CM Jagan Rayalaseema tour: సీఎం జగన్‌ రాయలసీమ పర్యటన.. 19న లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ప్రారంభం

CM Jagan Rayalaseema tour: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమలో పర్యటించనున్నారు. ఈనెల 19న కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. (CM Jagan Rayalaseema tour)

రక్షిత మంచినీరు – సాగునీరు కలను నిజం చేసి, చెరువులను పునరుద్ధరించి, జలకళను తీసుకు రావాలన్న లక్ష్యంతో జగన్‌ సర్కారు పని చేస్తోంది. వర్షం పడితేనే పంటలు పండే రాయలసీమ ప్రాంతంలోని నేలలో కృష్ణా జలాలు పరుగులు పెట్టేలా.. కృష్ణమ్మ జల స్పర్శతో రాయలసీమ అన్నదాతల సాగు కష్టాలకు ఉపశమనం కలిగించేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 10,394 ఎకరాలకు సాగునీరు, డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజక వర్గాల్లోని ప్రజలకు తాగునీరు అందిస్తూ.. 77 చెరువులకు జలకళ చేకూర్చనున్నారు సీఎం జగన్.

కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్క సాగరంలో రూ.224.31 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని19న ప్రారంభించి అనంతరం నంద్యాల జిల్లా, డోన్ లో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించనున్నారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లలో కేవలం జీవో ఇచ్చి, టెంకాయ కొట్టి వదిలేస్తే… …ఈ ప్రభుత్వం ఏకంగా ప్రాజెక్ట్ పూర్తి చేసి నంద్యాల, కర్నూలు జిల్లాల ప్రజలకు అంకితం చేస్తోంది. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి మొదటి దశలో కర్నూలు జిల్లాలోని మెరక ప్రాంతాల్లో ఉన్న 77 చెరువులకు త్రాగు, సాగునీరు సరఫరా చేయనున్నారు.

లక్కసాగరం వద్ద ఎత్తిపోతల పథకంతోరైతులకు కలిగే ప్రయోజనాలు
• డోన్ నియోజకవర్గంలో 36 చెరువుల క్రింద 4,260 ఎకరాలు..
• పత్తికొండ నియోజకవర్గంలో 36 చెరువుల క్రింద 5,784 ఎకరాలు..
• ఆలూరు నియోజకవర్గంలో 3 చెరువులక్రింద 197 ఎకరాలు..
• పాణ్యం నియోజకవర్గంలోని 2 చెరువుల క్రింద 153 ఎకరాలు.. మొత్తం 77 చెరువుల క్రింద 10,394 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు…
• పై 4 నియోజక వర్గాలలోని ప్రజలకు త్రాగు నీరు.. భూగర్భ జలాలు పెరగడంతో పాటు రైతులకు పుష్కలంగా పంటలు పండే అవకాశం..
• వర్షాధారం మీద ఆధారపడిన కర్నూలు జిల్లా పశ్చిమ కరవు ప్రాంతంలోని రైతులకు చెరువులు నింపే కార్యక్రమం ఓ వరం..

గ్రావిటీ ద్వారా నీటి సరఫరా..
• హంద్రీ నీవా ప్రధాన కాలువపై కూర్మగిరి (అలంకొండ) వద్ద పంప్ హౌస్ నిర్మాణం..
• 3X3,800 HP మోటార్ల ద్వారా 1.4 టి.ఎం.సి నీటిని 90 రోజులలో పంప్ చేసి 5.6 కి. మీ. ప్రెషర్ మెయిన్ ద్వారా కొండపై ఉన్న డెలివరి ఛాంబర్ కు నీటి మళ్లింపు.. మూడు గ్రావిటీ పైప్ లైన్ల ద్వారా నీటి మళ్లింపు సరఫరా..
• గ్రావిటీ పైప్ లైన్-1 ద్వారా 22 చెరువుల క్రింద 4,217 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు..
• గ్రావిటీ పైప్ లైన్-2 ద్వారా 16 చెరువుల క్రింద 3,018 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు..
• గ్రావిటీ పైప్ లైన్ – 3 ద్వారా ప్యాపిలీ బ్రాంచ్ ద్వారా 23 చెరువుల క్రింద 2,065 ఎకరాల ఆయకట్టుకు, జొన్నగిరి బ్రాంచ్ ద్వారా 7 చెరువుల క్రింద 830 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు..
• మొదట నిర్దేశించిన 68 చెరువులతో పాటు డోన్ నియోజకవర్గంలో 8. పత్తికొండ నియోజకవర్గంలో ఒకటి.. మొత్తం 9 చెరువులకు పైప్ లైన్ ద్వారా అదనంగా నీరు అందించే ఏర్పాటు..

ఇదీ చదవండి: Jagananna arogya suraksha: నేటి నుంచి ఇంటింటికీ జగనన్న ఆరోగ్య రక్ష క్యాంపెయిన్‌

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles