గురువారం, 17 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Trivikram: జులాయి మూవీలో బ్యాంక్ రాబరీ సీన్.. అక్కడి నుంచి ఎత్తుకొచ్చారా?

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 6 నవంబర్ 2024

Trivikram: అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం జులాయి. 2012లో వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ అందుకుంది. అల్లు అర్జున్ ఎమర్జింగ్ యాక్షన్ తో ఈ చిత్రం మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఈ మూవీలో ప్రతి సీన్ ఆసక్తికరంగా తీశాడు దర్శకుడు త్రివిక్రమ్. (Trivikram) టాలీవుడ్ లో తీసిన చిత్రాల్లో త్రివిక్రమ్ డైలాగులు ఆసక్తికరంగా ఉంటాయని చెబుతారు.

అందుకు తగ్గట్టే పూర్వ గాథలు, హాలీవుడ్ చిత్రాల నుంచి స్పూర్తి పొంది అక్కడి డైలాగులు, పురాణ కథల్లోని చారిత్రక ఘటనలను డైలాగుల్లో జొప్పిస్తాడు గురూజీ. ఎవరికీ అనుమానం రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడు దొరికిపోతూ ఉంటాడు. అందులో భాగంగానే త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన జులాయి, అతడు, అ ఆ.. తదితర చిత్రాలు కాపీ పేస్ట్ గా చెబుతూ, నెటిజన్లు, సినీ మేధావులు మక్కీకి మక్కీ దించేశాడంటూ ఆధారాలు చూపారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో రిలీజ్ అయిన జులాయి మూవీలో బ్యాంక్ రాబరీ సీన్.. హాలీవుడ్ మూవీలో లోంచి ఎత్తుకొచ్చి కాపీ పేస్ట్ కొట్టాడన్న విమర్శలు వస్తున్నాయి. ఆ మూవీ పేరు ది డార్క్ నైట్. (The Dark Knight) 2008లో రిలీజ్ అయిన ఈ చిత్రం సంచలన విజయం దక్కించుకుంది. ఈ చిత్రంలో బ్యాంక్ రాబరీ సీన్ మ్యాగ్జిమమ్ మన గురూజీ జులాయి మూవీలో దించేశాడు. ఇందుకు తగిన ఆధారాన్ని నెటిజన్లు బయట పెడుతున్నారు.

ద డార్క్ నైట్ 2008 చిత్రం ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టొఫర్ నొలన్ డైరెక్షన్ లో వచ్చింది. ఈ మూవీ డి.సి. కామిక్స్ లోని బాట్ మాన్ దారావాహికల ఆధారంగా రూపొందించారు. బాట్ మాన్ త్రయంలో ఇది రెండో సినిమా. మొదటి చిత్రం “బాట్ మాన్ బిగిన్ స్” మూడో సినిమా ” ద డార్క్ నైట్ రైసెస్’’.

ఈ మూవీలో బ్యాంక్ ను దోచుకున్న దొంగల తీరును తెలుగులో వచ్చిన జులాయి మూవీలో సోనూ సూద్ అండ్ టీమ్ చేస్తారు. యాజ్ ఇటీజ్ సన్నివేశాన్ని స్వల్ప మార్పులతో తెరకెక్కించారు మన దర్శకుడు త్రివిక్రమ్. ఆ సన్నివేశాన్ని ఇక్కడ చూసేయొచ్చు.

https://platform.twitter.com/widgets.js

ఇవీ చదండి: Allu Arjun: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్.. ఏమైందంటే..
Alia Bhatt: శారీరకంగా ఎంతో శ్రమపడ్డ ఆలియా భట్!
Meenakshi Chaudhary: నడుము అందాలతో కవ్విస్తున్న మీనాక్షి చౌదరి.. ఫొటోలు
Jacqueliene Fernandez: ఐల్యాండ్‌ను కొన్న హాట్ బ్యూటీ.. ఫొటో గ్యాలరీ
Rashi Singh: రాశి సింగ్‌ హాట్‌ ఫొటో గ్యాలరీ.. భూతద్దం భాస్కర్‌ నారాయణ బ్యూటీ కలర్‌ఫుల్‌ పిక్స్‌!!

ట్యాగ్స్: , , , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading