టానం నియమించింది. అబ్జర్వర్ గా సిరివెళ్ల ప్రసాద్ నియామకం జరిగింది. రాజస్థాన్ సీనియర్ అబ్జర్వర్ గా మధుసూదన్ మిస్త్రీ, అబ్జర్వర్ గా శశికాంత్ సెంథిల్‌ను నియమిస్తూ కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది. (Congress News)

Read Also : Telangana Congress: కర్ణాటక ప్రభావం తెలంగాణపై ఉంటుందా?

ఇక మధ్యప్రదేశ్ సీనియర్ అబ్జర్వర్ గా రణదీప్ సూర్జేవాలా, అబ్జర్వర్ గా చంద్రకాంత్‌ను కాంగ్రెస్‌ నియమించింది. ఛత్తీస్‌గఢ్ సీనియర్ అబ్జర్వర్ గా ప్రీతమ్ సింగ్ అబ్జర్వర్ గా మీనాక్షి నటరాజన్‌కు చోటు కల్పించింది. మిజోరాం అబ్జర్వర్ గా సచిన్ రావు పని చేస్తారని కాంగ్రెస్‌ తెలిపింది. కర్ణాటకలో ఘన విజయం తర్వాత దేశ వ్యాప్తంగా ఇదే సీన్‌ రిపీట్‌ అవుతుందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ కూడా రెండో విడత భారత్‌ జోడో యాత్ర చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read Also : KTR Comments: గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని కేంద్రం రాజకీయాలు : కేటీఆర్

ట్యాగ్స్: , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading