Pawan Kalyan on Volunteers: ఏపీలో వలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ కాక రేపాయి. ఆయన కామెంట్స్‌తో వలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన హోరెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏలూరు జిల్లాలో జనసేనాని పర్యటిస్తున్నారు. వారాహి విజయ యాత్ర కొనసాగిస్తున్నారు. మూడు రోజుల్లో నిరసన పెల్లుబికి రావడంతో పవన్ తన స్వరం మార్చారు. వలంటీర్లంటే తనకు వ్యక్తిగతంగా ద్వేషం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. (Pawan Kalyan on Volunteers)
ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెంలో వారాహి విజయయాత్రలో పవన్ మాట్లాడారు. వలంటీర్ల జీతం భూంభూంకు తక్కువ.. ఆంధ్రా గోల్డ్ కు ఎక్కువ అంటూ మరోసారి పవన్ కామెంట్స్ చేశారు. వలంటీర్ల వ్యవస్థలో కొందరు కిరాతకులు ఉంటే మీరేం చేస్తారంటూ వ్యాఖ్యానించారు. వలంటీర్లు ఇళ్లకు వెళ్లి ఒంటరి ఆడవాళ్లనుు బెదిరిస్తున్నారట అని మరోసారి పవన్ కామెంట్ చేశారు. ఆడపిల్లలు లొంగకపోతే పథకాలు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని తెలిసిందంటూ వ్యాఖ్యలు చేశారు. నేరాలు చేసి జైలుకెళ్తాం.. బయటకు వచ్చి నాయకులమవుతామంటున్నారని పేర్కొన్నారు.
వలంటీర్ల పొట్ట కొట్టాలనుకోవడం లేదు…
తాను ఎప్పుడూ ఎవరినీ ఏకవచనంతో పిలవననన్న పవన్ కల్యాణ్.. వ్యక్తిగతంగా జగన్ పై తాను మాట్లాడలేదని బుకాయించారు. తాను సీఎం భార్య గురించి ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. తనను వ్యక్తిగతంగా చాలా సార్లు తిట్టారని, ముఖ్యమంత్రి పదవికి జగన్ అనర్హుడంటూ వాపోయారు పవన్. వలంటీర్ల పొట్ట కొట్టాలని తాను అనుకోవడం లేదన్నారు. వలంటీర్లు తనకు సోదరసమానులంటూ కొత్త ప్రవచనాలు చెప్పారు పవన్. వలంటీర్ల వ్యవస్థకు అధిపతి ఎవరో జగన్ చెప్పాలన్నారు. తన తండ్రి సాధారణ హెడ్ కానిస్టేబుల్ అన్నారు. టీఏ, డీఏ మీద బతికారని గుర్తుచేసుకున్నారు. మీ లాగా దోపిడీ చేయలేదంటూ పవన్ చెప్పుకొచ్చారు.
వాలంటీర్స్ దెబ్బకి పొగరు దిగినట్టు ఉంది …
భయం అంటే ఏంటో తెలిసినట్లు వుంది @PawanKalyan pic.twitter.com/bq2QUcnnTy
— 𝙈𝙖𝙣𝙖 𝙔𝙨𝙧𝙘𝙥 (@ManaYsrcp7) July 12, 2023
కొందరు లంచం తీసుకుని అనర్హులకు పథకాలు అందిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. తిరుపతిలో ఎర్రచందనం రవాణాలో వలంటీర్లు పట్టుబడ్డారని పవన్ ఆరోపించారు. మద్యపాన నిషేధం పేరు చెప్పి… లక్షా 30 వేల కోట్లు సంపాదించారంటూ ఆరోపణలు గుప్పించారు పవన్. కల్తీ మద్యం తాగించి 32 మంది ఆడబిడ్డల తాళిబొట్లు తెంపించారని వ్యాఖ్యలు చేశారు. మనుషులు చనిపోతే జగన్ కు నవ్వు వస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పవన్. జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తే అందరి జీవితాలు దుర్భరం చేశారంటూ ఆక్రోశం వెళ్లగక్కారు.
ముస్లి సమాజానికి తానంటే ఇష్టమంటూ పవన్ చెప్పుకొచ్చారు. తాను బీజేపీతో ఉన్నానని జగన్ వైపు వెళ్తామంటున్నారని, ముస్లిం మైనార్టీలకు కేటాయించిన బడ్జెట్ లో 7 శాతం మాత్రమే ఖర్చు పెట్టారని పవన్ చెప్పారు. ముస్లిం మైనార్టీ పథకాలను జగన్ తీసివేశారని ఆరోపించారు. బీజేపీతో తాను ఉన్నానా.. లేదా అనేది మీకు అనవసరమంటూ కొత్త మెలిక పెట్టారు పవన్. మీకు న్యాయం చేస్తానో లేదో ఆలోచించండండని కామెంట్ చేశారు. సోషల్ వెల్ఫేర్ నిధులను పక్కదోవ పట్టించారంటూ పవన్ ఆరోపించారు.
పూర్తయిన టిడ్కో ఇళ్లు ఎందుకు పంపిణీ చేయరంటూ పవన్ ప్రశ్నించారు. నిర్మించిన ఇళ్లలో పిచ్చి చెట్లు పెరగుతున్నాయన్నారు. జగన్ చేసిన అప్పు బడ్జెట్ లో ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. రోడ్ల గుంతలు కూడా పూడ్చలేదని, బ్రిడ్జీలు నిర్మించలేదన్నారు.
Read Also : NCRB: పవన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న వలంటీర్లు.. అమ్మాయిల మిస్సింగ్ కేసులపై వాస్తవాలివీ..