Aakasam Lo Oka Tara: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న ఆకాశంలో ఒక తార సినిమాపై తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మేకర్స్ రిలీజ్ డేట్‌ను లాక్ చేశారు. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటిస్తున్న ఈ చిత్రం 2026 నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. స్వప్న సినిమా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు అందమైన ప్రపంచాన్ని తీసుకురాబోతున్నామని చిత్రబృందం వెల్లడించింది. ఈ అప్‌డేట్‌తో దుల్కర్ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకుల్లోనూ సినిమాపై ఆసక్తి పెరిగింది.
కృష్ణగా దుల్కర్ సల్మాన్
ఆకాశంలో ఒక తార సినిమాలో దుల్కర్ సల్మాన్ కృష్ణ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఆయన పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. రిలీజ్ డేట్ ప్రకటన సందర్భంగా దుల్కర్ కూడా స్పందిస్తూ.. ఈ సినిమా ప్రయాణం ఎంతో ప్రత్యేకంగా సాగిందని, నవంబర్ 20న ఈ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ఎదురుచూస్తున్నానని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దుల్కర్‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఆయన.. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
హీరోయిన్‌గా సాత్విక పరిచయం
ఈ సినిమాతో సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయం అవుతోంది. ఆమె పాత్ర సినిమాకు కీలకంగా ఉండనున్నట్లు ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో ద్వారా అర్థమైంది. సాత్విక పోషిస్తున్న యువతి ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచే అంతరిక్షంలోకి వెళ్లి వ్యోమగామి కావాలనే పెద్ద కలను కంటుంది. తన చుట్టూ ఉన్న పరిస్థితులు, సామాజిక పరిమితులు ఆమె కలకు అడ్డంకులుగా నిలిచినా.. తన లక్ష్యాన్ని సాధించేందుకు ఆమె చేసే ప్రయాణమే కథలో ప్రధాన అంశంగా కనిపిస్తోంది.
శ్రుతిహాసన్ కీలక పాత్రలో
సినిమాలో శ్రుతిహాసన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఆమె పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతిహాసన్ కాంబినేషన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
అగ్రశ్రేణి టెక్నికల్ టీమ్
ఆకాశంలో ఒక తార సినిమాకు పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ గున్నం, రమ్య గున్నం లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ, కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో సినిమా టెక్నికల్ క్వాలిటీపై కూడా ఆసక్తి నెలకొంది.
నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్
ఇప్పటివరకు సినిమా కథ, పాత్రల పరిచయం, పాటలు, పోస్టర్లతో అంచనాలు పెంచిన చిత్రబృందం ఇప్పుడు రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఆకాశంలో ఒక తార నవంబర్ 20, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్‌కు ఉన్న పాన్-ఇండియా గుర్తింపు, పవన్ సాదినేని కథను తెరకెక్కిస్తున్న విధానం, సాత్విక వీరవల్లి డెబ్యూ, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం.. ఇవన్నీ కలిసి ఆకాశంలో ఒక తారపై ఆసక్తిని పెంచుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ మరింత జోరందుకోనున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్స్ వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
Read also: Awarapan: 19 ఏళ్ల క్రితం ఫ్లాప్.. ఇప్పుడు OTTలో ట్రెండింగ్.. ఈ ఇమ్రాన్ హష్మీ సినిమా కథే వేరు
OTT Movie: ఓటీటీలో దడ పుట్టించే బాలీవుడ్ మూవీ
Bottle Gourd Juice: సొరకాయ జ్యూస్ తాగితే బరువు తగ్గుతారా? రోజూ తాగే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి






