CM Jagan at Kakinada: చంద్రబాబు పేరు చెబితే స్కాములు, జగన్ పేరు చెబితే స్కీములు గుర్తుకొస్తాయని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు, ఆయన గజదొంగల ముఠాపై జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాలను ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, దత్తపుత్రుడు, ఎల్లో మీడియాపై ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. (CM Jagan at Kakinada)
- చంద్రబాబు ముఖం చూస్తే స్కాములు గుర్తుకొస్తాయి. జగన్ ముఖం చూస్తే స్కీములు గుర్తుకొస్తాయి. చంద్రబాబు ముఖం చూస్తే లంచాలు, జన్మభూమి కమిటీలు, గజదొంగల ముఠా, వెన్నుపోట్లు, పెత్తందారీ అహంకారం గుర్తుకొస్తుంది. మీ జగన్ ముఖం చూస్తే మాత్రం చిక్కటి చిరునవ్వు కనిపిస్తుంది. లంచాలు లేని డీబీటీ పాలన, నేరుగా బటన్ నొక్కడం, అక్కచెల్లెమ్మల కుటుంబాల్లోకి వెళ్లే పాలన కనిపిస్తుంది. మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి 99 శాతం నిలబెట్టుకున్నది గుర్తుకొస్తుంది.
– సీఎం వైయస్ జగన్
– దేవుడి దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ నుంచి జరుగుతోంది.
– పేదల సొంత ఇంటి కలను నిజం చేస్తూ, అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్రంలో ఎన్నడూ చూడని విధంగా, దేశంలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు దేవుడి దయతో ఇవ్వగలిగాం. (CM Jagan at Kakinada)
– 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఆ ఇళ్లు వేగంగా నిర్మాణంలో కనిపిస్తున్నాయి.
– రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల పంచాయతీలుంటే ఈరోజు 17 వేల వైయస్సార్–జగనన్న కాలనీలు వస్తున్నాయి.
– ఇక్కడ కాలనీల్లో కడుతున్న ఇళ్లు చూసి ఇవి ఇళ్లు కాదు.. ఊళ్లు అని చెప్పడానికి గర్వపడుతున్నా. (CM Jagan at Kakinada)
చాలా సంతోషంగా ఉంది
– 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి మీ అందరి సంతోషాల మధ్య మీతో పంచుకోవడానికి సంతోషపడుతున్నా.
– మన ప్రభుత్వం ఇచ్చిన 5.85 లక్షల ఇళ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. 1,57,566 టిడ్కో ఇళ్లు పూర్తి చేశాం.
– 14,33,000 ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా శరవేగంగా నిర్మాణం జరుగుతోంది.
– ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూస్తున్నాం. దేవుడిని ఇంతకన్నా ఏమడగగలను.
– ఇదే కాకినాడ జిల్లాలో సామర్లకోట ఇంటి స్థలాలకు సంబంధించి పేదల ఇళ్లు చూశా.
– నాన్నగారి విగ్రహం ప్రారంభించి వస్తున్నప్పుడు ఇక్కడ ఇంటి స్థలం ఎంత ఉందని దొరబాబును అడిగా.
– కేవలం ఇంటి స్థలం విలువ అక్షరాలా రూ.12 లక్షలు పలుకుతోందని దొరబాబు చెప్పాడు.
ప్రేమ, బాధ్యతతో అడుగులు వేశాం
– 54 ఎకరాల లేఅవుట్‌లో 2,412 ఇళ్ల స్థలాలు ఇవ్వటం తోపాటు ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది.
– 1000కి పైగా ఇళ్లు ఇదే లే అవుట్లో పూర్తి అయిపోయి గృ హప్రవేశాలు చేశారు.
– ఒక్క ఇళ్ల పట్టాల విషయమే కాదు.. ఇళ్ల నిర్మాణం విషయమే కాదు, నవరత్నాల్లోని ఏ పథకం అమలు తీసుకున్నా, టీబీటీ, నాన్ డీబీటీ తీసుకున్నా, ఇదే ప్రేమ, బాధ్యతతో అడుగులు వేశాం.
– పేదవాడి మీద ప్రేమతో వారి జీవితాలు మార్చాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తూ వస్తున్నాం.
– ఇంతకు ముందున్న ప్రభుత్వం ఏనాడైనా ఇలా పేదల మీద ప్రేమగానీ, బాధ్యత గానీ వాళ్లు చూపలేదు.
రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు
– రుషులు, మునులు, దేవతలు మంచి కోసం యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేయడానికి కుట్రలు చేస్తారని విన్నాం.
– పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు, ఇళ్లు నిర్మించకూడదని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు ఏకంగా కోర్టులకు వెళ్లి కేసులు వేసి ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేశారో మీకు తెలుసు.
– రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చినప్పుడు వనరులు తగ్గిపోయాయి. కోవిడ్ విషయంలో ఖర్చు పెరిగిపోయింది. అయినా ఎక్కడా మీ బిడ్డ సాకులు చెప్పలేదు, కారణాలు చెప్పలేదు.
– ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే పతన, తాపత్రయంతో అడుగులు వేశాం.
రూ.75 వేల కోట్లు ఇవ్వగలిగాం
– రాష్ట్రంలో 72 వేల ఎకరాలు సేకరించి 30.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం.
– ప్రాంతాన్ని బట్టి ఒక్కో ఇంటి స్థలం విలువ రూ.2.5 లక్షలతో మొదలు రూ.12 లక్షలు రూ.13 లక్షల వరకు కనిపిస్తోంది.
– 31 లక్షల ఇళ్ల పట్టాల విలువ రూ.2.5 లక్షలు మాత్రమే అనుకున్నా అక్షరాలా రూ.75 వేల కోట్లు నా అక్కచెల్లెమ్మల పేర్లతో ఇంటి స్థలాల రూపంలో ఇవ్వగలిగాం.
– ఇళ్లు కట్టించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం.
– 21.76 లక్షల ఇళ్లు ఈరోజు వేగంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.
– ప్రతి పేదవాడికీ ఇచ్చే ఇంటి కట్టడానికి అయ్యే ఖర్చు రూ.2.70 లక్షలు.
– ఆ కాలనీల మధ్య డ్రెయినేజీ, నీటి సరఫరా, కరెంటు సరఫరాకు అయ్యే ఖర్చు మరో రూ.32 వేల కోట్లు.
– ఇంతకుముందు జరగనిది, ఈరోజు ఎందుకు జరుగుతోందంటే కారణం కేవలం ముఖ్యమంత్రి మారాడు.
– నేడు ఉన్న ముఖ్యమంత్రికి మనసు ఉంది, మీ పట్ల అభిమానం, బాధ్యత ఉంది. ఇదొక్కటే గత ప్రభుత్వానికి, మీ బిడ్డకు ఉన్న తేడా.
ఒక్క సెంటు కూడా ఇవ్వని బాబు
– చంద్రబాబుకు వేల కోట్ల సంపద ఉంది కానీ, తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు ఆయన ఒక్క సెంటు స్థలం ఇవ్వలేదు.
– అలాంటిది మీ బిడ్డ ప్రభుత్వంలోనే కుప్పంలో కూడా 20 వేల ఇళ్ల పట్టాలు, 8 వేల ఇళ్ల నిర్మాణాలు ఈరోజు జరిగాయి.
– ఆ పెద్ద మనిషి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశాడు. 35 ఏళ్లుగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు. 3 సార్లు సీఎంగా చేశాడు.
– పేద వాడి గడపకు మంచి జరిగింది అంటే కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే.
రాష్ట్రంలో వరుసగా నెలరోజులైనా ఉన్నాడా?
– ఈ పెద్ద మనిషికి రాష్ట్ర ప్రజల మీదగానీ, రాష్ట్రం మీదగానీ, చివరికి కుప్పం మీద గానీ అభిమానం లేదు. అనురాగం లేదు. బాధ్యత లేదు.
– చంద్రబాబు ఇళ్లు పక్క రాష్ట్రం హైదరాబాద్‌లో కనిపిస్తుంది.
– చంద్రబాబు అనే వ్యక్తి వరుసగా ఒక్క నెల అయినా ఎప్పుడైనా మన రాష్ట్రంలో కనిపించాడా? కేవలం ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తున్నాడు. ఇంతకు ముందెప్పుడూ కనిపించలేదు.
ఆడవాళ్లన్నా, పెళ్లిళ్లన్నా గౌరవం ఉందా?
– బాబు దత్తపుత్రుడి స్టోరీ మీ అందరికీ తెలిసిందే. శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్‌లోనే.
– కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడు, నాలుగు సంవత్సరాలకు మారిపోతుంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. మరి తర్వాత ఎక్కడికి పోతాడో?
– ఆడవాళ్లన్నా, పెళ్లిళ్ల వ్యవస్థ అన్నా ఈ పెద్దమనిషికి ఉన్న గౌరవం ఏంటనేది ఆలోచన చేయాలి.
– మన ఇళ్లలో మన అక్కచెల్లెమ్మలను మనం గౌరవించలేకపోతే, మూడేళ్లకు, నాలుగేళ్లకు ఇల్లాళ్లను మారుస్తుంటే, ఆడవాళ్లపై ఇటువంటి చులకన భావం చూపిస్తుంటే మనం ఎలాంటి పాలకులం?
– ఈ ప్యాకేజీ స్టార్.. మన రాష్ట్రం విషయంలో కూడా అంతే. అతను పోటీ చేసి ఓడిపోయిన భీమవరంతోనూ సంబంధం లేదు, గాజువాకతోనూ అనుబంధం లేదు.
– కేవలం ఈ నియోజకవర్గాలను తనకు పనిముట్లుగా చూస్తాడు, యూజ్ అండ్ త్రోగానే భావిస్తాడు.
సొంత వర్గాన్నే అమ్ముకొనే పెద్దమనిషి
– ఈ పెద్దమనిషి తన అభిమానుల ఓట్లు హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకు మాత్రమే అప్పుడప్పుడూ వస్తుంటాడు, పోతుంటాడు.
– సరుకును అమ్ముకునే వాళ్లను చూశాం, సరంజామా అమ్ముకునే వాళ్లను చూశాం.
– కానీ, సొంత పార్టీని, సొంత వర్గాన్ని వేరే వారికి అమ్ముకునే వ్యాపారిని మాత్రం ఇక్కడే ఈ పెద్ద మనిషి రూపంలో చూస్తున్నాం.
– రెండు షూటింగ్‌ల మధ్య విరామంలో ఇక్కడికి వచ్చి పోతాడు.
– ఇలాంటి వ్యాపారం చేసే ఈ వ్యక్తికి, విలువలు లేని ఈ వ్యక్తికి, మన రాష్ట్రమైనా, మన ప్రజలైనా, మన కాపులైనా ఏమి ప్రేమ, ఆప్యాయత ఉంటుంది?
– వీరందరిదీ ఒక్కటే మనస్తత్వం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదవాడికి మంచి జరగాలని కాదు.
– కేవలం దోచుకోవడానికి, హైదరాబాద్‌లో పంచుకోవడానికి.
– ఇలాంటి మహానుభావులంతా అనుక్షణం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతారు.
– బాబుకు ఇక్కడి ప్రజలు అధికారం ఇవ్వలేదని వీళ్లంతా కోపంతో ఊగిపోతుంటారు.
– బాబుకు అధికారం పోయేసరికే, వీళ్లందరికీ ఆదాయాలు పోతాయి కాబట్టి ఫ్యూజులు పోతాయి.
– మన మట్టితోగానీ, మనుషులతో గానీ, రాష్ట్రంతో గానీ ఏ రకమైన బంధం, అనుబంధం ఈ మనుషులకు లేదు.
– వీళ్లంతా మనతో చేసేది కేవలం వ్యాపారం మాత్రమే.
నా ఎస్సీలు అని చెప్పుకోలేరు
– మన ఎస్సీలను నా ఎస్సీలు అని, మన బీసీలను నా బీసీలు అని, మన మైనార్టీలను నా మైనార్టీలు అని, కాపులను నా కాపులు అని కూడా వీళ్లు చెప్పుకోలేరు. మన పేదవాడిని నా పేద వాడు అని చెప్పుకోలేరు.
– పైపెచ్చు ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అవహేళన చేస్తారు.
– బీసీలను తోకలు కత్తిరిస్తా కబడ్దార్ అంటారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం వద్దంటారు.
– పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని కోర్టుల్లో కేసులు వేస్తారు.
– రైతులను ఓన్ చేసుకోలేరు. మన పిల్లల భవిష్యత్ గురించి ఆలోచన చేయలేరు.
– అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతల గురించి వీరికి పట్టనే పట్టదు.
– అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎంత మంచి చేసినా మంటలు పెట్టి చలి కాచుకోవాలనుకుంటారు.
మసిపూసి మారేడుకాయ చేస్తారు
– వారి మనిషి ముఖ్యమంత్రిగా ఉంటే ఎంతటి అన్యాయాలు, దుర్మార్గాలు చేస్తున్నా సమర్థిస్తారు. మసిపూసి మారేడుకాయ చేస్తారు.
– మన రాష్ట్రంలో లేని, రాష్ట్రంపై మమకారం లేని వీరందరికీ ఉన్నది ఒక అరడజను టీవీ చానళ్లు. రెండు పేపర్లు, ఎల్లో సోషల్ మీడియా. అదనంగా ఒక దత్తపుత్రుడు.
– ఇలాంటి రాజకీయాలు మనం సమర్థించవచ్చా?
– రాజకీయాలంటే విలువలు, విశ్వసనీయత ఉండాలి. చనిపోయిన తర్వాత కూడా బతకాలని తపన, తాపత్రయంతో అడుగులు వేయడం.
– చెప్పాడంటే చేస్తాడని చెప్పేదే మాట. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా నిలబడతాడనే వాడే రాజకీయ నాయకుడు.
– అటువంటి విలువలు, విశ్వసనీయత వీరికి ఉన్నాయా?
రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా అభివృద్ధి కనిపిస్తుంది
– మరోవంక మనందరి ప్రభుత్వం.. ఈ 52 నెలల్లోనే ఏం చేసిందో ఎక్కడికి పోయినా కనిపిస్తుంది.
– ఏ పేదవాడి గడపలో అడిగినా చిక్కటి చిరునవ్వుల మధ్య పేదవాడి గొంతులో వినిపిస్తుంది.
– మేనిఫెస్టో అంటే చెత్త బుట్టలో పడేసే ప్రణాళిక కాదు, మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని కొత్త అర్థం చెప్పి99 శాతం వాగ్దానాలను నిలబెట్టుకున్నది మీ బిడ్డ ప్రభుత్వం.
– 87 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలను ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతున్నాయి.
– ఇలాంటి విప్లవాత్మక మార్పు మీ బిడ్డ ప్రభుత్వంలో కనిపిస్తుంది.
మార్పు అంటే ఇదీ..
– ఇంటి ముంగిటకే వస్తున్న రేషన్ మీ కళ్లెదుటే కనిపిస్తుంది.
– బర్త్, క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్లు మీ గడపకే వచ్చి ఇస్తున్న పాలన కనిపిస్తుంది.
– గ్రామాలు మారాయి. స్వరూపాలు మరాయి. పరిపాలన మారింది.
– వాలంటీర్లు కనిపిస్తారు. సచివాలయ వ్యవస్థ కనిపిస్తుంది. లంచాలు లేని వ్యవస్థ గ్రామంలోనే మీ కళ్ల ఎదుటనే కనిపిస్తోంది.
ఆర్బీకేలు, డిజిటల్ చదువులు
– రైతన్నను చేయి పట్టుకొని నడిపించే ఆర్బీకేలు వచ్చాయి.
– నాడు–నేడు ద్వారా విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులు కనిపిస్తాయి.
– మన బడులన్నీ ఇంగ్లీష్ మీడియం బడులయ్యాయి.
– డిజిటల్ చదువులు వచ్చాయి. 8వ తరగతి వారికి ట్యాబ్‌లు కనిపిస్తున్నాయి.
– తల్లులు బడికి పంపితే చాలు అమ్మ ఒడి ఇస్తూ పిల్లల చదువులు ప్రోత్సహించే మార్పు కనిపిస్తుంది.
– విద్యాదీవెన, వసతి దీవెన కనిపిస్తుంది. గ్రామంలోనే ఉన్న పేద కుటుంబాలకు చదువు అన్నది మన కళ్ల ఎదుటే గొప్ప మార్పు జరిగి కనిపిస్తోంది.
ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం
– ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది.
– రాష్ట్రంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలుంటే ఈరోజు మరో 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం.
– 104, 108 వాహనాలు కనిపిస్తాయి. గతంలో 1000 రోగాలకు ఉంటే ఇప్పుడు 3,300 పైచిలుకు రోగాలు ఆరోగ్యశ్రీలోకి వచ్చాయి.
– రెస్టు పీరియడ్‌లో పేదవాడు పని చేసుకొనేలా నెలకు రూ.5 వేల చొప్పున ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ పంపుతున్నాం.
– ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కనిపిస్తోంది. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి ఇంటికీ వచ్చి పేదవాడికి తోడుగా నిలబడుతోంది.
– పేదల ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా 52 నెలల కాలంలో మన కళ్ల ఎదుటనే మన గ్రామంలోనే మార్పు కనిపిస్తోంది.
మనసా, వాచా, కర్మణా అడుగులు
– రైతు భరోసా, అమ్మ ఒడి, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, పింఛన్, ప్రతి పథకాన్నీ తీసుకురావడమే కాదు, మనసా వాచా కర్మణా ప్రతి పథకాన్నీ ప్రతి గడపకూ చేర్చడానికి తపన, తాపత్రయంతో అడుగులు పడుతున్నాయి.
– స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 4 లక్షల ఉద్యోగాలు ఉంటే, మనం నాలుగేళ్ల పాలనలోనే 2.07 లక్షల ఉద్యోగాలిచ్చాం.
– రాష్ట్ర కేబినెట్ లో 67 శాతం సామాజిక న్యాయం కనిపిస్తుంది.
– దిశ యాప్ వల్ల 30,367 మంది ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మలను పోలీస్ సోదరులు వచ్చి రక్షించిన పరిస్థితులు.
– నాలుగేళ్లలో రూ.2.38 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పోతోంది.
– మరి ఇంతకు ముందు ఎందుకు చంద్రబాబు హయాంలో ఎందుకు జరలేదు?
మంచి జరిగి ఉంటేనే తోడుగా నిలవండి
– మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడి అండ లేకపోవచ్చు.
– మీ బిడ్డ వీళ్లను నమ్ముకోలేదు. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా? లేదా? అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి.
– మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి.
– మీ బిడ్డ పైన దేవుడిని, కింద ఉన్న మిమ్మల్ని తప్ప ఇంకొకర్ని నమ్ముకోలేదు.
– చేసిన మంచితో, ఆత్మవిశ్వాసంతో మీ బిడ్డ అడుగులు వేస్తున్నాడు.
– మంచి జరగాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.
ఇదీ చదవండి: CM Review on Agriculture: అన్ని విధాలా ఆదుకుంటున్నాం.. వ్యవసాయంపై సమీక్షలో సీఎం జగన్