డబ్బు పొదుపు చేసుకోవడానికి ప్రస్తుతం ప్రజలు చాలా మార్గాలను అన్వేషిస్తున్నారు. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్, షేర్లలో ఇన్వెస్ట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఇలా రకరకాలుగా ఆలోచన చేస్తుంటారు. నెలవారీ ఆదాయంలో కాస్త పక్కనపెట్టి భవిష్యత్ అవసరాల కోసం దాచుకొనే వారి సంఖ్య ప్రస్తుతం పెరుగుతూ వస్తోంది. అలాంటి వారి కోసం పలు బ్యాంకులు చాలా పథకాలతో ఆకర్షిస్తుంటాయి. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులైతే విపరీతంగా వినియోగదారులకు ఫోన్లు చేసి మరీ ఆఫర్లు చెబుతుంటాయి. అయితే, డబ్బు పొదుపు చేసుకోవాలనుకొనే వారికి పోస్టాఫీసు (Post Office) మంచి ఆప్షన్ అని నిపుణులు సూచిస్తున్నారు. పోస్టాఫీసులో (Post Office) చాలా పథకాలు పొదుపు చేసుకొనే వారి కోసం ఉన్నాయి.
1. పోస్టాఫీసులో చాలా రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి.
2. ముఖ్యంగా భార్యాభర్తల కోసం ఓ స్కీమ్ ను తెచ్చింది తపాలా శాఖ.
3. ఇందులో దంపతులిద్దరూ వార్షికంగా రూ.59,400 వరకు సంపాదించవచ్చు. దీని పేరు పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ (Post Office).
4. ఇందులో ప్రతి నెలా ఓ నిర్దిష్ట ఆదాయాన్ని పొందే వీలు కలుగుతుంది.
5. నెలవారీ స్కీమ్ నుంచి ప్రయోజనాలు పొందగోరేవారు నెలకు రూ.4,950 పొందవచ్చు.
6. పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ పథకం కింద దంపతులు జాయింట్ ఖాతా తెరవచ్చు.
7. దీని ద్వారా ఈ అకౌంట్లో డబ్బులు రెట్టింపవుతాయి. పథకంలో కనీసం రూ.1000 పెట్టుబడిగా పెట్టాలి.
8. సింగిల్ గా అకౌంట్ ఓపెన్ చేస్తే గరిష్టంగా నాలుగున్నర లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు.
9. జాయింట్ అకౌంట్ అయితే 9 లక్షల వరకు డిపాజిట్ చేసే వీలుంది.
10. రిటైర్ అయిన ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ కు ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
11. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే ఏడాదికి 6.6 శాతం వడ్డీ వస్తుంది.
12. రిటర్నులు, మీరు పెట్టిన డిపాజిట్లపై పొందిన వార్షిక వడ్డీ రేట్లను ఆధారంగా చేసుకొని లెక్కేస్తారు.
13. భార్యాభర్తలిద్దరూ 9 లక్షల వరకు డిపాజిట్ చేస్తే 6.6 శాతం వడ్డీ చొప్పున రూ.59,400 వరకు డబ్బులు వస్తాయి.
14. నెలకు రూ.4,950 దాకా అందుకోవచ్చు. ఐదేళ్లకోసారి దీన్ని రెన్యువల్ చేసుకోవాలి.
Electric Scooter: 15 నిమిషాలు చార్జ్ చేయండి.. 50 కిలోమీటర్లు ప్రయాణించండి!
ప్రస్తుతం మార్కెట్లోకి రకరకాల స్కూటర్లు వచ్చేశాయి. ఇందులో పెట్రోలుతో నడిచే స్కూటీలతో పాటు ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటీలు కూడా సందడి చేస్తున్నాయి. అయితే, ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటీల బ్యాటరీలు పేలడం కారణంగా చాలావరకు ప్రమాదాలు సంభవించాయి. కొన్నింటిని కంపెనీలు వెనక్కికూడా తీసుకున్నాయి. ఈ క్రమంలో బెస్ట్ స్కూటీ ఏదని చాలా మందికి సందేహాలు కలుగుతుంటాయి. ఈ క్రమంలో తాజాగా స్కూటీ మార్కెట్లోకి వచ్చింది. దాని విశేషాలు పాయింట్ల రూపంలో తెలుసుకోండి..
1. గత కొద్ది కాలంగా ఎలక్ట్రిక్ స్కూటీల ట్రెండ్ నడుస్తోంది.
2. ముఖ్యంగా గడచిన వేసవి కాలం ముందు వీటిని విపరీతంగా మార్కెట్లోకి విడుదల చేశారు. కొనుగోలు కూడా అదే స్థాయిలో జరిగాయి.
3. ప్రముఖ బుకింగ్ యాప్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటీల బిజినెస్ లోకి ఎంటరయ్యాక ఈ రంగం పీక్ స్టేజ్ లోకి చేరింది.
4. కొనుగోలుదారులు భారీగా బుకింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. తాజాగా సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది ఓలా.
5. ఓలా ఎస్1 ఎయిర్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి వచ్చింది.
6. దీని ధర మార్కెట్లో రూ.85 వేల వరకు ఉంది. ఓసారి ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేసేయొచ్చు.
7. ఓలా విడుదల చేసిన ఈ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటీ బుకింగ్ ధర కేవలం రూ.999.
8. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ తో పోలిస్తే రూ.20 వేల తక్కువగా, ఎస్1 ప్రో స్కూటర్ తో పోలిస్తే రూ.50 వేలు తక్కువగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది.
9. ఇది రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
10. 7 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే ఉంటుంది. దీని బరువు 99 కేజీలు.
11. సింగిల్ చార్జ్ లో ఎకో విధానం ద్వారా వంద కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు.
12. దీని గరిష్ట స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. 4 సెకన్లలో 40 కిలోమీటర్ల వేగం అందుకోగల సామర్థ్యం ఉంది.
Read Also : WhatsApp: ఆధార్, పాన్ కార్డు వాట్సప్‌లో డౌన్‌లోడ్ చేసేయండి!