Aditya 369: నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఇటీవల మూవీలతో బిజీ అయ్యారు. అఖండ సినిమా హిట్ కొట్టాక జోరు పెంచిన బాలయ్య.. ఆ తర్వాత వరుసగా సినిమాలతో హంగామా చేస్తున్నారు. ఇప్పటికే గోపీచంద్ మలినేనితో సినిమా తీసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇంకో మూవీ కూడా అనిల్ రావిపూడితో తీయబోతున్నట్లు బాలయ్య మొన్నామధ్య ప్రకటించారు. అయితే, ఈ ప్రాజెక్టులు అలా ఉండగానే మరో ప్రాజెక్టును (Aditya 369) బాలయ్య ప్రకటించారు.
సాధారణంగా బాలయ్య కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తుంటారు. సినిమా రిజల్ట్ సంగతి పక్కనబెట్టి బాలయ్య ఎప్పుడూ ప్రయోగాలకే ప్రాధాన్యం ఇస్తుంటారు. గతంలో ఆదిత్య 369, (Aditya 369) భైరవ ద్వీపం లాంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. వీటిలో ఓ అద్భుత చిత్రం ఆదిత్య 369. ప్రముఖ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఈ మూవీ భారతీయ చిత్రసీమలో అప్పట్లో ఓ సంచలనమే సృష్టించింది.
ఆదిత్య 369 మూవీకి ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ ను కూడా ఖాయం చేసినట్లు స్వయంగా బాలయ్య వెల్లడించడం విశేషం. ఆహాలో స్ట్రీమింగ్ అయిన అన్ స్టాపబుల్ షోలో బాలయ్యహోస్ట్ గా వ్యవహరించారు. ఆ షోలో బాలకృష్ణ ఈ విషయాన్ని తెలిపారు. ఈ నేపథ్యంలో అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. సినిమా ఎలా ఉంటుందో అంటూ ఇప్పటి నుంచే హైప్ క్రియేట్ అవుతోంది.
ఎప్పటి నుంచో సీక్వెల్ ఆలోచన చేస్తున్నారు బాలయ్య. అనేక కథనాలు కూడా వెలువడ్డాయి. దాంతో పాటు ఈ మూవీకి స్వయంగా బాలకృష్ణ డైరెక్షన్ చేస్తున్నారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. దీనిపై తాజాగా వచ్చిన ఓ క్లారిటీ.. మూవీ కన్ఫంగా రాబోతోందనే సంకేతాలు ఇచ్చింది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ మొన్నటి దాకా తన సెలబ్రిటీ టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ NBK రెండో సీజన్‌ను హోస్ట్ చేయడంలో బిజీగా గడిపారు. వినోదభరితమైన ప్రదర్శనతో వీక్షకులను అలరించడంతో పాటు, 62 ఏళ్ల బాలయ్య.. తన తదుపరి ఆదిత్య 369 సీక్వెల్‌కు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి విడుదలైన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతి హాసన్, వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్, దునియా విజయ్‌లు నటించిన వీర సింహారెడ్డి మంచి టాక్ తెచ్చుకుంది. అయితే, హింస ఎక్కువగా ఉందనే మాట వినిపించింది. ఇక ఆదిత్య 369 మూవీ సీక్వెల్‌పై ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది.
ఆదిత్య 369 సీక్వెల్‌లో నందమూరి తనయుడు మోక్షజ్ఞ తేజ నటిస్తున్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ విషయాన్ని నందమూరి బాలకృష్ణ ధృవీకరించలేదు, అలా అని ఖండించలేదు. ఆదిత్య 999 మ్యాక్స్‌కి సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆదిత్య 369 విడుదలై దాదాపు 31 సంవత్సరాలు అయ్యింది. ఈ నేపథ్యంలోనే అన్‌స్టాపబుల్ విత్ NBK సౌజన్యంతో ఆదిత్య 369 సీక్వెల్ గురించి ఊహాగానాలు మరోసారి టాలీవుడ్ సర్కిళ్లలో హల్ చల్ చేస్తున్నాయి. 1991లో విడుదలైన ఈ చిత్రానికి సీక్వెల్‌ను త్వరలో ప్రకటిస్తామని బాలయ్య పేర్కొనడంతో అభిమానుల్లో కొత్త జోష్ వచ్చింది. ఈ చిత్రానికి ఆదిత్య 999, మ్యాక్స్ అనే టైటిల్ కూడా ఆలోచిస్తున్నారట.
Read Also : Nandamuri Balakrishna: ఇలాంటి మూవీస్‌ను బాలకృష్ణ వదులుకున్నాడా? ఆల్ టైమ్ హిట్లు!