Tirumala News 06-08-2023: శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. పెరిగిన భక్తుల రద్దీ

Tirumala News 06-08-2023: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 23 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 81,472 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారీ హుండీ ఆదాయం రూ. 3.90 కోట్లు చేకూరిందని టీటీడీ వెల్లడించింది. (Tirumala News 06-08-2023)

రేపు టీటీడీ పాలకమండలి సమావేశం

రేపు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం జరగనుంది. ఎల్లుండితో టీటీడీ పాలకమండలి గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. త్వరలోనే నూతన పాలక మండలి సభ్యుల నియామకం ఉంటుందని తెలుస్తోంది.

Read Also : TTD Chairman Bhumana: టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles