HomeUncategorizedAscaris lumbricoides: పిల్లలు బరువు పెరగడం లేదా? నీరసంగా ఉన్నారా? నులిపురుగుల నివారణ ఇలా..

Ascaris lumbricoides: పిల్లలు బరువు పెరగడం లేదా? నీరసంగా ఉన్నారా? నులిపురుగుల నివారణ ఇలా..

Ascaris lumbricoides: చిన్నారుల పెంపకం అనేది ముఖ్యమైన టాస్క్‌. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుంది. కొందరు చిన్నారుల్లో సరిగా తినకపోవడం, బరువు పెరగకపోవడం, ఎదుగుదల లోపించడం, ఎప్పుడూ నీరసంగా ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో పిల్లల పొట్టలో నులిపురుగులు ఉంటాయని అనుమానించాలి.

పిల్లల పెరుగుదలకు నులిపురుగులు శాపంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. వాటిని నివారించాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది పిల్లల్లో ఎక్కువగా కనిపించే సమస్య బరువు పెరగకపోవడం, నీరసంగా కనిపించడం. మూడు పూటలా తింటున్నప్పటికీ తమ పిల్లలు బరుకు పెరగకపోవడం.. చాలా మంది తల్లిదండ్రులను కలవరపెడుతుంటుంది. లోపం ఏమిటని ఆందోళన చెందుతుంటారు. పౌష్టికాహారం.. బలవర్ధకమైన ఆహారం సమయానికి వారికి అందిస్తున్నప్పటికీ పిల్లలు రోజురోజుకు నీరసించిపోతుంటే కన్నవారి ఆవేదన తీవ్రంగా ఉంటుంది. తమ పిల్లలకు ఎందుకిలా జరుగుతుందని డాక్టర్ల వద్దకు పరుగు పెడుతుంటారు.

చిన్నారులను పరీక్షించిన డాక్టర్లు చెప్పే కారణాలు విని ఆశ్చర్యపోతుంటారు. పిల్లలు బరువు పెరగకపోవడానికి, నీరసంగా ఉండటానికి కారణం వారి పొట్టలో ఉండే నులి పురుగులన్న విషయం చాలా మందికి తెలియదు. పిల్లలు తీసుకునే ఆహారంలో ఎక్కువ భాగం నులిపురుగులు తినేస్తుంటారు. దీని వల్ల పెరుగుదల లోపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

ఎదుగుతున్న పిల్లలు ముఖ్యంగా ఖాళీ ప్రదేశాల్లో మట్టిలో ఆడుకునే సమయంలో ఎక్కువగా నులి పురుగుల సమస్య వేధిస్తుంటుంది. మట్టిలో ఆడటం వల్ల కాళ్లు చేతులకు మట్టి అంటుతుంది. దీంతో వారి శరీరం, దుస్తులే కాదు.. కడుపు కూడా ఇబ్బందిపడుతుంది. మట్టిలో ఉండే నులిపురుగుల గుడ్లు పిల్లల గోళ్ల ద్వారా నోట్లోకి చేరుతాయి.

అక్కడి నుంచి కడుపులోకి వెళ్లి అక్కడే తమ ఆవాసాన్ని తయారు చేసుకుంటాయి. ఇలా మట్టి ద్వారానే కాదు కలుషిత ఆహారం, నీటి ద్వారా కూడా నులి పురుగులు కడుపులోకి చేరతాయి. పిల్లల కడుపులో నులిపురుగులు ఉన్నప్పుడు తిన్నది ఏదీ అరగదు. నులిపురుగులే సర్వం తినేస్తుంటాయి. పిల్లలు నీరసంగా అయిపోతుంటారు. రోజు రోజుకి బక్కచిక్కిపోతారు. రాత్రులు నిద్రలేమి సమస్య వేధిస్తుంది.

మలద్వారం వద్ద దురద పెడుతుంది. రక్తహీనత సమస్య వేధిస్తుంది. నులిపురుగుల సమస్యతో పిల్లలు ఎన్నో రకాలుగా బాధపడుతూ ఇమ్యూనిటిని కూడా కోల్పోతారు. దీనివల్ల చదువులపై ప్రభావం పడుతుంది. నులిపురుగులను వామ్ ఇన్ఫెక్షన్స్ అని పిలుస్తారు. హెల్మిన్స్ అనే క్రిములు ద్వారా నులిపురుగులు వ్యాప్తి చెందుతాయి.

నులిపురుగులతో ఎలాంటి సమస్యలు వస్తాయంటే..
పొట్టలో నులిపురుగలతోపాటు బద్దె పురుగులు కూడా ఉంటాయి. వీటి వల్ల పిల్లలకు పొట్ట నొప్పి వస్తుంది. మలద్వారం వద్ద దురద ఏర్పడుతుంది. రక్త హీనతతో బలహీనంగా తయారవుతారు. త్వరగా శక్తిని కోల్పోతారు. ఆడుకోడానికి, చదువు కోడానికి నిరాసక్తత చూపుతారు. తక్కువ బరువు, తక్కువ ఎత్తు వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి.

పురుగులు ఎలాంటివి ఉంటాయంటే..
చిన్నారులు, పెద్దలు ఎవరైనా పొట్టలో నులిపురుగులు, ఏలిక పాములు, బద్దె పురుగులు వస్తుంటాయి. పెద్దల కన్నా, చిన్నారులకు ఇవి ప్రమాదకరంగా తయారవుతాయి. బానపొట్టతో ఉండే పిల్లలో ఏలిక పాములు అధికంగా ఉంటాయి. వీటివల్ల మలద్వారంలో దురద మినహా పెద్దగా సమస్యలు ఉండవు. కానీ ఏలిక పాములు ఒక్కో సారి పొట్ట నుంచి ఊపిరి తిత్తుల్లో చేరే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫిట్స్, ఉబ్బసం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

కొంకి పురుగులు ఉన్నప్పుడు రక్తహీనత ఏర్పడుతుంది. మట్టితినే అలవాటు ఉన్న పిల్లలు కొంకి పురుగుల బెడద ఉంటుంది. ఇక మాంసాహారాన్ని సరిగా ఉడికించకుండా తింటే పిల్లల పొట్టలో బద్దె పురుగులు చేరే అవకాశం ఉంటుంది. బద్దెపురుగులు పొట్టలో ఉన్నప్పుడు తలపోటు, మెదడులో కణుతులు ఏర్పడతాయి. పిల్లల పొట్టలో నులి పురుగులు ఉంటే పిల్లలతోపాటు పెద్దలు కూడా ఆల్బెండసోల్ మాత్రలు తీసుకోవాలి. టానిక్ కూడా డాక్టర్ల సూచన మేరకు తీసుకోవచ్చు.

జాగ్రత్తలు ఇవీ..
* నులిపురుగుల బెడద నుంచి ఉపశమనం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
* ప్రతి 6 నెలలకు ఒకసారి డీవార్మింగ్ ప్రక్రియ చేపడుతోంది.
* చిన్నారులు, పెద్దల్లో నులిపురుగుల నివారణకు ఇలాంటి చర్యలు చేపడుతున్నారు.
* గ్రామీణ ప్రాంతాల్లో, ఎక్కువగా మట్టిలో ఆడుకునే పిల్లలు, శుభ్రత లేని చోట పెరిగే చిన్నారుల్లో నులిపురుగుల సమస్య ఏర్పడుతుంటుంది.
* నులిపురుగులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది.
* మట్టిలో ఎక్కువ సమయం ఆడుకోకుండా చూసుకోవాలి. చెప్పులు లేకుండా బయటకు వెళ్లకుండా చూడాలి.
* కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కునేలా వారికి నేర్పించాలి. గోళ్లు పెద్దవిగా ఉండకుండా ఎప్పటికప్పుడు కత్తిరిస్తుండాలి.
* పురుగులు ఉంటే మందులు వాడటం వల్ల రెండు వారాల్లో సమస్యను అరికట్టవచ్చు.
* మలద్వారం వద్ద దురదగా ఉంటే వ్యాసిలెన్ కానీ, ఆముదం కానీ రాయాలి.

ఇవీ చదవండి: Marta: ఆ మహిళ వయసు 39.. పిల్లలు 19 మంది.. ప్రతి పిల్లాడికీ తండ్రులు వేర్వేరు వ్యక్తులే!
Sitting on Chair: రోజూ ఎక్కువ సమయం కుర్చీలోనే కూర్చుంటున్నారా? శారీరక ఆరోగ్య ప్రమాదాలు!
Daily Egg: రోజుకో గుడ్డు.. ఆరోగ్యానికి వెరీ గుడ్డు.. ఉడికించిన గుడ్డులో పోషకాలెన్నో తెలుసా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు