NTR: ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్‌లో ఫేమస్ అయిన జూనియర్ ఎన్టీఆర్.. (NTR) తాజాగా కొరటాల శివ (Koratala Siva) డైరెక్షన్‌లో మూవీ చేస్తున్నాడు. ఆ సినిమాకు దేవర (Devara) అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది దేవర సినిమా. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తీస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పూర్తి స్థాయి విలన్ రోల్ చేస్తున్నారు. జాన్వీకపూర్‌కు ఇదే పూర్తి స్థాయి తెలుగు మూవీ కావడం విశేషం.

ఆర్ఆర్ఆర్ అంతటి భారీ హిట్ మూవీ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దేవరపై అభిమానులు భారీ అంచనాలు వేస్తున్నారు. ఎన్టీఆర్ బ్రాండ్ ఇమేజ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ సైతం డిఫరెంట్‌గా మారిపోయింది. దీంతో పెద్ద పెద్ద కంపెనీలన్నీ తారక్‌తో తమ ఉత్పత్తులు ప్రమోట్ చేసుకొనేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఓ కమర్షియల్ యాడ్ కోసం షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇక్కడ తీసిన తారక్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్ హల్‌చల్ చేస్తున్నాయి. క్లాస్, మాస్ లుక్‌తో ఎన్టీఆర్ చితక్కొట్టేశాడని అభిమానులు సంబరపడిపోతున్నారు.

ఆ యాడ్‌కి సంబంధించిన ఫొటోలు విపరీతంగా షేర్ చేస్తున్నారు అభిమానుల. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లైట్ గడ్డంతో ఫంకీ హెయిర్ స్టైల్ తో వైట్ కలర్ షర్ట్ లో కూల్ అండ్ స్టైలిష్ లుక్ లో తారక్ ఈ ఫోటోలలో కనిపిస్తున్నాడు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్‌లో అభిమానులు ఈ ఫొటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇక సినిమాల్లో తారక్ కాస్త సీరియస్ లుక్స్‌లోనే కనిపిస్తుంటాడు. ఈ మధ్య కాలంలో అయితే అరవింద సమేత, ఆర్ఆర్ఆర్, ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీలోనూ ఎన్టీఆర్ కాస్త మాస్ లుక్, సీరియస్ యాక్షన్‌తోనే కనిపిస్తున్నారు.

ఈ మూవీల్లో పాత్రలు, లుక్స్ పరంగా అగ్రెసివ్ మోడ్ లో ఎన్టీఆర్ ఉన్నారు. అయితే, కమర్షియల్ యాడ్స్ కి వచ్చేసరికి స్టైలిష్ అవతార్ లోకి తారక్ మారిపోతున్నాడు. తారక్ లో మంచి ఫన్ టైమింగ్ ఉందని చాలా మంది సహచరులు చెబుతుంటారు. అలాంటి ఫన్ జెనరేట్ చేసే విధంగా మంచి ఇంటరెస్టింగ్ కథను స్టైలిష్ గెటప్‌లో జూనియర్ ఎన్టీఆర్ చేస్తే చూడాలని, ఈ లుక్స్ చూసిన తర్వాత అభిమానులు కోరుకుంటున్నారు. గతంలో అదుర్స్ మూవీలో ఏ రేంజ్‌లో కామెడీ పండించారో అందరికీ తెలిసిందే. ఆ తరహా ఫన్ జెనరేట్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక దేవర మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతోంది. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. సైఫ్ దేవర సినిమాలో నటించడం వల్ల బాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ అవుతుందని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. తాజాగా ఈ సినిమాలో మరో పాన్ ఇండియా స్టార్ ని ఎంపిక చేసినట్లుగా సమాచారం.

కన్నడ సూపర్ హిట్ చిత్రం ‘కేజీఎఫ్’ లో కీ రోల్ చేసిన తారక్ పొన్నప్ప కి పాన్ ఇండియా గుర్తింపు లభించింది. కేజీఎఫ్ లో ఇతడు పోషించిన పాత్ర చిన్నదే అయినా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దీంతో దేవర సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్, తారక్ పొన్నప్ప కాంబోలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మరో కీలక షెడ్యూల్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారట.
Read Also : Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఫొటో గ్యాలరీ..
