అమ్మాయిల్లో కొందరు పెళ్లంటే (Before Marriage) ఆమడదూరం పారిపోతుంటారు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటే కాస్త బెరుగ్గా ఉంటారు. వివాహ బంధం (Before Marriage) గురించి సరైన అవగాహన లేకపోవడం, ఇన్నాళ్లూ అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వదిలి మరో ఇంటికి వెళ్లాల్సి రావడం ఇందుకు ప్రధాన కారణం. పెళ్లి (Before Marriage) అనేది ఇద్దరు వ్యక్తులను కలిపే బంధమే కాదు.. ఇరు కుటుంబాల కలయిక. పచ్చని కాపురానికి నాంది పలికేది.
1. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే వారి సంసార జీవితం సుఖమయం అవుతుంది.
2. వివాహానికి ముందే కొన్ని విషయాలు తెలుసుకొని జాగ్రత్త వహించాలి. పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి గతంలో ఏవైనా లవ్ ట్రాక్స్ ఉన్నాయా? వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయా లేదా? అనేది తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం.
3. అయితే ఇలాంటి ప్రశ్నలు నేరుగా అడగటం కాస్త ఇబ్బందికర అంశమే.
4. శృంగారం అంశంలో అబ్బాయి ఆలోచన ఏంటనేది ముందే తెలుసుకుంటే మంచిది. పెళ్లి తర్వాత అతను జీవిత భాగస్వామి నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకోవాలి.
5. వివాహం అయ్యాక అమ్మాయి అనుకున్న ఆశయాలను జీవిత భాగస్వామికి తెలియజేయాలి. ఇందుకు అబ్బాయి సహకరిస్తాడా లేదా అనేది ముందే పెళ్లి చూపులప్పుడు తెలుసుకుంటే బెటర్.
6. అమ్మాయికి ఏ మేరకు స్వేచ్ఛ కల్పిస్తాడనేది కూడా ముఖ్యం. ఇవన్నీ పెళ్లి చూపుల కార్యక్రమంలో రాబట్టే ప్రయత్నాలు చేయాలి యువతులు.
7. ఒకరినొకరు గౌరవించుకుంటేనే ఏ బంధమైనా కలకాలం వర్ధిల్లుతుంది. ఇలా గౌరవం ఇస్తాడా లేదా అనేది కూడా అమ్మాయిలు తెలుసుకోవాలి.
8. పెళ్లి తర్వాత మిమ్మల్ని బాగా అర్థం చేసుకొనే వరుడినే ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వివాహం అనంతరం పిల్లల విషయంలోనూ కొన్ని జంటలు భిన్నంగా ఆలోచిస్తారు.
9. కొందరికి లైఫ్ లో సెటిల్ అయ్యాక పిల్లల్ని కనాలని ఉంటుంది. మరికొందరు వెంటనే అయిపోవాలనుకుంటారు. ఇలాంటి విషయాల్లోనూ క్లారిటీ ముఖ్యం.
10. ఇవి ముందే చర్చించుకుంటే అబ్బాయి, అమ్మాయి పెళ్లయ్యాక సమస్యల సుడిగుండంలో చిక్కుకోకుండా ఉంటారు.
పెళ్లయిన కొత్తలో ఇలా చేయండి.. సమస్యలు దూరమవుతాయి
1. యుక్త వయసు వచ్చాక యువతీ యువకులకు పెళ్లి చేసుకోవడం అనేది ప్రాధాన్య అంశం. సరైన సమయంలో పెళ్లి చేసుకున్న జంటలు అన్ని రకాలుగా జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తారు. వివాహం అనేది చాలా జీవితాల్లో అనేక మార్పులకు కారణమవుతుంది.
2. కొత్త జీవితం కొందరికి ఉల్లాసంగా ఉంటే.. మరికొందరికి కొత్త కొత్తగా ఉంటుంది. వైవాహిక జీవితంలో భాగస్వామిని అర్థం చేసుకుంటూ సర్దుకుపోయే లక్షణం ఉన్న వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జీవించ గలరు.
3. పెళ్లయిన కొత్తలో ప్రతి జంటా కోటి ఆశలతో జీవితాన్ని ప్రారంభిస్తారు. ఎన్నో మార్పులు సంతరించుకుంటాయి. వీటిలో కొన్ని ఆనందాన్నిస్తే, మరికొన్ని ఇబ్బందులు తలెత్తేలా చేస్తాయి.
4. ముఖ్యంగా అప్పటి దాకా మనకు ఇష్టమైనట్లు జీవించే అవకాశం నుంచి భాగస్వామి కోసం కొన్నింటిని మార్చుకొనే స్థాయి వెళ్తాం. ప్రాధాన్యాలు మార్చుకోవాల్సి వస్తుంది.
5. కుటుంబం, స్నేహితులు, పనిచేసే చోట ప్రాధాన్యత ఇలాంటివి ప్రభావితం అవుతాయి. జీవిత భాగస్వామికి ఇందులో ప్రాముఖ్యం ఉంటుంది.
6. కొత్త జంటల్లో ముఖ్యంగా అబ్బాయిలు కాస్త స్వేచ్ఛగా ఉండగలిగినా అమ్మాయిలు ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంటుంది. మార్పులకు అనుగుణంగా నడుచుకోవాల్సి వస్తుంది.
7. పుట్టింటిని వదిలి మెట్టినింట్లో అడుగు పెట్టిన మగువ.. భర్త ఇష్టాల ప్రకారం మసలుకోవాల్సి వస్తుంది. ఇది యువతులకు కాస్త ఇబ్బందికర పరిణామమే. ఇలాంటి సందర్భాల్లో ఆందోళనలు, భయానికి తావివ్వకూడదు.
8. ఎవరితోనూ చర్చించని, మీ పర్సనల్ విషయాలు కూడా పెళ్లయ్యాక మీ భాగస్వామికి చెప్పే సందర్భాలు వస్తాయి. అలాంటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం.
9. మీ బంధం దెబ్బ తినకుండా ఉండేలా చూసుకోవాలి. మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులను గౌరవించాలి. దాదాపు అన్ని జంటల్లోనూ అత్త మామలు, వారి కుటుంబ సభ్యుల విషయాల్లో తలదూర్చినప్పుడే ఎక్కువ సమస్యలు వస్తుంటాయి.
10. వీటిని అవాయిడ్ చేస్తే బెటర్. మీ జీవిత భాగస్వామిలో ఏదైనా అలవాటు నచ్చకపోతే కొంచి సుతిమెత్తగా చెప్పాలి. హార్స్ గా బిహేవ్ చేయరాదు. ఇలా చేస్తే పెళ్లయిన కొత్తలో ఇబ్బందులను అధిగమించవచ్చు.
Read Also : Astrology tips : అతి ప్రేమ చూపిస్తున్నారా? ఈ రాశుల వారికి జరిగేది ఇదే..