Tirumala News 04-08-2023: కలియుగ వైకుంఠం శ్రీవారి చెంత భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవేంకటేశ్వరుని దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. భక్తులతో తిరుమల నిత్యకళ్యాణం పచ్చతోరణంలా కనిపిస్తోంది. ఇక కొండపై భక్తుల సంఖ్య పెరిగింది. 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 59,898 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 26,936 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.44 కోట్లు చేకూరిందని టీటీడీ వెల్లడించింది. (Tirumala News 04-08-2023)
Read Also : Buggana on AP Appulu: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి ఏ ఢోకా లేదు.. అప్పులపై వాస్తవాలు ఇవీ!: బుగ్గన