నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టాలీవుడ్‌లో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టిన బాలయ్య.. (Nandamuri Balakrishna) ఎన్నో మరపురాని విజయాలను అందిచాడు. మరికొన్ని డిజాస్టర్లూ వచ్చాయి. అయితే, సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో చేయాలనుకున్న చిత్రాన్ని అప్పుడప్పుడూ మరో హీరో చేస్తుంటారు. కథ నచ్చక కావొచ్చు, డేట్స్ ఖాళీ లేకపోవడం.. తదితర కారణాలతో మరో హీరోకు చాన్స్ దక్కుతుంటుంది.
ఒక సినిమా కథను ఇద్దరు హీరోలకు చెప్పడం లాంటి పనులు కొంత మంది దర్శకులు చేస్తుంటారు. దాంతో పాటు కచ్చితంగా హిట్ కొడుతుందనుకున్న కథను అనేక మంది హీరోలకు చెబుతుంటారు దర్శకులు. వారిలో ఎవరు ఓకే చేస్తే వారిని విజయం వరిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో తాము వదులుకున్నచిత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టిన సందర్భాల్లో సదరు హీరోలు సాధారణంగానే బాగా ఫీల్ అయిపోతుంటారు. బాలకృష్ణ కూడా ఇలా హిట్ అయిన చిత్రాలు, డిజాస్టర్లుగా నిలిచినవి కొన్ని తన కెరీర్‌లో వదులుకున్నాడట.
ఈ సమయంలో అలాంటి మూవీస్ ఒక్కోసారి బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంటాయి. మరోసారి అతిపెద్ద డిజాస్టర్లుగానూ మిగులుతుంటాయి. ఇలా తాను వదులుకున్న చిత్రాలు హిట్ అయితే ఫీలవడం, ఫట్ అయితే ఆనందించడం చేస్తుంటారు సదరు హీరోలు. నందమూరి బాలకృష్ణ కూడా ఇలా అనేక రకాల చిత్రాలను వదులుకున్నాడట. వాటిలో కొన్ని ఆల్ టైమ్ హిట్లు కూడా ఉన్నాయి.
మరోవైపు హరికృష్ణ, జగపతిబాబు, శివాజీ నటించిన శివరామరాజు మూవీలో హరికృష్ణ పాత్రను బాలయ్య చేయాల్సి ఉండేదట. రీమేక్ చేయడం ఇష్టం లేక బాలయ్య అంగీకరించలేదట. బాలయ్య రిజెక్ట్ చేసిన లిస్టులో ఇంకా పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం, హీరో వెంకటేష్ నటించిన బాడీగార్డ్ మూవీ, మెగాస్టార్ చిరంజీవి చేసిన సైరా నరసింహారెడ్డి, రవితేజ నటించిన క్రాక్ మూవీ, జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి మూవీలు ఉన్నాయట.
బాలకృష్ణ వదులుకున్న చిత్రాల్లో జానకి రాముడు ఒటి. కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో బాలయ్య చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో.. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున చేసి సూపర్ హిట్ కొట్టారు. వెంకటేష్ నటించి హిట్ కొట్టిన చంటి మూవీని కూడా తొలుత బాలయ్య వద్దకే వచ్చిందట. ఆయన రిజెక్ట్ చేశారు. హీరో రాజశేఖర్ నటించిన సింహరాశి మూవీ కూడా బాలయ్య రిజెక్ట్ చేసిన లిస్టులో ఉందని తెలుస్తోంది.
Krithi Setty: కృతి శెట్టి ఈ తప్పు చేస్తూ ఇండస్ట్రీకి దూరమవుతోందా? ఎందుకంటే..
చైల్డ్ ఆర్టిస్టుగా నటించి తర్వాత హీరోయిన్‌గా మారిన సొట్టబుగ్గల సొగసరి కృతి శెట్టి.. ఉప్పెన మూవీతో కుర్రకారు మనసు దోచుకుంది. తన అందమైన చిరునవ్వుతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. వరుస మూవీల్లో చాన్సులు కొట్టేసి దూసుకుపోతోంది. సినిమాలతో పాటు పలు పాపులర్ బ్రాండ్ల ప్రకటనలు చేస్తూ రాణిస్తోంది. ఉప్పెన మూవీ సమయంలోనే బాగా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
వరుస ప్లాప్ సినిమాలతో కృతి ఇండస్ట్రీకి దూరమవుతోందనే వాదన కూడా వస్తోంది. ఎందుకంటే ఇండస్ట్రీలో హిట్లు వచ్చినంత కాలమే ఆఫర్లు వెంట వెంటనే వస్తుంటాయి. ఒక్కసారి డిజాస్టర్లు మొదలైతే ఇక అవకాశాలు తగ్గుముఖం పడతాయి. కృతి శెట్టి నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. అనే మూవీ ప్లాప్ అయ్యింది.
ఉప్పెన మూవీ హిట్ కావడంతో కృతికి వరుస సినిమా ఆఫర్లు తగిలాయి. పలు ప్రాజెక్టులకు ఓకే చేసింది. వరుస సినిమాలతో బిజీగా మారింది. అయితే, ప్రస్తుతం కృతి పరిస్థితి డౌన్ ఫాల్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే కథల ఎంపికలో జాగ్రత్తపడకపోవడమే కారణమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటి మూవీ హిట్ కొట్టాక కాస్త జాగ్రత్తగా కథను ఎంపిక చేసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఆ తర్వాత నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం మూవీ కూడా భారీ డిజిస్టర్‌గా నిలిచింది. మరోవైపు రామ్ పోతినేని సరసన నటించిన ది వారియర్ సినిమాదీ అదే పరిస్థితి. ఇలా వరుస ప్లాపులతో కృతి సమతమతం అవుతోంది. ఇకనైనా కథల ఎంపికలో జాగ్రత్త వహించకపోతే కెరీర్ గాడితప్పే ప్రమాదం ఉందని సినీ పండితులు హెచ్చరిస్తున్నారు.
కథల ఎంపికలో చేస్తున్న పొరపాట్ల వల్లనే ప్లాపులు మూటగట్టుకుంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేకపోతే ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోయిన్టు వచ్చి తెరమరుగైన చందంగా.. కృతి శెట్టి పరిస్థితి కూడా తయారవుతుందని చెబుతున్నారు.
Read Also : TRP Rating: టీఆర్పీ రేటింగ్‌లో దుమ్మురేపిన సినిమాలు ఇవే..