గురువారం, 17 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh, Weather

AP Rain Alert : రానున్న రెండు రోజులు రాయలసీమలో భారీ వర్షాలు

Keerthanaa News Deskప్రచురణ తేదీ: గురువారం, 18 సెప్టెంబర్ 2025

AP Rain Alert : ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా వాతావరణ హెచ్చరిక విడుదల చేసింది. పశ్చిమమధ్య మరియు ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం నుండి తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

రాయలసీమలో భారీ వర్షాలు
రానున్న రెండు రోజులు రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు పడే సమయంలో చెట్ల క్రింద లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడకూడదని ప్రజలకు సూచించారు.

సెప్టెంబర్ 18న వర్షాల ప్రభావం
భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలు:
కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి.

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలు:
రాష్ట్రంలోని మిగతా జిల్లాలు.

వర్షపాతం రికార్డు
బుధవారం (సెప్టెంబర్ 17) సాయంత్రం 5 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి:
ప్రకాశం జిల్లా ఒంగోలు – 64.5 మిమీ
కె. ఉప్పలపాడు – 53.5 మిమీ
వేములపాడు – 47 మిమీ
చిలకపాడు – 45 మిమీ
విజయనగరం జిల్లా రాజాం – 40.2 మిమీ
కాకినాడ – 39 మిమీ

విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు
పిడుగులు పడే సమయంలో చెట్ల క్రింద, పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదు.
అవసరం లేనప్పుడు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండటం మంచిది.
రైతులు తమ పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలి.
విద్యుత్ తీగల దగ్గర నుంచి దూరంగా ఉండాలి.

రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను ఖచ్చితంగా పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ మళ్లీ గుర్తు చేసింది.

ఇవీ చదవండి: Money Astrology: పునర్వసు నక్షత్రంలో గురు సంచారం.. ఈ రాశుల వారికి లాభాల వర్షం!
Andhra Pradesh : వర్షం పడేటప్పుడు చెట్లకింద నిలబడరాదు.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు

ట్యాగ్స్: , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading