IB Syllabus: మన బడుల్లో స్పానిష్, జర్మన్ భాషలు నేర్పే దిశగా అడుగులు

IB Syllabus: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ ప్రవేశ పెట్టేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఐబీ ఇండియా విభాగం ఇంఛార్జ్ బాలకృష్ణ, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ ఎమీ పార్కర్, గ్లోబల్ డైరెక్టర్ బిజినెస్ డెవలప్ మెంట్ బన్నయాన్ లతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు భేటీ అయ్యారు. 10,12 తరగతుల విద్యార్థులకు ఐబీ-ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి సర్టిఫికెట్ల జారీ ప్రక్రియపై చర్చించారు. (IB Syllabus)

సిలబస్ లో మార్పులతో పేద విద్యార్థుల కోసం ఇతర వినూత్న కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రత్యేకంగా రూపొందించిన ‘డిజిటల్ టీచర్’ సహాయంతో ప్రభుత్వ బడుల్లో జర్మన్, స్పానిష్ భాషలు నేర్పించే విషయమై స్పానిష్, జెర్మనీ ఎంబసీ ఉన్నతాధికారులు ఎలీనా పెరేజ్, మేనిక్ యూజినా, మతియాస్ స్థాలే లతో చర్చించారు. మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా నిర్మించిన డిజిటల్ తరగతి గదులు, విద్యా కానుక ద్వారా అందించిన ట్యాబులు డిజిటల్ విధానంలో అంతర్జాతీయ భాషలు నేర్పించడానికి తోడ్పతాయి.

హాట్ మెయిల్ వ్యవస్థాపకుడితో ప్రవీణ్ ప్రకాశ్

విద్యార్థి దశ నుంచే వ్యాపార అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమం విషయమై ప్రముఖ పారిశ్రామిక వేత్త, హాట్ మెయిల్ వ్యవస్థాపకుడు సబీర్ భాటియాతో పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాశ్ చర్చలు జరిపారు. సబీర్ భాటియా రూపొందించిన ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ప్రోగ్రామ్ ను 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు కావాల్సిన ఆలోచనా విధానం, నైపుణ్యాలు అలవడుతాయన్నారు.

ఇవీ చదవండి: IB Syllabus in AP Schools: 45 వేల పాఠశాలల్లో ఐబీ కరిక్యూలమ్.. ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ బడుల బలోపేతం

AP Students in UN: ఎంత ట్రోల్‌ చేస్తే అంత పైస్థాయికి.. ఐక్యరాజ్య సమితి వేదికపై ఏపీ గవర్నమెంట్‌ స్కూల్‌ విద్యార్థులు

Jagananna Videshi Vidya deevena: పేద విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యాదీవెన.. నేడు నిధులు జమ చేయనున్న ముఖ్యమంత్రి

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles