AP Assembly news: ఉద్యోగులకు మరింత మేలు చేకూరుస్తూ సీఎం జగన్ ప్రభుత్వం జీపీఎస్ బిల్లును నిన్న శాసనసభలో ఆమోదించింది. మరోపక్క కాంట్రాక్ట్ ఉద్యోగులకకు కూడా శుభవార్త చెప్పింది. శాసనసభ ఐదో రోజు సమావేశాల్లో ఇలాంటి పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. 5 రోజులపాటు కొనసాగిన శాసనసభ, మండలి నిరవధికంగా వాయిదా పడ్డాయి. (AP Assembly news)
ప్రశ్నోత్తరాలతో మొదలై పలు అంశాలపై చర్చ కొనసాగింది. మైనార్టీల సంక్షేమంపై ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడారు. విద్య, వైద్యం, దళితుల సంక్షేమం, సున్నా వడ్డీ పథకం తదితర అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. మరోవైపు శాసన మండలి ప్రారంభం కాగానే రాష్ట్రంలో రోడ్లు, రహదారుల ఏర్పాటు అంశంపై పీడీఎఫ్ వాయిదా తీర్మానం ఇవ్వగా చైర్మన్ తిరస్కరించారు.
పౌర సరఫరాల శాఖ ద్వారా అందిస్తున్న బియ్యం గురించి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండలిలో మాట్లాడారు. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్‌పై అసెంబ్లీలో మంత్రులు ధర్మాన, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు పేర్ని నాని, వసంత కృష్ణప్రసాద్.. చంద్రబాబు, లోకేష్‌ల బండారాన్ని బట్టబయలు చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన జీపీఎస్‌తో కలిగే మేలును సవివరంగా తెలిపారు.
ఆమోదం పొందిన బిల్లులు ఇవే..
1. ఆంధ్ర ప్రదేశ్ సివిల్ కోర్ట్స్ (అమెండ్మెంట్) బిల్లు–2023
2. ఆంధ్రప్రదేశ్ గ్యారెంటీ పెన్షన్ సిస్టమ్ బిల్లు– 2023
3. ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సెకండ్ అమెండ్మెంట్ బిల్లు –2023
4. ఆంధ్రప్రదేశ్ రెగ్యులైజేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ బిల్లు–2023
5. ఆంధ్ర ప్రదేశ్ అప్రాప్రియేషన్ నెంబర్ –3 బిల్లు –2023.
కాంట్రాక్టు ఉద్యోగుల చిరకాల వాంఛను సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. వివిధ శాఖల్లో సుమారు 10,117 మంది ఫుల్‌టైం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నారు. వీలైనంత ఎక్కువ మందికి మేలు చేసేలా 2–6–2014కు ముందు ఐదేళ్లు సర్వీసు ఉండాలనే నిబంధనలను సీఎం జగన్ సడలించారు. రాష్ట్రం విడిపోయిన నాటికి పర్మినెంట్ శాంక్షన్డ్ పోస్టులో ఫుల్ టైం కాంట్రాక్టు విభాగంలో నియమితులైన వారిని క్రమబద్ధీకరిస్తారు. శాంక్షన్డ్ పోస్టుకు ఆర్థిక శాఖ అనుమతి ఉండి నోటిఫై అయిన ఖాళీలను నిర్దిష్ట నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ పారదర్శకంగా భర్తీ చేసి ఉండాలి.
Read Also: World tourism day 2023: టూరిజంలో నంబర్ వన్ అవుదాం.. ప్రపంచ పర్యాటక దినోత్సవంలో మంత్రి రోజా
