Tirumala News 07-08-2023: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 83,856 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. రోజువారీ భక్తుల సంఖ్య 80 వేలకు పైగా చేరుకోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు క్యూలైన్లలో భక్తులకు అన్నప్రసాదాలు, పాలు పంపిణీ చేస్తున్నారు. అలాగే కంపార్ట్‌మెంట్లలో ఎప్పటికప్పుడు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తోంది టీటీడీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.09 కోట్లు చేకూరింది. (Tirumala News 07-08-2023)
Read Also : TTD Chairman Bhumana: టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రధాన ఎజెండాగా 80 అంశాలు చేర్చినట్లు తెలుస్తోంది.- రెండుసార్లు జరగబోయే బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై చర్చ జరగనుంది. ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నుంచి నూతన చైర్మన్‌గా నియమితులైన భూమన కరుణాకర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
Read Also : Gold rates today 07-08-2023: స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధర.. ఇవాళ్టి రేట్లు ఎలా ఉన్నాయంటే..
Follow us on : https://www.facebook.com/keerthanaanews