శనివారం, 19 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

OTT Movie : థియేటర్లలో నవ్వించిన ‘నారీ నారీ నడుమ మురారి’ ఇప్పుడు ఓటీటీలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్… శర్వానంద్ కామెడీకి మరోసారి ఛాన్స్

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 4 ఫిబ్రవరి 2026

OTT Movie : టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో Sharwanand నటించిన లేటెస్ట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ Naari Naari Naduma Murari థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సంక్రాంతి బరిలో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, స్టార్ హీరోల భారీ చిత్రాలతో పోటీ పడి మరీ మంచి వసూళ్లు సాధించింది.

Ram Abbaraju దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శర్వానంద్ సరసన Samyuktha Menon, Sakshi Vaidya హీరోయిన్లుగా నటించారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ.20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

కామెడీకి ఫుల్ మార్కులు
శర్వానంద్ న్యాచురల్ యాక్టింగ్‌తో పాటు Vennela Kishore, V. K. Naresh కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ముఖ్యంగా వీకే నరేష్ టైమింగ్ సినిమా హైలైట్‌గా నిలిచింది. థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా ఫుల్ ఫీస్ట్ ఇచ్చింది.

ఓటీటీలోకి వచ్చేసింది
థియేటర్లలో విజయం తర్వాత, ‘నారీ నారీ నడుమ మురారి’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ Amazon Prime Video సొంతం చేసుకుంది. ముందుగా ప్రకటించినట్టే ఫిబ్రవరి 4 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచే సినిమా అందుబాటులోకి వచ్చినట్లు అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

ఈ మూవీ తెలుగు తో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.

భారీ తారాగణం & స్పెషల్ సర్ప్రైజ్
ఈ సినిమాలో వీకే నరేష్, వెన్నెల కిశోర్, సునీల్, సత్య, సిరి హనుమంత్, మదునందన్, సంపత్ రాజ్, రఘుబాబు, సుదర్శన్, గెటప్ శీను కీలక పాత్రల్లో మెరిశారు.
అలాగే యంగ్ హీరో Sri Vishnu స్పెషల్ క్యామియోలో సందడి చేయడం మరో ప్లస్.

Adventures International Private Limited, AK Entertainments బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకు Vishal Chandrashekhar సంగీతం అందించారు.

థియేటర్లలో మిస్ అయ్యారా?
థియేటర్లలో ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను మిస్ అయ్యారా? లేదా మరోసారి ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా అమెజాన్ ప్రైమ్‌లో చూసేయండి. కుటుంబంతో కలిసి చూసేందుకు ఇది పర్ఫెక్ట్ కామెడీ ప్యాకేజ్.

ఇవీ చదవండి: Sharwanand: ఓ ఇంటివాడైన శర్వానంద్‌.. రక్షితా రెడ్డి బ్యాగ్రౌండ్ ఇదే..
Sankranti Cinema : సంకురాతిరికి సినిమాల జాతర.. డామినేషన్ ఎవరిది?

ట్యాగ్స్: , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading