Tirumala News 31-07-2023: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. ప్రస్తుతం తిరుమల కొండపై భక్తులు భారీగా తగ్గిపోయారు. భక్తులు కేవలం ఒక కంపార్ట్‌మెంట్‌లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారీ హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లు వచ్చింది. నిన్న శ్రీవారిని 85,258 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 25,451 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. (Tirumala News 31-07-2023)
స్వర్ణముఖి నదిలో మునిగి విద్యార్థి మృతి
తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. స్వర్ణముఖి నదిలో మునిగి విద్యార్థి మృతి చెందాడు. చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లె వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతుడు కార్తీక్ కర్నూలుకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. సెలవురోజు సరదాగా ఈత కొట్టేందుకు స్నేహితులతో వచ్చిన కార్తీక్.. అనుకోకుండా మృత్యు ఒడికి చేరాడు.
మృతదేహాన్ని చంద్రగిరి పోలీసులు తరలించారు. ఇసుక కోసం తీసిన గోతిలోపడి చనిపోయాడంటూ ప్రతిపక్షం ఆరోపిస్తోంది. స్వర్ణముఖి నుంచి ఇసుక అక్రమంగా రవాణా అరికట్టారంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇసుక రీచ్ వద్ద నిరంతరం చంద్రగిరి పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.