HomeAstrologyMoney Astrology: పునర్వసు నక్షత్రంలో గురు సంచారం.. ఈ రాశుల వారికి లాభాల వర్షం!

Money Astrology: పునర్వసు నక్షత్రంలో గురు సంచారం.. ఈ రాశుల వారికి లాభాల వర్షం!

Money Astrology: ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్న గురుడు ఈ నెల సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 5 వరకు తన స్వంత నక్షత్రం అయిన పునర్వసులో ప్రవేశం చేయనున్నాడు. ఈ సమయంలో గురువు మరింత శక్తివంతంగా ఉండి కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, వృత్తి పరంగా, వ్యక్తిగతంగా అద్భుత ఫలితాలు ఇవ్వనున్నాడు. ముఖ్యంగా మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులు ఈ సంచారంతో బలమైన లాభాలు పొందుతాయి.

మేషం (Aries)
గురువు తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఆదాయం అనేక మార్గాల్లో పెరుగుతుంది. ఉద్యోగం, వివాహం, శుభకార్యాల యోగం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో బిజీగా ఉంటారు.

వృషభం (Taurus)
ధన స్థానంలో గురువు బలపడడం వల్ల ధన లాభాలు విపరీతంగా పెరుగుతాయి. పెట్టుబడులు, షేర్లు లాభిస్తాయి. కొత్త పరిచయాలు ఆర్థికంగా అనుకూలంగా మారతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

సింహం (Leo)
పంచమాధిపతి గురువు లాభ స్థానంలో ఉండడం వల్ల రావలసిన సొమ్ము అందుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు, జీతం పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు తొలగి కొత్త అవకాశాలు వస్తాయి.

తుల (Libra)
భాగ్య స్థానంలో గురు సంచారం కావడంతో విదేశీ అవకాశాలు వస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు లభిస్తాయి. గృహ, వాహన సౌకర్యాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. వ్యాపారాల్లో లాభాలు అధికంగా వస్తాయి.

ధనుస్సు (Sagittarius)
రాశ్యధిపతి గురువు స్వనక్షత్రంలో సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల వ్యాపారాలు బలపడతాయి. భాగస్వామ్యాల్లో సమస్యలు తొలగుతాయి. వివాహ, ప్రేమ యోగాలు ఏర్పడతాయి. గృహ, వాహన సౌకర్యాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగంలో అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి.

కుంభం (Aquarius)
పంచమ స్థానంలో గురువు ఉండడం వల్ల అకస్మిక ధనలాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. సంతాన యోగం ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.

పునర్వసు నక్షత్రంలో గురు సంచారం ఈ ఆరు రాశులకు బంగారు అవకాశాలు తెస్తుంది. ఆదాయం, ఆస్తి, ఉద్యోగం, కుటుంబ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

ఇవీ చదవండి: Weekly Horoscope : ఈవారం ఈ రాశివారికి మామూలుగా ఉండదు!
Vehicle Colour Astrology: మీ రాశికి తగిన వాహన రంగు ఏమిటి?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు