Women Missing cases: ఏపీ, తెలంగాణలో బాలికలు, మహిళల అదృశ్యం పై కేంద్రం ప్రకటన చేసింది. రాజ్యసభలో కేంద్ర హోంశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఏటా వేలాది బాలికలు, మహిళలు అదృశ్యం అవుతున్నారని హోంశాఖ తెలిపింది. 18 ఏళ్లలోపు బాలికలు, మహిళల అదృశ్యంపై నమోదైన కేసుల వివరాలు వెల్లడించింది. 2019-21 వరకు ఏపీలో 7,928 మంది బాలికలు అదృశ్యం అయ్యారని కేంద్రం వెల్లడించింది. (Women Missing cases)
2019-21 వరకు ఏపీలో 22,278 మంది మహిళలు అదృశ్యం అయ్యారని పేర్కొంది. బాలికలు, మహిళల అదృశ్యం కేసులు ఏటా పెరుగుతున్నాయని చెప్పింది. దేశంలో 2019-21 మధ్య 13 లక్షల మంది అదృశ్యం అయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. మూడేళ్లలో 25,255 మంది బాలికలు, 10.61 లక్షల మంది మహిళలు అదృశ్యం అయ్యారని కేంద్ర హోం శాఖ తెలిపింది. రాజ్యసభ ఎంపీల ప్రశ్నలకు హోంశాఖ సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది. హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Read Also : Ambati on pawan: వారాహి ఎక్కి పవన్ అసత్యాలు మాట్లాడుతున్నారు: మంత్రి అంబటి
బాలికలు, మహిళల అదృశ్యంపై పవన్ కల్యాణ్ ట్వీట్
రాజ్యసభకు కేంద్ర హోంశాఖ ఇచ్చిన సమాచారంపై జనసేనాని పవన్ స్పందించారు. హోంశాఖ సమాచారానికి ఏపీ మహిళా కమిషన్ ఎలా స్పందిస్తుంది? అని ప్రశ్నించారు. ఏపీలో తప్పిపోయిన బాలికల సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్ర సమాచారం ఉందన్నారు. రాష్ట్రంలో బాలికలు, మహిళలు ఎందుకు తప్పిపోయారు? అని నిలదీశారు. తప్పిపోయిన వారికి ఏమి జరుగుతోంది? ఎవరిది బాధ్యత? అన్నారు. హోంశాఖ, డీజీపీని ఏపీ మహిళా కమిషన్ వివరణ కోరుతుందా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఏపీ మహిళా కమిషన్ ప్రశ్నిస్తుందా? బాలికల అదృశ్యంపై హోంమంత్రి, డీజీపీ స్పందించాలంటూ పవన్ పేర్కొన్నారు.
Read Also : Perni Nani fire on Pawan: ఇదేమైనా అఖండ సినిమానా? పవన్‌పై పేర్ని నాని సెటైర్లు!