దాంపత్య జీవితంలో ప్రేమ, ఆప్యాయత అత్యంత సహజం. అయితే, ప్రేమపూర్వకంగా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. ప్రేమించడానికి కూడా కొన్ని పరిమితులుంటాయి. అతి ప్రేమ అనర్థాలకు దారి తీస్తుంది. ప్రతి ఒక్క జంట తమ జీవితంలో అన్యోన్యంగా జీవించాలంటే ప్రేమ చూపించాల్సిందే.. కానీ అతి ప్రేమ వద్దు. జీవిత భాగస్వామితో బంధాన్ని పటిష్టంగా ఉంచుకోవాలంటే ప్రేమలో బ్యాల్సన్ ఉండాలంటారు నిపుణులు. ఈ విషయాలు వ్యక్తుల రాశులను (Astrology tips) బట్టి కూడా ఉంటాయట. ఏయే రాశుల (Astrology tips) వారు ఎలాంటి ప్రేమ కనబరుస్తారో జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు.
1. ముఖ్యంగా మేష రాశి వారు ఒక నిర్దిష్ట వ్యక్తిపై ప్రేమను కనబరుస్తున్నప్పటికీ మనోభావాలను వారి నుంచి దాచి పెడతారట.
2. జీవిత భాగస్వామి ముందు బాధ్యత ప్రదర్శిస్తున్నారని, బలంగా ఉన్నారని చెప్పడానికి ప్రయత్నిస్తారట. ఇలా కాకుండా బహిరంగంగా, నిజాయితీగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.
3. ఇక వృషభరాశి వారి విషయానికొస్తే వీరు భాగస్వామికి దూరంగా ఉంటారట. వీరికి వీరు అత్యంత విలువైన కనెక్షన్ లో గాజుగోడ నిర్మించుకున్నట్లు ఉంటారట. వీరు స్వీయ ప్రాముఖ్యతను పక్కనబెట్టి భాగస్వామితో మాట్లాడాలి.
4. మిథునం రాశి వారికి ప్రియమైన వారితో శృంగార విందు అందుతుందట. వాతావరణం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. భాగస్వామిని ఆకర్షించగలిగే శక్తి వీరికి ఉంటుంది.
5. కర్కాటక రాశి వారు సహనం పాటించాలి. సింహ రాశి వారి విషయానికొస్తే జీవిత భాగస్వామిని వెదుకుతున్నప్పుడు ఆచరణాత్మకంగా ఉండటం ముఖ్యం. ఆదర్శాల విషయంలో రాజీ తగదు.
6. కన్య రాశి వారు జీవిత భాగస్వామి మూడ్ హెచ్చుతగ్గులను అర్థం చేసుకుంటూ ఉండాలి. త్వరలోనే చికాకులను అధిగమిస్తారు.
7. తులా రాశి వారు ప్రేమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి తమవంతు పని చేయాలి.
8. వృశ్చిక రాశి వారు పూర్వ అనుభవాల ఆధారంగా సంబంధాల్లో కొత్త విషయాలను ప్రయత్నించాలని అనిపించవచ్చు. కొత్తగా వీరి జీవితంలోకి వచ్చిన వారు.. గతంలో జరిగిన తప్పులను ప్రతిబింబించేలా ప్రోత్సహించే ఛాన్స్ ఉంది.
9. ధనుస్సు రాశి వారు సంతోషకర బంధం కోసం భాగస్వామితో సామరస్యంగా వ్యవహరించాలి.
10. మకరం వారికి ప్రస్తుత రిలేషన్ పై కచ్చితమైన స్టేటస్ తెలియకపోవచ్చు. సహనంతో ముందుకు సాగాలి.
11. కుంభ రాశి వారు ఇప్పటికే సంతృప్తిగా ఉంటారు. చివరగా మీన రాశి వారు ఇష్టపడే వ్యక్తికి త్వరగా ప్రేమను తెలియజేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
మొదటి సారి డేట్ వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి..
1. గర్ల్ ఫ్రెండ్ తో డేట్ కి వెళ్లడం యువకులకు చాలా ఉత్సాహం ఇచ్చే అంశం. పరుగు పరుగున తయారై వెళ్తారు. ఇంట్లో అమ్మ చెప్పే పనులు చేయమంటే బద్ధకిస్తారు కానీ.. గర్ల్ ఫ్రెండ్ డేట్ కి పిలిస్తే మాత్రం ఎగేసుకొని వెళ్లిపోయే అబ్బాయిలు అనేక మంది ఉంటారు. అయితే, క్రష్ తో డేట్ కి వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇది చదివి తెలుసుకోండి..
2. మొదటిసారి డేట్ కి వెళ్లాలంటే కాస్త టెన్షన్ ఎవరికైనా ఉంటుంది. అలవాటులో పొరపాట్లు జరిగే చాన్స్ ఉంటుంది. ఏ ప్రశ్నలు అడిగితే ఎలాంటి రియాక్షన్ వస్తుందో తెలియక సతమతమవుతుంటారు. ఒక వేళ పొరపాటున అడగకూడని ప్రశ్నలు అడిగితే దాని ఫలితాలు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితిలో తికమక పడుతుంటారు. అలాంటి ప్రశ్నలేంటో తెలుసుకోండి..
3. తొలిసారి డేట్ కి వెళ్తుంటే నెర్వస్, భయం వీడాలి. ముందు రోజు రాత్రి నిద్ర పట్టకున్నా ప్రయత్నించాలి. ఏ డ్రెస్ వేసుకోవాలి, బహుమతి ఏం కొనాలో ముందే డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ డేట్ లో ఇంప్రెషన్ వస్తే బంధం ఎక్కువ కాలం కొనసాగుతుంది.
4. ముఖ్యంగా అమ్మాయిల మేకప్ గురించి అసలు అడగకూడదు. ఎందుకు మీరు సింగిల్ గా ఉన్నారు.. ఇలాంటి ప్రశ్నలు వేయవద్దు. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు వారికి చికాకు కలిగిస్తాయి. మూడ్ చెడగొట్టిన వారవుతారు. ఆర్ యూ వర్జిన్ లాంటి ప్రశ్నలు అసలే వద్దు.
5. వర్జినిటీ లాంటి ప్రశ్నలు చాలా సీరియస్ అయ్యే చాన్స్ ఉంది. ఇలాంటివి బాధ కలిగించే అంశాలు. అవాయిడ్ చేయడం బెటర్. నాకంటే ముందు ఎంత మందితో డేట్ చేశావనే ప్రశ్నలు కూడా అడగకండి. అప్ సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. కెరీర్ గురించి, వ్యక్తిగతం గురించి ప్రశ్నలు మంచిది కాదు. అలాగే ఉద్యోగం, శాలరీ ఇలాంటి ప్రశ్నలూ ప్రమాదకరమే.
Read Also : Vastu Tips: గృహంలో వాస్తు దోషాలున్నాయా? డబ్బుకు ఇబ్బందులా.. ఇలా చేస్తే దశ తిరిగిపోతుంది!