Aditya L1: నేడు ఆదిత్య-ఎల్1 ప్రయోగం చేపట్టనున్న ఇస్రో

Aditya L1: ఇవాళ ఉ.11.50 గం.కు ఆదిత్య-1ను ప్రయోగించనుంది ఇస్రో. ఆదిత్య-ఎల్1ను పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్.. నింగిలోకి మోసుకెళ్లనుంది. ఆదిత్య-ఎల్1ను లాగ్రాంజ్ పాయింట్-1 కక్ష్యలో ప్రవేశపెట్టనుంది ఇస్రో. భూమి నుంచి 15 లక్షల కి.మీ. దూరంలో లాగ్రాంజ్ పాయింట్-1 ఉంది. 125 రోజులు ప్రయాణించి లాగ్రాంజ్ పాయింట్-1 చేరుకోనుంది ఆదిత్య-ఎల్1. శ్రీహరికోట నుంచి ఆదిత్య-ఎల్1 ప్రయోగం చేపట్టనుంది ఇస్రో. 7 పేలోడ్‌లను ఆదిత్య-ఎల్1 నింగిలోకి మోసుకెళ్లనుంది. (Aditya L1)

ఆదిత్య-ఎల్1 సూర్యడి పొరలను అధ్యయనం చేయనుంది. ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా పొరలపై ఆదిత్య-ఎల్ అధ్యయనం చేయనుంది. సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాలను పరిశోధించనుంది. కరోనాగ్రఫీ పరికంలో సౌరవాతావరణాన్ని ఆదిత్య-ఎల్1 పరిశోధించనుంది. ఇటీవలే చంద్రయాన్-3ని విజయవంతం చేసి ఇస్రో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ఆదిత్య – ఎల్ 1 ప్రయోగం పై ఇస్రో ట్వీట్

ఆదిత్య – ఎల్ 1 సూర్యుడి పై ల్యాండ్ కాదని ఇస్రో తెలిపింది. భూమి నుంచి 1.5 మిలియన్ కి.మీ దూరంలో ఉండి పరిశోధనలు సాగిస్తుందని ఇస్రో తెలిపింది. సూర్యుడి బాహ్య వాతావరణాన్ని ఆదిత్య – ఎల్ 1 అధ్యయనం చేస్తుందని వెల్లడించింది. ఈ మేరకు ఇస్రో ట్వీట్‌ చేసింది.

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles